Mohan babu : మొహన్ బాబు మొదటి భార్య గురించి ఎవరీకి తెలియని టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mohan babu : మొహన్ బాబు మొదటి భార్య గురించి ఎవరీకి తెలియని టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

 Authored By govind | The Telugu News | Updated on :26 July 2021,8:30 am

Mohan babu : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్‌గా, డైలాగ్ కింగ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న సీనియర్ హీరో మంచు మోహన్ బాబు. సినిమాలలోకి రాకముందు ఆయన పేరు భక్తవత్సలం నాయుడు. అయితే సినిమాలలోకి వచ్చినప్పుడు నటుడిగా స్క్రీన్ పేరు వేయాలనుకున్నప్పుడు ఈ పేరుకంటే మరో పేరు అయితే బాగా రాణిస్తాడనే ముందు చూపుతో స్టార్ డైరెక్టర్‌గా వెలిగిన దర్శకరత్న దాసరి నారాయణరావు మోహన్ బాబు అనిపేరు మార్చారు. అలా మోహన్ బాబు పేరు మారి నేడు ఇదే పేరుతో ఇండియా మొత్తం పాపులర్ నటుడిగా, విద్య సంస్థల అధినేతగా, నిర్మాతగా కొనసాగుతున్నారు.

do you know about mohan babu first wife

do you know about mohan babu first wife

అయితే ఆయన పేరు మాదిరిగానే ఆయనకి మొదటి భార్య కి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియవు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభ రోజుల్లోనే మోహన్ బాబుకి విద్యాదేవితో పెళ్ళి జరిగింది. వీరి సంతానంగా మంచు విష్ణు, లక్ష్మీ పుట్టారు. అయితే మోహన్ బాబు వరుసగా సినిమా అవకాశాలు వస్తుండటంతో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారారు. ఆ సమయంలో మోహన్ బాబు షూటింగ్ ముగించుకొని ఇంటికి ఆలస్యంగా వచ్చేవారట. అది భార్య విద్యాదేవికి అంతగా నచ్చేది కాదట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయట, దాంతో ఓరోజు బలవన్మరణం చేసుకుంది.

Mohan babu : మోహన్ బాబు నిర్మలా దేవితో పెళ్ళి అయ్యాక అతికోపం క్రమంగా తగ్గింది.

do you know about mohan babu first wife

do you know about mohan babu first wife

అయితే ఆ సమయంలో విష్ణు, లక్ష్మీ చిన్నపిల్లలు కావడంతో వాళ్ళకి తల్లిలేని లోటు ఉండకూడదనే కారణంతో మోహన్ బాబుకి నచ్చజెప్పి విద్యాదేవి సోదరి నిర్మలా దేవితో పెళ్ళి జరిపించారట. ఆ తర్వాత వీరికి మనోజ్ పుట్టాడు. ఇక నిర్మలా దేవి ఎలాంటి బేధభావం లేకుండా అక్క పిల్లలైన విష్ణు, లక్ష్మీలను కూడా మనోజ్ తో సమానంగా చూస్తోంది. అయితే మోహన్ బాబు కెరీర్ లో జరిగిన ఈ సంఘటన మాత్రం ప్రేక్షకులో అతికొద్ది శాతం మందికే తెలిసిన విషయం. కాగా మొదట్లో అతికోపం ఉన్న మోహన్ బాబు నిర్మలా దేవితో పెళ్ళి అయ్యాక క్రమంగా తగ్గింది. అయితే ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మోహం మీదే మాట్లాడే తత్వం మాత్రం ఇప్పటికీ మారలేదు.

ఇది కూడా చ‌ద‌వండి ==>  షర్ట్ తీసి.. లోపల బటన్‌ కూడా తీసేసి ఏంటమ్మడు ఈ రచ్చ

ఇది కూడా చ‌ద‌వండి ==> సుమ-రాజీవ్ కనకాలతో సినిమా.. యంగ్ డైరెక్టర్ భారీ ప్లానింగ్

ఇది కూడా చ‌ద‌వండి ==> నేను బిజీగా ఉంటే ఆ పని నువ్వే చెయ్.. దీపిక పిల్లిని వాడేస్తున్న యాంకర్ రష్మి

ఇది కూడా చ‌ద‌వండి ==> అతని దగ్గరికి వారానికి రెండు సార్లు వెళ్తాను.. గుట్టువిప్పిన అనసూయ..!

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది