Director Maruthi : ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ మారుతి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Director Maruthi : ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ మారుతి…!

 Authored By aruna | The Telugu News | Updated on :3 February 2024,5:10 pm

Director Maruthi : తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ట్రూ లవర్ అనే సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మారుతి ,మూవీ డైరెక్టర్ ప్రభు ,అలాగే హీరో హీరోయిన్స్ కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మారుతి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ముందుగా సినిమా గురించి మాట్లాడిన ఆయన ట్రూ లవర్ గురించి తెలియజేశారు. ఇద్దరు ట్రూ లవర్స్ వారిద్దరి మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ ని సిచువేషన్ ని ఎలా ఫేస్ చేసి ముందుకెళ్లారు లైఫ్ లో అనే విషయాలు గురించి సినిమా ఉంటుందని తెలియజేశారు. అలాంటి వారందరికీ ఈ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్ అని తెలియజేశారు. అలాగే ట్రూ లవర్స్ అందరూ కచ్చితంగా ఈ సినిమా చూడాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మొదటి పది నిమిషాలు చూస్తే చాలు 2 గంటలు కూడా తెలియకుండా సాగిపోతుందని ఆయన అన్నారు. సినిమా పూర్తయ్యే సమయానికి ఇంకా ఏదో ఉంటే బాగుండు ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్ తో బయటికి వస్తారని ఆయన తెలిపారు.

అయితే వాలెంటెన్స్ డే సందర్భంగా వస్తున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ మూర్తి అనేక విషయాలను తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నిజంగా ఒక అబ్బాయి పడ్డ తపన వేదన పసిసివ్ నెస్ స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు. ఇక అమ్మాయి విషయంలో కూడా ఇలాంటివి ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాను వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలు చేస్తున్నడంతో ఇంటర్వ్యూలో యాంకర్ మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అంటూ మారుతి గారిని అడగడం జరిగింది. ఇక దానికి ఆయన సమాధానం ఇస్తూ మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలియజేశారు. ముందుగా లవ్ చేసుకున్న తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని ఆయన తెలిపారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా వస్తున్న ట్రూ లవర్ సినిమా నిజ జీవిత సినిమాగా భావించవచ్చని మారుతి తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ ప్రభు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ప్రభుకి కాస్త పొగరు ఎక్కువ అని కానీ మంచివాడు అంటూ తెలియజేశారు. ఇక ఈ సినిమా పేరు కూడా లవర్ అని ఇంతకు మునిపే ఉండటం వలన దానికి ట్రూ యాడ్ చేసి ట్రూ లవర్ అని పెట్టినట్లుగా ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే హీరోయిన్ హీరో గురించి కూడా మారుతి పలు రకాల కామెంట్స్ చేశారు. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈసినిమాను ట్రూ లవర్స్ కచ్చితంగా చూడాలని ఈ సినిమా చూస్తున్నంత సేపు మీలో మీరే మమేకమై పోతారని ఆయన తెలిపారు. దీంతో ప్రస్తుతం మారుతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఫిబ్రవరి లో వచ్చే వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమాలో మణికంధన్, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రలో కనిపించినుండగా ప్రభురామ్ వ్యాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకత్వం సీన్ రోల్డెన్ అందించడం జరిగింది .ఇక ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్ బ్యానర్ పై మారుతి టీం మాస్ మూవీ మేకర్స్ ప్రజెంట్ చేస్తున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది