Bigg Boss OTT Telugu : కేకు టాస్క్ లో అఖిల్, అజయ్ మధ్య గొడవ.. చివరకు అది ఎక్కడికి దారి తీసిందో తెలుసా?
Bigg Boss OTT Telugu : ఇదేం బిగ్ బాస్ హౌసో ఏమో.. ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాలకు అలగడం.. చిన్నబుచ్చుకోవడం.. ఏడవడం.. వామ్మో.. బిగ్ బాస్ హౌస్ మొత్తం ఇదే నడుస్తోంది. అసలే.. మసాలా లేక.. హాట్ హాట్ లేక బిగ్ బాస్ హౌస్ చాలా డ్రైగా ఉంది. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు అవుతున్నాయి కానీ.. అన్నీ చప్ప చప్పటి గొడవలే. ఆ గొడవలు.. చిన్న విషయాలకే పెట్టుకోవడం.. వెంటనే ఏడవడం.. ఆవేశపడటం.. మళ్లీ వెళ్లి కౌగిలించుకోవడం.. అబ్బే పస లేదు అంటున్నారు ప్రేక్షకులు.కేక్ టాస్క్ లో అదే జరిగింది. బిగ్ బాస్ కేక్ టాస్క్ ఇచ్చాడు.
ఆ కేక్ టాస్క్ లో కేక్ మీద ఉన్న చెర్రీ కిందపడకుండా దాన్ని ముక్కలుగా ఒక్కో కంటెస్టెంట్ కోయాలని బిగ్ బాస్ చెబుతాడు. దీంతో చాలెంజర్స్ టీమ్ నుంచి ఒక కంటెస్టెంట్.. వారియర్స్ టీమ్ నుంచి మరో కంటెస్టెంట్ వెళ్లి కేక్ ను కట్ చేయాలి.చాలెంజర్స్ నుంచి ఒకరు.. వారియర్స్ నుంచి ఒకరు.. ఇలా కేక్ కట్ చేస్తూ ఉన్నారు. కానీ.. ఇంతలోనే అఖిల్ వంతు వచ్చింది. అప్పటికే కేకు మొత్తం అయిపోయింది. కేవలం చెర్రీ కింద మాత్రమే కేక్ మిగిలింది. అయినా కూడా అఖిల్ మెల్లగా చెర్రీ కింద పడకుండా కేక్ కట్ చేశాడు.చివరకు అది ఎక్కడికి దారి తీసిందో తెలుసా? అఖిల్ కేక్ కట్ చేశాక.. చాలెంజర్స్ టీమ్ మెంబర్ బిందు వచ్చి కేక్ కట్ చేసేలోపే ఆ చెర్రీ కింద పడిపోయింది.

dispute between akhil and ajay in cake task in bigg boss ott telugu
Bigg Boss OTT Telugu : అఖిల్ వంతు వచ్చేసరికి.. కింద పడిపోయిన చెర్రీ
దీంతో అఖిల్ కట్ చేసిన తర్వాతనే చెర్రీ కిందపడిందని దీంతో మాదే గెలుపు అంటూ చాలెంజర్స్ టీమ్ సంబురాలు చేసుకున్నారు.కట్ చేసిన చాలా సేపటి తర్వాత అది కిందపడిందని అఖిల్ తో పాటు వారియర్స్ టీమ్ సభ్యులు చెప్పినా చాలెంజర్స్ టీమ్ మాత్రం వినలేదు. చివరకు అఖిల్ బెస్ట్ ఫ్రెండ్ అజయ్ కూడా ఈ విషయంలో ఏం మాట్లాడక పోవడంతో అఖిల్ ఫీల్ అయ్యాడు.తర్వాత అజయ్ వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడకుండా వెళ్లిపోయాడు అఖిల్. చివరకు అజయ్ వెళ్లి అఖిల్ ను కూల్ చేశాడు. ఆ తర్వాత స్రవంతి కూడా వెళ్లి అఖిల్ ను కూల్ చేసింది. అఖిల్, అజయ్, స్రవంతి ఒక గ్రూప్. వాళ్లు ఎప్పటికీ కలిసే ఉంటారు. ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ ముగ్గురు కలుస్తూనే ఉంటారు.