Guppedantha Manasu 21 Dec Today Episode : వసుధారతో పాటు తన ఇంటికి వెళ్లిన రిషి.. దేవయాని వద్దన్నా రిషి వినకపోవడంతో దేవయాని షాకింగ్ నిర్ణయం.. ఈ విషయం రిషికి తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 21 Dec Today Episode : వసుధారతో పాటు తన ఇంటికి వెళ్లిన రిషి.. దేవయాని వద్దన్నా రిషి వినకపోవడంతో దేవయాని షాకింగ్ నిర్ణయం.. ఈ విషయం రిషికి తెలుస్తుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :21 December 2022,9:00 am

Guppedantha Manasu 21 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 డిసెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 639 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవయాని రాత్రి ఫోన్ లో మాట్లాడటం మహీంద్రా విన్నాడట. తను మళ్లీ ఏదో కుట్ర చేస్తోంది వసూ. మీ ఇద్దరినీ ఏ శక్తి విడదీయకూడదు అని అంటుంది జగతి. దానికి దీనికి ఏం సంబంధం. దేవయాని మేడమ్ అక్కడికి వచ్చి ఏం చేస్తారు. మా వాళ్లు ఎవరూ తనకు తెలియదు కదా అంటుంది వసుధార. దీంతో మీ నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఆరోజు టీసీ విషయంలోనే నేను ఆయన గురించి చూశాను. నీ పెళ్లి విషయంలో నేను మీ నాన్నతో గొడవ పడ్డాను అంటుంది జగతి. నువ్వు ఇల్లు వదిలి రావడానికి కారణం కూడా నేనే అని అనుకుంటాడు. ఇప్పుడు రిషి నా కొడుకు అని తెలిస్తే.. మీ నాన్న నా మీద ఉన్న కోపాన్ని రిషి మీద చూపిస్తాడు. మీ నాన్న మొత్తానికే సంబంధం వద్దు అనుకునే అవకాశం ఉంది.  దేవయాని అక్కయ్యకు నువ్వు రిషిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయం అందరికీ తెలుసు కానీ.. రిషి ముందు తను నోరు మెదపదు. అలాగని తను చేసే ప్రయత్నాలు మానుకోదు.

guppedantha manasu 21 december 2022 full episode

guppedantha manasu 21 december 2022 full episode

మేమందరం మీ ఇంటికి వచ్చి మాట్లాడితే రిషి నా కొడుకు అని తెలిశాక మీ నాన్న గొడవ పడితే దేవయాని అక్కయ్య అస్సలు ఆ అవకాశాన్ని వదులుకోదు అంటుంది జగతి. దీంతో మీ నాన్న గారిని అడ్డు పెట్టుకొని దేవయాని వదిన ఖచ్చితంగా మీ పెళ్లి చెడగొట్టాలని చూస్తుంది అంటాడు మహీంద్రా. అందుకే ముందు నువ్వు వెళ్లు. నువ్వు సాధించిన విషయాల గురించి చెప్పు. ఆ తర్వాత మీ నాన్న గారికి అర్థం అయ్యేలా అన్ని విషయాలు చెప్పు. మీ ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉన్నాక మేము వస్తాం. అప్పుడు అక్కయ్య ఏం చేసినా ఏం కాదు కాబట్టి మీ పెళ్లి జరుగుతుంది. అందరం ఒకేసారి వెళ్లడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది అని జగతి చెప్పిన విషయాలను కారులో వెళ్తూ గుర్తు చేసుకుంటుంది వసుధార.

రిషి సార్ గురించి దైర్యంగా నాన్నకు చెప్పాకే రిషి సార్ ను ఇంటికి రమ్మంటాను అని అనుకుంటుంది వసుధార. మరోవైపు రిషి కూడా వసుధార గురించే ఆలోచిస్తాడు. వసుధార ఎందుకు ఒక్కదాన్నే వెళ్తా అంది. ఎందుకు రావద్దన్నది అని అనుకుంటాడు రిషి.

వసుధార ఇంటికి వెళ్లాక ఏం జరుగుతుందో ఏంటో అని అంటాడు మహీంద్రా. దీంతో ఆడపిల్లకు ప్రపంచం అంతా ఎదురు తిరిగినా పుట్టింటికి వెళ్తే సగం కష్టాలు పోతాయి. నా అన్న వాళ్లు తోడుగా ఉంటే ధీమాగా ఉంటుంది అంటారు. అది నిజం కూడా. దురదృష్ట వశాత్తు వసుధారకు పుట్టింట్లో తనకు తగిన ఆదరణ లేదు. దానికి కారణం.. వాళ్ల నాన్న చక్రపాణి.

వసు.. ప్రపంచాన్ని గెలవగలదు కానీ.. వాళ్ల నాన్న మనసును మాత్రం గెలవలేదు. ఎందుకంటే వాళ్ల నాన్న మూర్ఖుడు. వసుధార ఉన్నతిని వాళ్ల నాన్న సంతోషించడు. ఒక అమ్మాయి అంటే ఎంతో కొంత చదువుకొని అమ్మానాన్నలు చెప్పిన సంబంధం చేసుకోవాలి అని అనుకునే తండ్రి వసుధార తండ్రి అంటుంది జగతి. ఇవన్నీ చాటుగా రిషి వింటాడు.

Guppedantha Manasu 21 Dec Today Episode : జగతి మాటలు విని రిషి షాకింగ్ నిర్ణయం

అందుకు ముందు వసు అక్కడికి వెళ్లి పరిస్థితులు చక్కబడ్డాక మనం వెళ్తే బాగుంటుంది. తను పెళ్లి పీటల మీది నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడింది. తన కాళ్ల మీద తాను నిలబడి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది.

వసు సాధించిన విజయాలకు పొంగిపోయే మనసు చక్రపాణి గారికి ఉంటుందని నేను అనుకోను. ఖచ్చితంగా వాళ్ల నాన్న ఒప్పుకోడు కానీ.. వసుధార ఒప్పిస్తుందన్న నమ్మకం నాకుంది అంటుంది జగతి. చాలా మంది సమస్యలు తలుచుకొని అక్కడే ఆగిపోతారు. కానీ.. వసు.. సమస్యను విశ్లేషించుకొని పరిష్కారం తెలుసుకొని ధైర్యంగా ముందుకువెళ్తుంది. ఇప్పుడు వసు చేసేది కూడా అదే అంటుంది. దీంతో కోపంతో రిషి అక్కడి నుంచి వెళ్తుండటం చూస్తారు జగతి, మహీంద్రా. దీంతో రిషి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు మహీంద్రా.

దీంతో మేడమ్ చెప్పిన కొన్ని మాటలు విన్నాను. నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదనిపించింది. వసుధార దగ్గరికి వెళ్తాను అంటాడు రిషి. వసుధారకు ఎక్కడ కష్టం ఎదురైతే అక్కడ తనతో నేనుండాలి. తను ఇంట్లో కష్టాలను ఎదుర్కోవడానికి ఒంటరిగా వెళ్లిందని నాకు ఇప్పుడే తెలిసింది.

నేను వెళ్తున్నాను డాడ్. పెద్దమ్మకు చెప్పండి అంటాడు రిషి. మీరు ఏం చెప్పినా నేను వెళ్లే తీరుతాను. నువ్వు వెళ్లొద్దు అనడం లేదు. ఒక్క నిమిషం ఉండు. నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి జగతి వెళ్లి మంగళ సూత్రం ఉన్న బాక్స్ ను తీసుకొస్తుంది.

రిషి.. ఇది వసుకు ఇవ్వు అంటూ ఆ బాక్స్ ను ఇస్తుంది. ఏంటిది అంటే నేను ఇచ్చానని చెప్పు అంటుంది జగతి. దీంతో దాన్ని ఓపెన్ చేయబోతాడు కానీ.. మళ్లీ ఓపెన్ చేయకుండా ఆగిపోతాడు. వెళ్తాను డాడ్ అని చెప్పి వెళ్లబోతుండగా రిషి.. నువ్వు వసు వాళ్ల ఊరు వెళ్లు కానీ.. అంటూ ఏదో చెప్పబోతుండగా మేడమ్ వసుధార ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను.

వసుధారకు కష్టం వస్తుందని తెలిస్తే తనను ఒంటిరిగా వదిలి ఈ రిషి ఉండలేడు మేడమ్ అంటాడు. వసుధారకు తోడుగా ఉండటంలో తప్పు లేదు కానీ.. వాళ్ల ఇంటికి మాత్రం వెళ్లకు అంటుంది జగతి. అదేంటి జగతి అంటాడు మహీంద్రా. వసుధార వాళ్ల నాన్న గురించి, అక్కడి పరిస్థితుల గురించి నేను చెప్పాను కదా మహీంద్రా. వాళ్ల నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఆయన మాటల్లో మర్యాద కనిపించదు.

వసు పిలిస్తే తప్ప నువ్వు ఆ ఇంట్లోకి వెళ్లకూడదు రిషి అంటుంది జగతి. దీంతో సరే మేడమ్ అని చెప్పి ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టబోతుండగా కడప తాకి కిందపడబోతాడు. దీంతో అయ్యో రిషి చూసుకో అంటాడు మహీంద్రా. దీంతో ఏం కాదు డాడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

కట్ చేస్తే వసుధార కారును చూసి తన కారుకు అడ్డంగా తన కారును పెడతాడు రిషి. దీంతో వసు.. రిషిని చూసి షాక్ అవుతుంది. సార్ మీరు అంటుంది. నిన్ను ఒంటరిగా పంపించాలనిపించలేదు. నీతో పాటు రావాలనిపించింది అంటాడు రిషి. ఆ కారును డ్రైవర్ తో ఇంటికి పంపించి.. కూర్చో అంటాడు.

వసును తీసుకొని తన ఇంటికి బయలు దేరుతాడు రిషి. మీకు రావాలని ఎందుకు అనిపించింది అంటుంది. దీంతో నువ్వు వెళ్లిపోయాక నాలో ఏదో శూన్యం అనిపించింది. అందుకే ఉండలేక వచ్చేశాను అంటాడు. ఇంతలో దేవయాని.. రిషికి ఫోన్ చేస్తుంది. నువ్వు వసుధారతో వెళ్తున్నావా?

నువ్వు అర్జెంట్ గా వెనక్కి వచ్చేసేయ్ అంటుంది. దీంతో సారీ పెద్దమ్మ.. వసుధారను ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు. నేను రాలేను అంటాడు. దీంతో దేవయాని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది