Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్క ఎపిసోడ్ అయ్యే ఖర్చు ఎంత? వచ్చేది ఎంత?
Sridevi Drama Company : ప్రతి ఆదివారం ఈ టీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కి మంచి రేటింగ్ దక్కుతోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు ఏ మాత్రం తీసిపోకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది అంటూ ప్రేక్షకులు మరియు ఇతర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ లో కొద్ది మంది కమెడియన్స్ మాత్రమే కనిపిస్తారు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ లో మాత్రం పెద్ద ఎత్తున కమెడియన్స్ మరియు ఇతర హడావుడి ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ చిత్రీకరణకి చాలా ఖర్చు అవుతుందని టాక్ వినిపిస్తుంది కానీ అలాంటిదేమీ లేదని మల్లెమాల ద్వారా తెలుస్తోంది.
అసలు విషయం ఏంటి అంటే జబర్దస్త్ జడ్జ్ లు అయినా రోజా మరియు మనో లకు పారితోషకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అనసూయ మరియు రష్మీ లు కూడా కాస్త ఎక్కువగానే పారితోషికం ఉంటుంది. అందుకే జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ల మేకింగ్ కాస్ట్ ఒకే విధంగా ఉంటుందని వారంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో హాజరయ్యే ప్రతి ఒక్కరికి పారితోషికం ఉంటుంది అంటే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే ఈ షోలో పాల్గొనడానికి వచ్చే పలువురు అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఈటీవీలో కనిపించాలనే ఒక ఆసక్తితో ఉత్సాహంతో చేసేందుకు ముందుకు వస్తారు.

etv sridevi drama company production cost and revenue
ఇంద్రజ, ఆది, సుధీర్ ఇంకా ఒక పది పదిహేను మందికి తప్పితే పారితోషికం ఇస్తున్న దాఖలాలు లేవు అని బుల్లి తెర వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా ఒక ఎపిసోడ్ పూర్తి అవ్వడానికి దాదాపు 30 నుండి 35 లక్షలు ఖర్చు అవుతుందట. అప్పుడప్పుడు ఎపిసోడ్ భారీగా ప్లాన్ చేస్తే 50 లక్షల వరకు అవుతుందని అంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి యూట్యూబ్ లో కూడా భారీగానే వ్యూస్ వస్తాయి. కనుక ప్రొడక్షన్ కాస్ట్ కేవలం యూట్యూబ్ రెవిన్యూ తో నే వస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఈ టీవీ మల్లెమాల వారికే తెలియాలి.