Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు మళ్లీ అడ్డంకులు..!
ప్రధానాంశాలు:
Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు మళ్లీ అడ్డంకులు..!
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటించిన భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. కానీ రిలీజ్ తేది దగ్గరపడుతున్న కొద్దీ అనూహ్య అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల బాకీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు మళ్లీ అడ్డంకులు..!
Hari Hara Veera Mallu : మరో కొత్త సమస్య
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ‘హరిహర వీరమల్లు’ను నిర్మించిన ఏఎం రత్నం గతంలో నిర్మించిన కొన్ని చిత్రాలకు సంబంధించిన పంపిణీ బాకీలను ఇంకా తీర్చలేదని నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు.ఆక్సిజన్ (2017) సినిమా పంపిణీ హక్కులు ఆసియన్ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసిన సమయంలో కలెక్షన్లు తక్కువైతే రీఫండబుల్ ఒప్పందం చేశారు.
ఇప్పటివరకు వడ్డీతో కలిపి రూ.2,60,42,548 తిరిగి ఇవ్వాల్సిన బాకీ ఉందని వారు పేర్కొన్నారు.మరోవైపు ముద్దుల కొడుకు, బంగారం సినిమాలకు సంబంధించి రూ.90 లక్షలు రీఫండబుల్ అడ్వాన్స్‌గా మహాలక్ష్మి ఫిలిమ్స్ ఇవ్వగా అది ఇప్పటివరకు చెల్లించలేదని మరో ఫిర్యాదు చేశారు.మొత్తం బాకీ: ₹ 3,50,42,548. ఈ మొత్తం రికవరీ కాకపోతే నైజాం ఏరియాలో ‘హరిహర వీరమల్లు’ విడుదలను అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. కాగా ఈ సినిమా 2020 లో ప్రారంభమైనా అనేక కారణాలతో వాయిదాల పాలైంది