Hyper Aadi : ఢీ కామెడీ పేరుతో అఖిల్ దారుణంగా అవమానిస్తున్న హైపర్ ఆది
Hyper Aadi : ఈటీవీ లో అత్యంత కీలకమైన డాన్స్ షో ఢీ. ఆ డాన్స్ షో కు ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న ఈ డాన్స్ షో రేటింగ్ ఈ మధ్య కాలం లో దారుణంగా పడిపోయింది. గత మూడు నాలుగు సీజన్ల కు గాను సుడిగాలి సుదీర్ టీం లీడర్ గా వ్యవహరించడం జరిగింది. రష్మీ మరియు సుడిగాలి సుదీర్ లు ఉన్న సమయం లో రేటింగ్ సూపర్ గా వచ్చింది. కానీ ఈ మధ్య కాలం లో అత్యంత దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది అంటూ స్వయంగా షో నిర్వాహకులు వాపోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకు కారణం ఈ సీజన్ లో సుధీర్ మరియు రష్మీ లేకపోవడమే.. దానికి తోడు జడ్జీలుగా ఎవర్ని పడితే వాళ్ళని తీసుకుని వస్తున్నారు.
అత్యంత దారుణమైన రేటింగ్ నమోదవుతున్న కూడా జబర్దస్త్ కమెడియన్ ఆది కామెడీ పంచులు మారడం లేదు. రవి కృష్ణ మరియు బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన అఖిల్ ఈ సీజన్ లో ఆది తో పాటు టీం లీడర్ లుగా వ్యవహరిస్తున్నారు. ఆది ఎప్పటిలాగే తన కామెడీ ని పండించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో అఖిల్ పై ఆయన వేసిన పంచులు మరీ దారుణంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలాంటి పంచులు గతం లో సుధీర్ పై వేస్తే నవ్వు వచ్చేది కానీ ఇప్పుడు అఖిల్ పై అవే పంచులు వేస్తూ ఉంటే అయ్యో పాపం అనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఢీ షో కి ఏ మాత్రం రేటింగ్ రావట్లేదు. ఆది మరీ బ్యాడ్ పంచులు అఖిల్ పై వేస్తుంటే… అఖిల్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ తో మొత్తం షో పై ఆసక్తి తగ్గుతోంది అంటూ రెగ్యులర్ గా షో చూసే ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
Hyper Aadi : సుధీర్, రష్మి లు వెంటనే ఢీ కి రావాలి..
ఇక జడ్జి ల విషయానికి వస్తే రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళు కూర్చోకుండా వారానికి ఒకరు చొప్పున మార్పు జరుగుతోంది. ఇలాంటి పరిణామాల వల్ల దీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న డాన్స్ షో ఢీ క్రేజ్ మసకబారినట్లు అవుతుందంటూ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈటీవీ వారు మరియు మల్లెమాల వారు వెంటనే స్పందించి ఈ షోకు పూర్వ వైభవం తీసుకు వచ్చే లా సుధీర్ మరియు రష్మీ ల ను తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ సుధీర్ మరియు రష్మి రాకుంటే త్వరలోనే మరి ఇంత దారుణమైన రేటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. కేవలం హైపర్ ఆది ని నమ్ముకుని ఈ షో ను నడపాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది అత్యాశే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.