Fish Venkat : ఫిష్ వెంకట్‌కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అదేనా?
ప్రధానాంశాలు:
Fish Venkat : ఫిష్ వెంకట్‌కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అదేనా?
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. చాలా మంది హీరోల సినిమాల్లో హాస్యభరితమైన విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. అయితే, గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు అతన్ని వెంటాడుతున్నాయి.

Fish Venkat : ఫిష్ వెంకట్‌కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అదేనా?
Fish Venkat : దారుణ పరిస్థితి..
ఫిష్ వెంకట్ ఇప్పటికే 9 నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో డయాలసిస్ తీసుకుంటున్నారు. ఇటీవల పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో అతన్ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయన చైతన్య కోల్పోయిన స్థితిలో, ఎదుటి వారిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా తాము భరించలేని స్థాయిలో ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోయాయని, మానవతావాదులు, సినీ సంఘాలు, ప్రభుత్వం సహాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.
ఒకానొక సమయంలో ప్రేక్షకులను నవ్వించిన ఈ నటుడు ఇప్పుడు జీవితం కోసం పోరాడుతున్నాడు.నాలుగేళ్ల క్రితం మద్యం కారణంగా షుగర్, కాలుకి ఇన్‌ఫెక్షన్ వచ్చాయి. ఆ సమయంలో సినీ ప్రముఖులు, దాతలు కలిసి సాయం చేయడంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగి ప్రాణాలు దక్కాయి. అయితే తర్వాత మళ్లీ మందు, సిగరెట్ అలవాట్లు వదలలేకపోయారని.. ఆ కారణం గానే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త స్నేహితులే ఇంటికి వచ్చి మళ్లీ అలవాటు చేశారని.. కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎవ్వరూ చూడటానికి కూడా రావడం లేదని వాపోయారు.