Shanmukh : షణ్ముక్‌తో బ్రేకప్‌పై దీప్తి రియాక్షన్.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోనే ఏడ్చేసింది..
Shanmukh : బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో రన్నరప్ గా షణ్ముక్ నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ షో తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఊహించని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తన లవర్‌తో బ్రేకప్ చేసుకున్నాడు. షణ్ముక్‌తో బ్రేకప్ అయినట్టు ఇటీవలే సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేసింది షణ్ముక్ లవర్ దీప్తి సునయన. ఇక తాజాగా ఇన్‌స్టా లైవల్ లోకి వచ్చిన ఆమె.. తన ఫాలోవర్స్ బ్రేకప్ గురించి ఎక్కువగా ప్రశ్నిస్తుండటంతో కాస్త ఎమోషనల్ అయింది. ఇన్ స్టాలో లైవ్‌లోనే ఏడ్చేసింది.
షణ్ముక్, తాను విడిపోతున్నట్టు న్యూ ఇయర్ రోజునే ఇన్ స్టా వేదికగా వెల్లడించింది దీప్తి సునయన. బిగ్‌బాస్ హౌజ్‌లో షణ్ముక్, సిరి చేసిన పనులను దీప్తి చాలా డిస్టర్బ్ అయింది. సిరి, షణ్ముక్ మధ్య హగ్గులు, కిస్సులు చూసి కాస్త తగ్గుకోలేకపోయింది. అయినా అందులో షణ్ముక్ కు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. షణ్ముక్‌కు బయట నుంచి ఓటింగ్ ఎక్కువగా పడేలా కష్టపడింది. కానీ, సిరి, షణ్ముక్ చేసే ఓవర్ యాక్షన్ ఆడియన్స్ కు నచ్చలేదు. దీంతో షణ్ముక్ రన్నరప్ కే పరిమితమయ్యాడు. హౌస్ నుంచి షణ్ముక్ బయటకు రాగానే షణ్ముక్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను సైతం బ్లాక్ చేసేసింది.

deepti reacts to breakup with shanmukh and cries in insta live
Shanmukh : న్యూ ఇయర్ రోజునే..
తర్వాత తాము విడిపోతున్నట్టు లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీప్తి. దీనిపై షణ్ముక్ సైతం ఎమోషనల్ గానే స్పందించాడు. తర్వాత వీరిద్దరి బ్రేకప్‌కు సిరి, హనుమంతే కారణమన్న వార్తలు సైతం బలంగానే వచ్చాయి. తాజాగా ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన ఆమెను తన ఫాలోవర్స్ ప్రశ్నలు అడిగారు. తాను లైఫ్ లో ముందుకెళ్లాలని అనుకుంటున్నానని, తన కెరీర్, లైఫ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని తెలిపింది. అనంతరం బ్రేకప్ విషయంలో కాస్త ఎమోషనల్ అయి కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే లైవులోంచి వెళ్లిపోయింది.