Hansika : పెళ్లి జరిగి మూడు నెలలు కాలేదు.. హన్సిక జీవితంలో బిగ్ బాంబ్..!

Advertisement

Hansika : హన్సిక మోత్వాని తెలుసు కదా. ఇటీవలే తనకు పెళ్లి కూడా అయింది. తను సౌత్ హీరోయిన్ అయినా కూడా తన మూలాలు మాత్రం బాలీవుడ్ లోనే ఉన్నాయి. తను బాలీవుడ్ నుంచే సౌత్ ఇండస్ట్రీకి వచ్చింది. కోయి మిల్ గయా సినిమాలో తన చిన్నతనంలోనే ఓ క్యారెక్టర్ చేసింది హన్సిక. ఆ తర్వాత తన 16 ఏళ్ల వయసులోనే దేశముదురు సినిమాలో హీరోయిన్ గా చాన్స్ దక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో తనేంటో నిరూపించుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే తన పెళ్లి కూడా అయిన విషయం తెలిసిందే.

docu drama on hansika motwani love marriage
docu drama on hansika motwani love marriage

తనది లవ్ మ్యారేజ్. అయితే.. తన మ్యారేజ్ ను ఒక డాక్యు షోగా తెరకెక్కించాలని హన్షిక నిర్ణయం తీసుకుందట.లవ్ షాదీ డ్రామా పేరుతో డాక్యు షోను తెరకెక్కించింది హన్షిక. డిసెంబర్ 4న తన పెళ్లి అయిన విషయం తెలిసిందే. తన ఫ్రెండ్ సోహెల్ ను పెళ్లి చేసుకుంది హన్సిక. అయితే.. అతడితో తన ప్రయాణం ఎలా సాగింది. అతడిని ఎందుకు లవ్ చేసింది. తన ప్రేమలో ఎన్ని అడ్డంకులు వచ్చాయి అనేవాటిని అన్నింటినీ కలిపి ఒక వెబ్ సిరీస్ గా తీసింది హన్సిక. దాన్న డిస్ నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 10 న విడుదల చేయనుంది.

Advertisement
docu drama on hansika motwani love marriage
docu drama on hansika motwani love marriage

Hansika : పెళ్లి అయినా బిజీ బిజీగా గడుపుతున్న హన్సిక

తన ఫ్రెండ్, దుబాయ్ లో బిజినెస్ మేన్ గా ఉన్నాడు. హన్సిక వివాహంపై చాలా సార్లు విమర్శలు వచ్చాయి. వాటికి సమాధానంగానే ఈ వెబ్ సిరీస్ ఉంటుందని హన్సిక చెబుతోంది. దానికి లవ్ షాదీ డ్రామా అని పేరు పెట్టి.. క్యాప్షన్ గా లాట్స్ ఆఫ్ లవ్.. బోలెడంత ఆనందం, కాస్త డ్రామా అనే క్యాప్షన్ ను కూడా జోడించారు. తన పెళ్లి జైపూర్ లో ముండోటా కోటలో జరిగింది. ప్రస్తుతం హన్సిక 2023 లో ఫుల్ టు బిజీగా ఉంది. పెళ్లి అయినా తనకు సినిమా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమాలో తను హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement
Advertisement