Sai Dharam Tej : భయపడుతున్న సాయి ధరమ్ తేజ్ .. కారణం ఇదే !

Authored By Breaking News | The Telugu News | Updated on : 20 April 2023, 5:00 pm

Sai Dharam Tej : సాయి ధరంతేజ్ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా “విరూపాక్ష” ఈనెల 21వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత మాట కూడా పోయిన తర్వాత… ప్రాణం తిరిగి వచ్చి మళ్లీ మాటలు నేర్చుకుని సాయి ధరంతేజ్ నటుడిగా తనని తాను మలుచుకున్న సినిమా ఇది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగు సినిమాల మార్కెట్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో టైర్ 2 హీరోలు సైతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు విడుదల చేస్తున్నారు.

fearing sai dharam teja this is the reason

fearing sai dharam teja this is the reason

హీరో నిఖిల్… “కార్తికేయ 2” ఆ రీతిగా విడుదల చేసి ఊహించని విజయం సొంతం చేసుకున్నాడు. అయితే ఈ రకంగా కొంతమంది హీరోలు మాత్రమే క్లిక్ అవుతున్నారు. చాలా వరకు మన తెలుగు టైర్ 2 హీరోలకి నార్త్ లో మార్కెట్ లేకపోవడంతో అదేవిధంగా సరిగ్గా ప్రమోట్ చేయకపోవడంతో… సినిమా నార్త్ ప్రేక్షకుడికి రీచ్ కావడం లేదు. రీసెంట్ గా నాచురల్ స్టార్ నాని నటించిన “దసరా” తెలుగులో సూపర్ డూపర్ హిట్ మిగతా భాషల్లో.. సరిగ్గా చేరువ కాలేకపోయింది. ఈ పరిణామంతో సాయిధరమ్ తేజ్..

Sai Dharam Tej : మీతో కలిసి సినిమా చూడటం కుదరలేదు.. సాయి ధరమ్ తేజ్ ఆడియో  మెసేజ్.. | Mega hero sai dharam tej audio message | TV9 Telugu

తన కొత్త సినిమా “విరూపాక్ష” విషయంలో రిస్కు చేయడానికి సాహసించడం లేదు. ప్రారంభంలో ఈ సినిమాని పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల చేయాలని అనుకున్న.. ప్రమోషన్ ఇంకా ఇతర కార్యక్రమాలకు అదనపు ఖర్చు పెట్టడం… భారమవుతుందని.. మళ్లీ ఆ డబ్బులు వస్తాయో రాదో అనే సందేహంతో నిర్మాతలు కూడా డ్రాప్ అయ్యారట. అయితే తెలుగులో ఫలితం బాగుంటే ఇతర భాషలలో రిలీజ్ చేసే ప్లాన్ లో “విరూపాక్ష” నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే పాన్ ఇండియా లెవెల్ లో సినిమా విడుదల అంటే సాయిధరమ్ తేజ్ భయపడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp