Guppedantha Manasu 17 Nov Today Episode : వసుధర ఇంటర్వ్యూకు జగతి హాజరు అవుతుందా? రిషి మెయిల్ చూసుకొని మహీంద్రా వద్దన్నా కాలేజీకి బయలుదేరిన జగతి.. ఇంతలో ట్విస్ట్?
Guppedantha Manasu 17 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 నవంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 610 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధర భోజనం చేయలేదని.. తనకోసం భోజనం తీసుకొస్తాడు రిషి. అయ్యో సార్.. మీరెందుకు తీసుకొచ్చారు అంటుంది. మీరు తినండి అంటుంది. దీంతో నువ్వు భోజనం చేయకుండా నేను ఎలా భోం చేస్తాను. నువ్వు ఇటురా కూర్చో అని తనను కూర్చోబెట్టి తిను అంటాడు. జగతి మేడమ్ విషయంలో నేను ఏమైనా ఇబ్బంది పెట్టానా అని అడుగుతుంది వసుధర. దీంతో మనం టాపిక్ అక్కడే మాట్లాడుకున్నాం. అయిపోయింది అంటాడు. వసుధర నువ్వు తింటే నేను తింటాను అంటాడు రిషి. దీంతో తినండి సార్ అని తినిపిస్తుంది. దీంతో నువ్వు తింటేనే నేను తింటాను. నేను తిన్నాక తినను అనొద్దు అంటాడు రిషి. దీంతో సరే తింటాను.. తినండి అంటుంది వసుధర. దీంతో రిషి కూడా తనతో పాటు తింటాడు. ఆ తర్వాత నువ్వు కూడా తిను అంటాడు.
దీంతో నేను తర్వాత తింటా సార్.. మీరు వెళ్లండి అంటే.. లేదు లేదు ఇద్దరం ఒకే ప్లేట్ లో తిందాం సరేనా అని తనకు ఫుడ్ తినిపిస్తాడు రిషి. దీంతో సార్ అంటూ ఆశ్చర్యపోతుంది. నువ్వు నాకు తినిపించావు కదా. నేను నీకు తినిపిస్తే తప్పేంటి అని అంటాడు. తనకు తినిపిస్తాడు. దీంతో తను కూడా తింటుంది. మనసులో చాలా బాధలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలి అంటాడు రిషి. తనకు తినిపిస్తూ ఉంటే తను తింటూ ఉంటుంది. బాగుంది సార్.. మీరు ఇలా తినిపించడం అంటుంది వసుధర. కష్టాలు లేని మనిషి ఉండడు అని ఒక సామెత ఉంది. కష్టాలు పంచుకునే మనిషి ఉండాలి. డాడీ వాళ్లు వెళ్లిపోయారన్న బాధ నాకు ఉంది. నీ విజయాన్ని మేడమ్ దగ్గరుండి చూడటం లేదనే బాధ నాకుంది. కానీ.. జరిగేదేదో జరిగింది. తిను అంటూ తినిపిస్తాడు. ఆ తర్వాత మీరు కూడా తినండి అని తినిపిస్తుంది.
ఆ తర్వాత తనను తీసుకెళ్లి రూమ్ లో పడుకోబెడతాడు రిషి. డాడీ దూరమయ్యారని నేను బాధపడుతున్నాను. జగతి మేడమ్ దూరమయ్యారని వసుధర బాధపడుతోంది. ఇద్దరి బాధల్లో న్యాయం ఉంది కానీ.. వాళ్లు వెళ్లడంలో మాత్రం న్యాయం లేదు. కనిపించకూడదని వాళ్లు నిర్ణయించుకున్నారు. అందుకే ఎంత ట్రై చేసినా వాళ్లు దొరకడం లేదు. వసుధర ఇచ్చే ఇంటర్వ్యూకు జగతి మేడమ్ వస్తే బాగుండేది.
మేడమ్ మీకు వసుధర అంటే ఇష్టమే కదా. ఎందుకు మీకు వసుధరను కలవాలని అనిపించడం లేదో నాకు అర్థం కావడం లేదు. జగతి మేడమ్ ను ఇంటర్వ్యూకు ఎలా తీసుకురావాలని రాత్రంతా ఆలోచిస్తాడు రిషి. కట్ చేస్తే తెల్లవారుతుంది. ఉదయమే దేవయానితో మాట్లాడుతాడు రిషి.
Guppedantha Manasu 17 Nov Today Episode : మహీంద్రా, జగతికి మెయిల్ చేసిన రిషి
ఇవాళ మీడియా ఇంటర్వ్యూ ఉంది అంటాడు రిషి. పెదనాన్న మీరు సరైన సమయానికి వచ్చారు అంటాడు రిషి. పెదనాన్న వస్తే సరిపోతుందా? మహీంద్రా, జగతి కూడా రావాలి కదా అంటుంది దేవయాని. ఇంతలో వసుధర అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది.
ఏం వసుధర.. ఇంటర్వ్యూకు బాగా ప్రిపేర్ అయ్యావా అని అడుగుతుంది దేవయాని. దీంతో ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవడం అంటూ ఏముంటుంది మేడమ్ అంటుంది వసుధర. దీంతో నువ్వు తెలివికల్లదానివి కదా.. అన్నీ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తావు కదా అంటుంది దేవయాని.
నువ్వు సాధించిన విజయం వెనుక జగతి మేడమ్ ఉందని అందరికీ తెలుసు. మీడియా ఇంటర్వ్యూలో మీ మేడమ్ ను మిస్ అవుతున్నావు కదా అంటే.. నేను ఎప్పుడూ మా మేడమ్ ను మిస్ అవను. తను నా మనసులోనే ఉంటారు. మేడమ్ ఎక్కడున్నా తన ఆశీస్సులు నాకుంటాయి అని అంటుంది వసుధర.
అయినా ఇంటర్వ్యూకు మేడమ్ వస్తున్నారు కదా అంటుంది. మేడమ్ వాళ్లు ఎలాగైనా వస్తారని రిషి సార్ అన్నారు. రిషి సార్ ఒక మాట అన్నారంటే అది ఊరికే అనరు. ఆ మాట నిజం అవుతుంది. ఆ నమ్మకం నాకుంది అంటుంది వసుధర. నీ నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటున్నా అంటాడు దేవయాని భర్త.
మరోవైపు జగతి, మహీంద్రాకు ఒక మెయిల్ చేస్తాడు రిషి. మీరు నన్ను చిన్నప్పుడు వదిలి పెట్టి వెళ్లిపోయారు. నా బాధేంటో మీకు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. మీరు ఎందుకు వెళ్లారో నాకు ఇంకా తెలియదు. నాకు ఎందుకు అంత శిక్ష పడిందో తెలియదు కానీ.. మళ్లీ మీరు ఇప్పుడు అంతే శిక్ష వసుధరకు కూడా వేస్తున్నారు.
డాడ్ ఆనందమే నా ఆనందం అనుకున్నాను. అందుకే ఒక మెట్టు తగ్గి మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించాను. కానీ.. వచ్చినట్టే వచ్చి డాడ్ తో కలిసి వెళ్లిపోయారు. ఇది మీకు న్యాయం కాదు కదా మేడమ్. ఎక్కడికి వెళ్లారో.. ఏంటో తెలియదు. డాడ్.. మీరు ఎలా ఉన్నారో అని ప్రతిక్షణం టెన్షన్ పడుతున్నాను.
కానీ.. మీ ఇద్దరి వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు. మినిస్టర్ గారి దగ్గర కావాలనే నాకు కనిపించకుండా వెళ్లారు. అది నాకెంతో బాధ కలిగించిన విషయం. కానీ.. ఇప్పుడు ఈ బాధ నా ఒక్కడిదే కాదు. వసుధరది కూడా. వసుధర యూనివర్సిటీ టాపర్ అయినా కూడా మీరు పేపర్ లో ప్రకటన ఇచ్చి అభినందించారు తప్ప మీరు చూడాలని తనను ప్రత్యేకంగా అభినందించాలని మీరు ఎందుకు అనుకోవడం లేదు.
వసుధర మీకోసం ఎదురు చూస్తోంది. వసుధర విజయాన్ని మీరు ఆస్వాదించాలి. మీరు అభినందించాలి. మీడియా వాళ్లు తనను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారు. ఆ సమయంలో మీరు ఉంటే బాగుంటుంది. ఒక తల్లి వదిలేసిపోయిన ఒక కొడుకు ప్రార్థన అనుకుంటారో.. టీచర్ వదిలేసి పోయిన శిష్యురాలి వేదన అనుకుంటారో అది మీ ఇష్టం.. డాడ్ తో కలిసి మీరు కాలేజీకి వస్తారని నేను ఎదురు చూస్తుంటాను. ఇట్లూ రిషీంద్ర భూషణ్ అని రిషి జగతికి మెయిల్ చేస్తాడు.
నాకు చాలా సంతోషంగా ఉంది అని మహీంద్రాతో అంటుంది జగతి. నీ ఆనందాన్ని చూస్తుంటే సంతోషించాలో, బాధపడాలో తెలియడం లేదు అంటాడు మహీంద్రా. రిషి నిన్ను రమ్మంటుంది తనకోసం కాదు.. ఒక తల్లిగా నిన్ను ఆహ్వానించడం కాదు. వసుధరను అభినందించడానికి తనను ఇంటర్వ్యూ చేస్తుంటే తను ఉండాలని కోరుకుంది కాబట్టి రమ్మన్నాడు అంటాడు మహీంద్రా.
రమ్మని పిలవడమే ఎక్కువ. ఎవరికోసం అయితే ఏంటి.. వెళ్లాలని నా మనసు తహతహలాడుతోంది మహీంద్రా అంటుంది జగతి. మనం అనుకున్న లక్ష్యాన్ని చాలా దగ్గరగా వచ్చాం. వసుధర, రిషిలు పెళ్లి ప్రకటిస్తేనే గానీ మనం వెళ్లలేం అంటాడు మహీంద్రా.
జగతి నువ్వు అనవసరంగా ఎక్కువగా శ్రమ పడుతున్నావు. ఇప్పుడు మనం వెళ్లడం కరెక్ట్ కాదు. రిపోర్టర్స్ రిషి, వసుధర బంధం గురించి అడిగితే రిషి ఏం చెబుతాడో చూద్దాం.. అంటాడు మహీంద్రా. మనమెందుకు జగతి అక్కడికి వెళ్లడం అంటాడు మహీంద్రా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.