Court Heroine : జనసేన కు అందుకే ఓటు వేయలేదంటూ కోర్ట్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Court Heroine : జనసేన కు అందుకే ఓటు వేయలేదంటూ కోర్ట్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
Court Heroine : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరీర్ ప్రారంభించిన పవన్, తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఖుషి సినిమా ద్వారా ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సినీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. జనసేన పార్టీని స్థాపించినప్పటికీ, 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. అయితే ఈ తప్పులను సరిదిద్దుకుంటూ 2024 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసి జనసేన పార్టీ గెలుపొందింది. దీంతో పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Court Heroine : జనసేన కు అందుకే ఓటు వేయలేదంటూ కోర్ట్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
Court Heroine పవన్ అంటే ఎంతో ఇష్టం..కానీ ఆయన పార్టీ కి ఓటు వేయలేదు – కోర్ట్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
పవన్ కల్యాణ్ గెలుపుపై సినీ పరిశ్రమ మొత్తం ఆనందం వ్యక్తం చేసింది. పలు ప్రముఖ నటీనటులు, దర్శకులు, సినీ రంగ ప్రముఖులు పవన్ విజయాన్ని ఘనంగా ఆహ్వానించారు. అయితే “కోర్ట్” సినిమా హీరోయిన్ శ్రీదేవి మాత్రం పవన్‌కు ఓటు వేయలేకపోయానని వెల్లడించారు. పవన్ కల్యాణ్‌కు తాను పెద్ద అభిమాని అయినప్పటికీ, ఎన్నికల సమయంలో ఓటు హక్కు లేకపోవడంతో జనసేనకు ఓటు వేయలేకపోయానని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తన పరిచయంలోని చాలా మందిని పవన్‌కు ఓటు వేయించానని, తాను ఈ విధంగా తన అభిమానాన్ని చాటుకున్నానని చెప్పుకొచ్చింది.
శ్రీదేవి నటించిన “కోర్ట్” సినిమా ఇటీవల విడుదలై మంచి స్పందన పొందింది. ఈ సినిమాను రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో కనిపించారు. హర్ష రోషన్, శ్రీదేవి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నాని నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ముఖ్యంగా శ్రీదేవి జాబిలి అనే పాత్రలో తన అద్భుతమైన అభినయంతో మెప్పించారు.