Suma And Rajeev Kanakala టాలీవుడ్ ప్రేక్షకులను సుమ రాజీవ్ కనకాల Suma And Rajeev Kanakala గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. బుల్లితెర, వెండితెరపై సుమ చేసిన, చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. గత కొన్ని దశాబ్దాలుగా టెలివిజన్ రంగంలో సుమ వేసిన ముద్ర అందరికీ తెలిసిందే. నటిగా, యాంకర్‌గా సుమ ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. వెండితెరపైనా సుమ కొన్ని పాత్రలను పోషించింది. ఇక రాజీవ్ కనకాల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో చిత్రాల్లో రాజీవ్ కనకాల తన నటనతో ఆకట్టుకున్నారు.

సుమ-రాజీవ్ కనకాల ప్రశాంత్ వర్మ ఓ కథ రెడీ కోసం
బుల్లితెర, వెండితెరపై రాజీవ్ కనకాల Suma And Rajeev Kanakala తన సత్తా చాటుకున్నారు. అయితే నిజ జీవితంలో సుమ రాజీవ్ కనకాల ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరూ వెండితెరపై కలిసి నటిస్తే.. ఈ ఇద్దరి మీదే ఓ కథ అల్లితే ఎలా ఉంటుందో చూడాలని అందరికీ ఉంటుంది. అలా ఓ యంగ్ దర్శకుడు ఓ కథను కూడా సిద్దం చేసుకున్నారట. నాలుగైదేళ్ల క్రితమే ప్రశాంత్ వర్మ ఓ కథను రెడీ చేశారట. రాజీవ్ కనకాల సుమను మెయిన్ లీడ్‌గా అనుకుంటూ కథ సిద్దం చేశాడట.

ఈ మేరకు తాజాగా రాజీవ్ కనకాల కొన్ని విషయాలు బయటపెట్టేశాడు. ప్రశాంత్ వర్మ సిద్దం చేసిన కథ చాలా బాగుంటుందని, కానీ బడ్జెట్ పెట్టే నిర్మాత దొరక్కపోవడంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పడిపోయిందన్నాడు. ఇప్పటికీ ఆ కథ ఉందని, నిర్మాత దొరికితే చూడాలని అన్నాడు. ఆ కథ చాలా బాగుంటుందని, టామ్ అండ్ జెర్రీ టైపులో ఉంటుందని అంచనాలు పెంచేశాడు. మొత్తానికి రాజీవ్ కనకాల సుమ కాంబినేషన్‌లో సినిమా వస్తే మాత్రం అది అదిరిపోతుందనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి ==> జులై 26, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్.. విషం కలిపిన నీళ్లను తాగిన దీప..!
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యణ్ బాలు మూవీలో చిన్నారి ఇప్పుడు ముంబై మోడల్స్‌నే మించిపోయింది చూశారా
ఇది కూడా చదవండి ==> కార్తీక్, దీప ఎప్పుడు కలుసుకుంటారో క్లారిటీ ఇచ్చిన కార్తీకదీపం డైరెక్టర్..!
ఇది కూడా చదవండి ==> పెళ్లిపై షాకింగ్ కామెంట్స్.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో