దిగజారి ప్రోగ్రాంలు చేయొద్దు.. నాగార్జునపై సీపీఐ నారాయణ ఫైర్
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బిగ్ బాస్ షో, నాగార్జునపై మండిపడ్డాడు. మామూలుగా ఇలా ప్రతీసారి బిగ్ బాస్ షోపై ఏదో ఒక రకమైన వివాదాం వస్తూనే ఉంటుంది. కొందరు బిగ్ బాస్‌ను రోడ్డు మీదకు లాగుదామం.. ఆరోపణల చేద్దాం.. తద్వారా ఫేమస్ అవుదామని చూసేవారు కూడా ఉంటారు. బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని, మన సంస్కృతికి విరుద్దమైనదని చెబుతూ ఉంటారు. ఈ సారి సీసీఐ నారాయణ బిగ్ బాస్ మీద ఫైర్ అయ్యాడు.
నాగార్జున సినిమాలు చూస్తుంటానని, ఆయన నటన అంటే అభిమానమని చెప్పుకొచ్చాడు. కానీ బిగ్‌బాస్ షోలో హోస్ట్‌గా నాగార్జున దరిద్రపు పనులు చేశాడని ఫైర్ అయ్యాడు. బిగ్‌బాస్ షోలో ముగ్గురు యువతుల ఫొటోలు పెట్టి, ఒక యువకుడిని ఎవర్ని కిస్ చేస్తావు? ఎవరితో డేటింగ్ చేస్తావు? ఎవర్ని పెళ్లి చేసుకుంటావని బహిరంగంగానే నాగార్జున అడిగాడు.. ఇదే విధంగా తన కుటుంబంలోని మహిళా నటుల ఫొటోలు పెట్టి అడగ్గలడా? అని నాగార్జునను ఏకిపారేశాడు.
పద్ధతిగా ఉన్న నాగార్జున ఎందుకిలా చేస్తున్నాడని నారాయణ నిలదీశాడు. ఈ విషయమై కిందిస్థాయి కోర్టుల్లో కేసులు తీసుకోలేదని చట్టాలు కూడా భయపడుతుంటే తామేం చేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు. మనది పితృభూమి కాదని, మాతృభూమి అని, మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నారాయణ ప్రశ్నించాడు. నటులెవరైనా ఇలా దిగజారి ప్రోగ్రాంలు చేయొద్దని సూచించాడు. ఈ షోపై త్వరలో హైకోర్టులో కేసు వేస్తానన్నాడు. దీని కోసం ఎంత వరకైనా పోరాడుతానని చెప్పుకొచ్చాడు.