Viral Video : మరణం తధ్యమని తెలిసి భార్యకు విడాకులు ఇచ్చి.. చదివించిన భర్త వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : మరణం తధ్యమని తెలిసి భార్యకు విడాకులు ఇచ్చి.. చదివించిన భర్త వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :10 April 2023,5:00 pm

Viral Video : ప్రస్తుత రోజుల్లో పెళ్లి చేసుకున్న భార్యపై పలు అనుమానాలతో చాలామంది ప్రాణాలు తీసేస్తున్నారు. సమాజంలో పెరిగిన టెక్నాలజీ చేతిలో ప్రపంచం స్నేహం చేయడానికి రకరకాల మార్గాలు ఉండటంతో… చాలా కుటుంబ జీవితాలలో ప్రేమకు బదులు అనుమానాలు ఎక్కువైపోయాయి. ఇటువంటి ప్రపంచంలో ఓ భర్త తన మరణాన్ని ముందే తెలుసుకొని కట్టుకున్న భార్యకు మంచి జీవితం కలిగేలా… చదువు కోసం డబ్బులు సమకూర్చి చదివించడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఏవూరి హర్షవర్ధన్ అనే యువకుడు.. ఆస్ట్రేలియాలో డాక్టర్ గా పని చేస్తున్నాడు.

What Happened To Dr Harshavardhan Khammam? Father And Mother Emotional Crying After Doctor's Death

అయితే 2020 ఫిబ్రవరి నెలలో హర్షవర్ధన్ కి సింధు అనే అమ్మాయితో పెళ్లయింది. ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు చాలా ఘనంగా నిర్వహించారు. అయితే పెళ్లయ్యాక ఫిబ్రవరి నెలకొరికి భార్యని విడిచిపెట్టి ఆమెకు వేసా ఏర్పాటు కోసం ఆస్ట్రేలియా వెళ్లడం జరిగింది. ఆ తర్వాత భార్యను తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా కరోనా రావడం జరిగింది. ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఇటువంటి క్రమంలో హర్షవర్ధన్ కి లంగ్ క్యాన్సర్ రావడం జరిగింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయగా వెంటనే ఇండియాకు వచ్చేయమంటారు.

Divorced his wife knowing that death was imminent video

Divorced his wife knowing that death was imminent video

కానీ ఆస్ట్రేలియాలోనే ట్రీట్మెంట్ తీసుకోబోతున్నట్లు హర్ష బదులిచ్చాడు. కానీ ఉన్న కొద్ది వ్యాధి తీవ్రతరం కావడంతో వైద్యులు మరణం తద్యమని చెప్పటంతో హర్ష ఎంతో తలడిలిపోయాడు. ఈ క్రమంలో కేవలం పెళ్లయి వారం రోజులు మాత్రమే కావటంతో భార్య సింధు భవిష్యత్తు గురించి ఆలోచించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆమెను విడాకులకు ఒప్పించి.. అమెరికాలో ఒక మంచి చదువు చదవటానికి అన్ని సదుపాయాలు కల్పించి ఆమె భవిష్యత్తుకి కావాల్సిన ఏర్పాట్లు హర్ష దగ్గరుండి చూసుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల బాధ్యతను తమ్ముడికి అప్పగించి.. తన చావు ఎవరికీ భారం కాకుండా తుది శ్వాస విడిచాడు.

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది