Game Changer : గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ..రామ్ చరణ్‌కి జాతీయ అవార్డ్ పక్కా..!
ప్రధానాంశాలు:
Game Changer : గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ..రామ్ చరణ్‌కి జాతీయ అవార్డ్ పక్కా..!
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెలుగు, తమిళ్,హిందీ భాషలలో విడుదల కాబోతోంది. తాజాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ముఖ్యంగా ‘పుష్ప2’ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని, మంచి జోరు మీద ఉన్న సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని రాంచరణ్ తో చేయడానికి సిద్ధం అవుతున్నారు. సుకుమార్ ముఖ్యఅతిథిగా వెళ్లి మంచి కిక్ ఇచ్చే వార్త ఒకటి పంచుకున్నారు.
కిక్కిచ్చే సినిమా..
గేమ్ ఛేంజర్ ని చిరంజీవితో కలిసి సుకుమార్ చూసేశారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ స్థాయిలో ఉందని, ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్ ఇస్తుందని, క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటనకు అవార్డు రావడం ఖాయమని కొన్ని విషయాలు చెప్పి ఫ్యాన్స్‌కి అదిరిపోయే శుభవార్తని అందించారు. సినిమాని పూర్తిగా చూసి ఉంటే తప్ప ఇంతా కాన్ఫిడెంట్ గా చెప్పరు కాబట్టి ఫ్యాన్స్ సంతోషం మాములుగా లేదు. రామ్ చరణ్ 17 దర్శకుడు సుకుమారే. అయితే పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో ఇదేమైనా ఆలస్యమవుతుందేమోనని ఫ్యాన్స్ అనుమానం. ఇంకొద్ది రోజులు ఆగితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
దిల్ రాజు, శంకర్, సుకుమార్, అంజలి, ఎస్జె సూర్య ఇచ్చిన ఎలివేషన్లను బట్టి చూస్తే గేమ్ ఛేంజర్ ఇప్పటిదాకా హైప్ లో వెనుకబడిన బలహీనతను కవర్ చేసుకుంటూ బలం పెంచుకుంటోంది. పబ్లిసిటీ విషయంలో ఎస్విసి టీమ్ ప్రత్యేక శ్రద్ధ వహించబోతోంది. జనవరి 10 దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు రాజుగారు చెప్పడం చూస్తే పుష్ప 2 స్థాయిలో ప్లానింగ్ జరుగుతోందని అర్థమవుతోంది. ఇదిలా ఉండగా కమలహాసన్ తో ఇండియన్ -2 సినిమా చేశారు డైరెక్టర్ శంకర్. అయితే ఈ సినిమా ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో అటు మెగా అభిమానులలో కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ -2 లాంటి డిజాస్టర్ తర్వాత శంకర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందనేది చూడాల్సి ఉంది…