Bigg Boss Telugu 7 : సీక్రెట్ రూమ్ నుంచి బిగ్ బాస్ హౌస్‌కి గౌతమ్.. అతడిని చూసి అందరూ షాక్.. శివాజీకి సూపర్ పంచ్ ఇచ్చిన గౌతమ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 7 : సీక్రెట్ రూమ్ నుంచి బిగ్ బాస్ హౌస్‌కి గౌతమ్.. అతడిని చూసి అందరూ షాక్.. శివాజీకి సూపర్ పంచ్ ఇచ్చిన గౌతమ్

 Authored By kranthi | The Telugu News | Updated on :10 October 2023,11:00 am

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఉల్టా పుల్టా అంటే ఏంటో అనుకున్నాం కానీ.. అనుకున్న దానికంటే ఎక్కువే ఉల్టా పుల్టా జరుగుతోంది హౌస్ లో. అసలు ఇది బిగ్ బాస్ 2.0. మామూలు సీజన్ కాదిది. ఐదు వారాల తర్వాత మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. ఒకే రోజు ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పి.. శుభశ్రీని ఇంటికి పంపించి గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత సీక్రెట్ రూమ్ లో ఉండి అందరి గురించి తెలుసుకున్నాడు గౌతమ్. తనను బయటికి పంపించేందుకు అందరూ జ్యూస్ పోశారు. ఒక్క మాస్టర్ సందీప్ తప్ప. అందరూ తనను బయటికి పంపించారన్న కోపంతో గౌతమ్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఒక్క రోజులోనే బిగ్ బాస్ గౌతమ్ ను హౌస్ లోపలికి పంపించాడు.

ఓవైపు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగానే రాననుకున్నారా.. రాలేననుకున్నారా.. అంటూ డైలాగ్స్ కొడుతూ.. వేరే డోర్ నుంచి నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు గౌతమ్. ఆశ్వద్ధామ ఈజ్ బ్యాక్. తేనె పూసిన కత్తిని గొంతులో దింపారు కదా. అయినా ఈ అశ్వద్ధామ చావడు. ఎట్ల ఎల్లిన్నో అట్లనే వచ్చిన. దిస్ ఈజ్ 2.0 బేబీ అంటూ హౌస్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేశాడు గౌతమ్. నేరుగా నామినేషన్ల దగ్గరికి వచ్చి శివన్న మీరు నిన్న ఒకటి అన్నారు కదా. గౌతమ్ ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ చేయలేడు అని. ఎంటర్ టైన్ మెంట్ అంటే ప్యాంట్ తీసేసి తిరగడం కాదు కదా అన్నా అంటూ శివాజీకి పంచ్ ఇస్తూ నామినేట్ చేస్తాడు గౌతమ్. నాకు ఆ టైమ్ లో అలా అనిపించింది అని అంటాడు శివాజీ. బట్టలు విప్పడం ఎంటర్ టైన్ మెంట్ కదా కదా అని నువ్వు నన్ను అన్నావు. 100 సినిమాల్లో చేశా నేను బట్టలు లేకుండా. నేను యాక్టర్. నేను ఏదైనా చేస్తా అంటాడు శివాజీ.

Bigg Boss Telugu 7 : గౌతమ్ కు స్పెషల్ పవర్స్ ఇచ్చిన బిగ్ బాస్

గౌతమ్ కు స్పెషల్ పవర్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ పవర్స్ తో ఒకరిని నేరుగా నామినేట్ చేయొచ్చని చెబుతాడు బిగ్ బాస్. అయితే.. గౌతమ్ ఎవరిని నామినేట్ చేస్తాడో ప్రోమోలో చూపించడు. అసలు గౌతమ్ ఎవరిని తన పవర్స్ తో నేరుగా నామినేట్ చేస్తాడో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.

YouTube video

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది