Guppedantha Manasu 12 Aug Today Episode : కాలేజీ ఎండీ పదవిని తిరస్కరించిన జగతి, రిషికే అప్పగింత.. ఇంతలో మరో ట్విస్ట్
Guppedantha Manasu 12 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 ఆగస్టు 2022, శుక్రవారం ఎపిసోడ్ 527 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మార్పు సహజం వసుధర. మనమేమీ శిల్పాలము కాదు.. మార్పు మానవ సహజం అని అంటాడు రిషి. కానీ.. మీరు ఒకప్పుడు ఏం చెప్పారో గుర్తు చేసుకోండి. జీవితం అంటే మనకు ఇష్టం ఉన్నట్టు జీవించడం. స్వార్థం లేనిది ఏంటంటే.. ఎదుటివారి గురించి ఆలోచించడం. మనిషి ఎలా ఉండాలి అంటే మీలా ఉండాలి అనుకున్నాను సార్ అంటుంది వసు. కానీ.. ఇవన్నీ అప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. పోటీల్లో చెప్పడానికి వీలు లేదు కాబట్టి చెప్పలేదు సార్. చెప్పాల్సినవి నా మనసులో చాలా ఉన్నాయి కానీ.. మీరు చెప్పనీయడం లేదు అంటుంది వసుధర. చందమామతో, ఆకాశంతో చెప్పుకుంటే కాదు కదా. అలాంటి మెసేజ్ పెట్టి నువ్వు ఇంత కూల్ గా ఉన్నావు. నేను నీలా కాదు. రా అని తన చేయి పట్టుకొని కారు ఎక్కిస్తాడు.
ఎక్కడికి అంటుంది. దీంతో ఎక్కడికి అని మాత్రం నన్ను అడగొద్దు అంటాడు. దీంతో ఇంటి డోర్ వేసి వస్తా అంటుంది వసు. దీంతో నేను వేసి వస్తా అని చెప్పి తనను కారులో ఎక్కించుకొని తీసుకెళ్తాడు రిషి. సీటు బెల్ట్ పెట్టుకో అంటాడు రిషి. ఒక్క ప్రశ్న అంటే అస్సలు వినడు. వసుధరకు ఏమైంది అని అనుకుంటాడు కారు తోలుతూ. మనసులో బాధపెట్టుకొని బయటికి నవ్వుతోందా? నిజంగా వసుధర మనసులో ఏం లేదా అని అనుకుంటాడు రిషి. వసుధరను ఇంటికి తీసుకొని వస్తాడు రిషి. మరోవైపు రిషి అసలు ఏం చేస్తున్నాడు. అతడి ప్లాన్ ఏంటి అని జగతితో అంటాడు మహీంద్రా. ఇంతలో రిషి వచ్చి ఈరోజు నుంచి వసుధర ఇక్కడే ఉంటుంది అని చెబుతాడు.
మరోవైపు రిషి పడుకొని ఉండటం చూసి ఎలా పడుకున్నాడు చూడు అని అనుకుంటాడు గౌతమ్. ముందు నువ్వులే. నీ సంగతి ఏంటో చూస్తాను అంటాడు గౌతమ్. ఏంటి, ఎందుకు అని అడగడానికి వస్తే వెంటనే వెళ్లిపోవచ్చు అని అంటాడు రిషి. రాత్రి వసుధరను ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అంటాడు గౌతమ్.
Guppedantha Manasu 12 Aug Today Episode : వసుధరను ఇంట్లో పెట్టుకోవడంతో సాక్షి షాక్
ఇంతలో సాక్షి వచ్చి ఆ మాటలు విని షాక్ అవుతుంది. దేవయాని కూడా వస్తుంది. వసుధర ఇక్కడ ఉంటే ఏంటి సమస్య. వాళ్లిద్దరి మధ్య ఏం నడుస్తుందో మనమే చూడొచ్చు అని అంటుంది సాక్షి. మరోవైపు రిషి ఈరోజు నువ్వు బయటికి వెళ్లొద్దు. నువ్వు బయటికి వెళ్లే పని పెట్టుకోవద్దు అంటుంది దేవయాని.
రిషితో చాలా పని ఉంటుంది అంటుంది దేవయాని. గౌతమ్ మాత్రం ఏమౌతుంది. అలా బయటికి వెళ్లి వస్తే ఏమౌతుంది అని అంటాడు. కానీ.. గుమ్మానికి తోరణాలు కట్టాలి. ఎక్కడికీ వెళ్లొద్దు అని అంటుంది దేవయాని. ఈ రిషి ఏంటో.. పెళ్లికి ఒప్పుకున్నాడనే మాటే కానీ.. ప్రేమ అనేదే చూపించడం లేదు అని అనుకుంటుంది సాక్షి.
మరోవైపు గౌతమ్, వసుధర ఇద్దరూ పూలదండలు గుమ్మానికి కడుతుంటారు. ఈరోజు హడావుడి అంతా మనమే చేయాలి ఏమంటారు అంటుంది వసుధర. ఇంతలో జగతి వస్తుంది. దీంతో మేడమ్ రండి.. మీరు కూడా ఓ చేయి వేయండి అంటుంది వసుధర.
దీంతో వసుధర ఏంటిది అంటుంది జగతి. ఏంటి మేడమ్ మీకు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు అంటుంది వసుధర. మరోవైపు వసుధర ఈ పెళ్లిని ఆపిస్తుందా అని సాక్షితో దేవయాని అంటుంది. దీంతో తను ఏం చేయలేదు. కొన్ని గంటలు గడిస్తే చాలు లగ్నపత్రిక రాసుకుంటాం. ఇక ఏం జరిగినా ఎవ్వరూ ఏం చేయలేరు అంటుంది సాక్షి.
ఇంతలో ఏదో ఆన్ లైన్ లో ఆర్డర్ చేశావేంటి అని అడుగుతాడు మహీంద్రా. అవి ఇప్పుడే ఓపెన్ చేయకండి అంటాడు రిషి. నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు అని అంటాడు మహీంద్రా. మరోవైపు ఎండీ పదవిని మీరే తీసుకోండి అని జగతితో అంటాడు రిషి.
ఒక బిడ్డను చూసుకోవడానికి పనికిరాని నేను.. ఒక బంధం మోయలేని నేను ఆ బాధ్యతలు మోయలేను సార్ అంటుంది జగతి. కాలేజీ అంటే నాలుగు గోడలు, నల్ల బోర్డ్, ఒక పైకప్పు ఇవన్నీ కాదు సార్. స్టూడెంట్స్ భవిష్యత్తు అంటుంది జగతి. ఆ సీటులో కూర్చొనే అర్హత మీకు మాత్రమే ఉంది అని చెబుతుంది జగతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.