Daaku Maharaaj : సంక్రాంతి విన్నర్ బాలయ్యనేనా.. డాకు మహరాజ్ పబ్లిక్ టాక్ ఏంటంటే..!
ప్రధానాంశాలు:
Daaku Maharaj : సంక్రాంతి విన్నర్ బాలయ్యనేనా.. డాకు మహరాజ్ పబ్లిక్ టాక్ ఏంటంటే..!
Daaku Maharaaj : సంక్రాంతికి సినిమాల సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సందడి చేస్తున్నాయి.అయితే ఈ రోజు సంక్రాంతి Pongal సందర్భంగా డాకు మహారాజ్ చిత్రం విడుదల అయింది. శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అయింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించారు.
Daaku Maharaaj టాక్ ఏంటంటే..
అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో బాలయ్య జోరు మీద ఉండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ నటన, డైలాగ్స్ అదిరిపోయాయని, ముఖ్యంగా తమన్ మ్యూజిక్ ఇరగదీసారని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చివరి 30 నిమిషాలు ఊహించేలా ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా బాలయ్య Bala Krishna అభిమానులకు పసందైన విందు లాంటిది అని కూడా చెబుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా బిజిఎం పరంగా ఈ సినిమా మరింత విజయం సాధిస్తుందని, ప్రీమియర్ షో చూసినవారు కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి అయితే సంక్రాంతి బరిలోకి దిగిన బాలయ్య మళ్ళీ సక్సెస్ అయ్యారని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఉరుములతో కూడిన చప్పట్లు వినబడుతున్నాయి. సంక్రాంతి బ్లాక్‌బస్టర్ డాకూ మహారాజ్. ప్రతిచోటా మాస్ వేడుకలతో మార్మోగుతోంది. మాస్ ఎలివేషన్స్, పవర్ ప్యాక్డ్ బాలయ్య ఎంట్రీ సీన్స్, థమన్ సెన్సేషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. బాబీ స్టోరీ, డైరెక్షన్, టెక్నికల్ స్కిల్స్ అద్బుతం..” అంటూ ట్వీట్ చేస్తున్నారు. “నీకు గుడి కట్టాలి తమన్ Thaman.. అసలు ఆ బీజీఏం ఏందీ సామీ.. మంట పుట్టించావ్ బీజీఎం..” అని మెచ్చుకుంటున్నారు.