Deepthi Sunaina Shanmukh : దీప్తి సునైన షణ్ముఖ్ బ్రేకప్ కు బిగ్‌బాస్ కాకుంటే మరేంటి.. ఇంకెవ్వరు?
Deepthi sunaina Shanmukh : దీప్తి సునైన మరియు షన్నూలు మళ్లీ కలుస్తారనే ఆశలు ఇన్నాళ్లు పెట్టుకుని ఉన్న వారి అభిమానులు పూర్తిగా ఆ ఆశలను వదిలేసుకున్నారు. ఇద్దరు కూడా మూవ్ ఆన్ అయ్యారు. ఎవరికి వారు అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఇద్దరు కూడా సోషల్ మీడియాలో విడి పోయినట్లుగా ప్రకటించారు. దీప్తి మొదటగా బ్రేకప్ చెప్పగా షన్నూ కూడా దాన్ని సమర్థిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఆయన నుండి అలాంటి ఒక సమాధానం వస్తుందని ఊహించలేదు అంటూ ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరికి ఉన్న అనుబంధం ఇంత సింపుల్ గా బ్రేకప్ అవుతుందని ఊహించలేదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో షన్నూ మరియు దీప్తిలు అసలు బిగ్ బాస్ వల్లే విడిపోయారా అంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు.
సిరి ఇటీవల మాట్లాడుతూ వారిద్దరి అంత వీక్ ప్రేమ అని నేను అనుకోవడం లేదు. కేవలం వంద రోజుల విషయమై వారిద్దరు విడి పోతారు అని నేను భావించడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. నెట్టింట వారిద్దరు కలిసి గతంలో తీసుకున్న ఫొటోలు మరియు వీడియోలు ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. కనుక ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి మళ్లీ మళ్లీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున బ్రేకప్ గురించి ఈ సమయంలో మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.దీప్తి సునైన మరియు షన్నూ ల ప్రేమను మొదటి నుండి ఇరు కుటుంబాలు స్వాగతించిన దాఖలాలు లేవట. ఇప్పుడు షన్నూ బిగ్ బాస్ లో వ్యవహరించిన తీరుతో దీప్తి కుటుంబ సభ్యులకు అతడంటే మరింత కోసం ఏర్పడిందట.

deepthi sunaina and Shanmukh love breakup reasons
Deepthi sunaina Shanmukh : కుటుంబ వ్యవహారమే కారణమా..!
దీప్తి సునైనాకు అలాంటి భావన ఏమీ లేకున్నా కూడా ఆమె కుటుంబ సభ్యులు అతడిపై ఉన్న అభిప్రాయంను మార్చుకోలేక పోయారట. దానికి తోడు బిగ్ బాస్ తర్వాత షన్నూ వ్యవహరించిన తీరు విమర్శల పాలయ్యింది. అంతకు ముందు ఉన్న గొడవలు మరియు ఇతర విషయాలు మొత్తం కలిసి దీప్తి సునైన షాకింగ్ గా బ్రేకప్ చెప్పేసిందట. బిగ్ బాస్ లో షన్నూ మరియు సిరిల వ్యవహారం మాత్రమే కాకుండా ఇంకా ఇతర విషయాలు కూడా వారి బ్రేకప్ కు కారణం అయ్యాయి అని.. ముఖ్యంగా వారి కుటుంబాలు ఈ విషయంలో ఆసక్తిగా లేకపోవడం వల్ల వారు విడిపోవాల్సి వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది చూడాలి.