Deepthi Sunaina : ఫుల్ కిక్కిస్తున్న దీప్తి సున‌య‌న‌… క్యూట్ డ్యాన్స్‌తో సోష‌ల్ మీడియా షేక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Deepthi Sunaina : ఫుల్ కిక్కిస్తున్న దీప్తి సున‌య‌న‌… క్యూట్ డ్యాన్స్‌తో సోష‌ల్ మీడియా షేక్

Deepthi Sunaina : బిగ్ బాస్ సీజ‌న్ లో త‌నీష్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతూ అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ దీప్తి సునయ‌న‌. యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :26 February 2022,10:00 pm

Deepthi Sunaina : బిగ్ బాస్ సీజ‌న్ లో త‌నీష్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతూ అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ దీప్తి సునయ‌న‌. యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. దీప్తి సునైనా తాజాగా వేసిన డ్యాన్స్ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది.

దీప్తి సున‌యన ఇటీవ‌లి కాలంలో ప‌లు హిట్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ తెగ‌సంద‌డి చేస్తుంది. ఓ గ్యాంగ్‌తో దీప్తి సున‌య‌న చేసే డ్యాన్స్ మెంటలెక్కిస్తుంది. ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షో నెట్టింట తెగ‌వైరల్ అవుతుంటుంది. తాజాగా దీప్తి సుయ‌న ఫుల్ కిక్ అనే పాట‌కు చిందులేస్తూ ర‌చ్చ చేసింది. ఈ అమ్మ‌డి స్ట‌న్నింగ్ లుక్స్‌కి కుర్ర‌కారు మైర‌చిపోతున్నారు. దీప్తి సున‌య‌న డ్యాన్స్ కూడా కేక పెట్టిస్తుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం దీప్తి సున‌య‌న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారుతుంది. యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి.సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు సెలెబ్రిటీలుగా మారిపోయారు.

deepthi sunaina dance video entertain the audience

deepthi sunaina dance video entertain the audience

Deepthi Sunaina : దీప్తి రచ్చ మాములుగా లేదుగా..

అలాంటి వారిలో దీప్తి సునైనా ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో అ అమ్మడు తెగ పాపులర్ అయింది. అంతేకాదు, దీని ద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని కూడా అందుకుంది. మరీ ముఖ్యంగా ఎంతో మందికి క్రష్‌గా కూడా మారిపోయిందీ బ్యూటీ. దీప్తి సునైనా.. యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అలా చాలా కాలం పాటు జంటగా సందడి చేశారు. ఇటీవ‌ల ఇద్ద‌రు బ్రేక‌ప్ చెప్పుకున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది