Deepthi Sunaina : ఆర్ఆర్ఆర్ సాంగ్‌కి పోటాపోటీగా స్టెప్పులేసిన దీప్తి సున‌య‌న, హారిక‌

Advertisement

Deepthi Sunaina : బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన బ‌డా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మార్చి 25న థియేటర్లలో విడుదలై.. రికార్డుల మోత మోగించిన ఆర్ఆర్ఆర్.. తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Advertisement

ఇవాళ ఓటీటీలో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది జీ 5. ప్రారంభించిన నాటినుండి వినోదంలో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటిటి లలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని అన్ని భారతీయ భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆర్ఆర్ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్‌లో అదరగొట్టింది.

Advertisement
Deepthi Sunaina And Harika steps for rrr song
Deepthi Sunaina And Harika steps for rrr song

Deepthi Sunaina : కాంబినేష‌న్ అదిరింది..!

నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌‌పైగా వసూలు చేసి రూ. 100 కోట్ల‌కు పైగా గ్రాస్‌ను అందుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ హక్కులను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా.. హిందీ వెర్షన్‌ హక్కులను మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ కొనుగొలు చేసింది.అయితే ఆర్ఆర్ఆర్ ఓటీటీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా యూట్యూబ‌ర్స్ దీప్తి సున‌య‌న, దేత్త‌డి హారిక నాటు నాటు సాంగ్‌కి త‌న‌దైన స్టెప్పులు వేశారు. వారి డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. అంతేకాదు ఈ ఇద్ద‌రి ప‌ర్‌ఫార్మెన్స్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.

Advertisement
Advertisement