Rashmi Gautham : గీతా మాధురి వ‌ర్సెస్ ర‌ష్మీ.. సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ తిట్టేసుకుంటున్నారుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautham : గీతా మాధురి వ‌ర్సెస్ ర‌ష్మీ.. సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ తిట్టేసుకుంటున్నారుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :19 October 2022,1:00 pm

Rashmi Gautham : న‌టిగా సినిమా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత యాంక‌ర్‌గా స‌త్తా చాటిన అందాల భామ ర‌ష్మీ గౌత‌మ్. ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీషో ద్వారా మరింత దగ్గరైయ్యారు రష్మి. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్న ర‌ష్మీ గౌత‌మ్ అప్పుడప్పుడు సినిమాలలో కూడా స‌త్తా చాటుతుంది. ప్ర‌స్తుతం నందుతో క‌లిసి బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే సినిమా చేస్తుంది.నందు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మాసీ లుక్కులో కనిపించడం,

రష్మీ గౌతమ్ కూడా రగ్డ్ లుక్‌లో కనిపించడం, పాటలు, మాటలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది వరకు వదిలిన టీజర్, పాటలు అన్నీ కూడా వైరల్ అయ్యాయి. నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నారట. అందుకే ప్రమోషన్స్ ప్రారంభించారట. కానీ రష్మీ మాత్రం సహకరించడం లేదట. ఫోన్లు ఎత్తడం లేదని, ప్రమోషన్లకు రావడం లేదని నందు, కిరిటీ, సినిమా డైరెక్టర్ ఆందోళన చెందారు. రష్మీ షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశారు. ఇక ప్రముఖ సింగర్ గీతామాధురి , యాంక‌ర్ జ‌బ‌ర్ద‌స్త్ ర‌ష్మీ మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట‌ల తూటాలు పేలుతున్నాయి. నందూ, అత‌డి భార్య గీతామాధురి, ఇటు ర‌ష్మి కాంట్ర‌వ‌ర్సీ పోస్టులు పెట్టుకున్నారు.

Geeta Madhuri Vs Rashmi Gautham

Geeta Madhuri Vs Rashmi Gautham

Rashmi Gautham : ఏం గొడ‌వ రా బాబు..

నందు అయితే ర‌ష్మీ మా ఫోన్లు ఎత్త‌డం లేదు.. ఇప్ప‌టికే 32 సార్లు ఫోన్లు చేశామ‌ని మండిప‌డ్డాడు. అయితే ఇదంతా కూడా సినిమా ప్రమోషన్ల కోసం చేస్తోన్న స్టంట్లే అని అర్థమవుతూనే ఉంది. అయితే చివరకు అంతా కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాను ప్రమోట్ చేశారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ర‌ష్మీ విష‌యానికి వ‌స్తే.. ఈ అమ్మ‌డు తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు. ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రష్మి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతున్నారు

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది