pushpa keshava : కేశవకు పెద్ద యాక్సిడెంట్.. ‘పుష్ప’ అవకాశం మిస్సయ్యేవాడు కానీ..!
pushpa keshava : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సాధారణ ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు, క్రికెటర్లు చిత్రం చూసి ఫిదా అయిపోతున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో బన్నీ తర్వాత అంతటి పేరు స్నేహితుడు ‘కేశవ’ పాత్ర పోషించిన జగదీశ్‌కు వచ్చింది. అయితే, నిజానికి తనకు జరిగిన యాక్సిడెంట్ వలన జగదీశ్ ఆ పాత్రి పోషించే అవకాశం మిస్సయ్యేవాడట. కానీ, అలా జరగలేదు. ఇంతకీ ఆ కథ ఏంటంటే..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పక్కన ‘జబర్దస్త్’ ఫేమ్ మహేశ్‌ను పెట్టి సినిమా తీశాడు. అలా ఆ మూవీ బాగా సక్సెస్ అయింది. కాగా, ‘పుష్ప’లోనూ స్నేహితుడి పాత్రకు కొత్త నటుడు జగదీశ్ బండారికి చాన్స్ ఇచ్చాడు. అది కూడా బాగా క్లిక్ అయింది. ‘పుష్ప’ పార్ట్ వన్ తో పాటు పార్ట్ టూలోన ఫుల్ లెంగ్త్ రోల్ అలా.. జగదీశ్ బండారికి వచ్చింది. కానీ, అప్పటికే కరోనా పాండమిక్ స్టార్ట్ కావడం.. షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. అలా సినిమా షూటింగ్ ఆరు నెలలు పోస్ట్ పోన్ కాగా, ఆ టైంలో జగదీశ్ రికవరీ అయ్యాడు.
pushpa keshava : ఎవడబ్బా ఈ నటుడు అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన జగదీశ్..
‘పుష్ప’ కంటే ముందర జగదీశ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ ఏ సినిమాలోనూ ప్లే చేయలేదు. కానీ, చిన్న చిన్న పాత్రలు అయితే జగదీశ్ పోషించాడు. కరుణ కుమార్ తెరకెక్కించిన ‘పలాస 1978’ ఫిల్మ్‌తో పాటు ప్రియదర్శి కథానాయకుడిగా తెరకెక్కిన ‘మల్లేశం’ పిక్చర్‌లో నటించాడు. సీమ యాసలో అద్భుతంగా మాట్లాడిన ఈ జగదీశ్‌ను చివరకు చిత్తూరు యాసలో మాట్లాడే ‘కేశవ’గా సుకుమార్ మార్చేశాడు. ఈ చిత్రంలో కేశవ కెరీర్ సెట్ అయిపోయింది. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చిన జగదీశ్..ఒకే ఒక సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.