Deepthi Sunaina : దీప్తి సునయన గ్లామర్ డోస్ పెంచేస్తోంది.. ఆ అందాలతో కనువిందు చేస్తూ .. వీడియో
Deepthi Sunaina : యూట్యూబర్ దీప్తి సునయన అందరికీ సుపరిచితమే. డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన యూట్యూబర్ గా వీడియో సాంగ్స్ చేస్తూ కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. డ్యాన్స్ వీడియోస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. దీంతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ బ్యూటీ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 2లో చేసిన సందడి అంతా ఇంత కాదు. క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. ఈ షో తో మరింత ఫేమ్ సంపాధించుకుంది.
ఇక పలు సినిమాల్లో కూడా దీప్తీ అలరించింది. ఇక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ఐదేండ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది జనవరిలో బ్రేక్ అప్ చెప్పేసింది. ఇక బ్రేకప్ నుంచి తేరుకున్న దీప్తి సునయన ప్రస్తుతం వరుస ఫొటో షూట్స్ తో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే దీప్తి అభిమానులతో అప్పుడప్పుడు తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు వీడియోస్, ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
హాట్ ఫొటో షూట్స్ చేస్తూ అందాలతో కనువిందు చేస్తోంది. పొట్టి దుస్తుల్లో, శారీలో, లెటెస్ట్ ఫ్యాషన్స్ డ్రెస్సింగ్ తో ఆకట్టుకుంటోంది. ట్రెండీ వేర్స్ లో కనువిందు చేస్తూనే చీరకట్టులో కూడా కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా ప్రస్తుతం దీప్తీ హాట్ డ్రింక్ తాగుతున్న వీడియో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్స్ లో సాంగ్స్ వింటూ హాట్ డ్రింక్ తాగుతోంది. డ్రింక్ తాగుతూ సాంగ్ ని ఎంజాయ్ చేస్తోంది. సాంగ్ లోని భావాలకు తగినట్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో దీప్తీ ప్రశాంతంగా కనబడుతోంది.
View this post on Instagram