Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

 Authored By ramu | The Telugu News | Updated on :3 August 2025,6:21 pm

ప్రధానాంశాలు:

  •  Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే... జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా దేవ‌ర 2 చిత్రం కూడా రూపొంద‌నుంది. నందమూరి తారక్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దేవర 2’ చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ వెలువడింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ పూర్తికాగానే, ‘దేవర 2’ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు స‌మాచారం.

Devara 2 Movie దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie అప్ప‌టి నుండి షూట్..

దేవర చిత్రం విడుద‌లై మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఈ మూవీ పార్ట్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ప్ర‌స్తుతం దర్శకుడు కొరటాల శివ తీరిక లేకుండా గడుపుతున్న‌ట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ వ‌స్తున్న‌ వార్తల ప్రకారం ‘దేవర 2’ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మొదటి భాగం హిట్ అయిన నేపథ్యంలో, రెండో భాగం కూడా అంతే స్థాయిలో అలరిస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తారక్ కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది