Guppedantha Manasu 30 Dec Today Episode : రిషికి రాజీవ్ వార్నింగ్.. జగతిపై చక్రపాణి సీరియస్.. రిషి, వసు విడిపోయినట్టేనా? వసును పెళ్లి చేసుకోబోతున్న రాజీవ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 30 Dec Today Episode : రిషికి రాజీవ్ వార్నింగ్.. జగతిపై చక్రపాణి సీరియస్.. రిషి, వసు విడిపోయినట్టేనా? వసును పెళ్లి చేసుకోబోతున్న రాజీవ్

Guppedantha Manasu 30 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 డిసెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 647 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి.. దేవయానికి ఫోన్ చూసి మీరు రెడీగా ఉండండి. ఎప్పుడు వసుధార ఫోన్ చేస్తే అప్పుడు రావాల్సి ఉంటుంది అని చెప్పడంతో మహీంద్రా, జగతి అయితే చాలా సంతోషిస్తారు. అక్కడికి ఏం తీసుకెళ్లాలో మాట్లాడుకుంటారు. ఇదంతా దేవయానికి నచ్చదు. మరోవైపు వసుధార […]

 Authored By gatla | The Telugu News | Updated on :30 December 2022,9:00 am

Guppedantha Manasu 30 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 డిసెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 647 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి.. దేవయానికి ఫోన్ చూసి మీరు రెడీగా ఉండండి. ఎప్పుడు వసుధార ఫోన్ చేస్తే అప్పుడు రావాల్సి ఉంటుంది అని చెప్పడంతో మహీంద్రా, జగతి అయితే చాలా సంతోషిస్తారు. అక్కడికి ఏం తీసుకెళ్లాలో మాట్లాడుకుంటారు. ఇదంతా దేవయానికి నచ్చదు. మరోవైపు వసుధార ఫోటో చూస్తూ తన గురించే ఆలోచిస్తుంటాడు రిషి. తన గురించే మాట్లాడుతుంటాడు. కానీ.. వసుధార ఎందుకు డల్ గా కనిపిస్తోంది. తన దగ్గర ఏమైనా దాస్తుందా? అని అనుకుంటాడు రిషి. అయినా వసుధారకు నా దగ్గర దాపరికాలు ఏముంటాయి అని అనుకుంటాడు. ఇంతలో రాజీవ్ అక్కడికి వచ్చి డోర్ కొడతాడు. దీంతో వన్ కాఫీ ప్లీజ్ అంటాడు. దీంతో ఇంకేమైనా కావాలా? అంటాడు. దీంతో రాజీవ్ ను చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అంటాడు. ఇది మా మామ ఊరు అంటాడు రాజీవ్.

guppedantha manasu 30 december 2022 full episode

ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అంటాడు రిషి. మీకు ఇంకా నా మీద కోపం పోలేదు కదా అంటాడు రాజీవ్. దీంతో ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు రిషి. అవునా.. నన్ను అందరూ చాలా తక్కువ మాట్లాడుతాను అంటారే అంటాడు రాజీవ్. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అంటూ ఏదో చెప్పబోతుండగా షటప్ అండ్ గెట్ అవుట్ అంటాడు రిషి. దీంతో శుభమా అని శుభవార్త చెబుదామని వస్తే.. వెళ్లమంటారేంటి. మీ డియరెస్ట్ స్టూడెంట్ వసుధార పెళ్లి విషయం కూడా చెప్పొద్దా అంటే.. తన పెళ్లి గురించి నీకెందుకు అంటాడు రిషి. దీంతో అసలు తన పెళ్లిలో పెళ్లికొడుకే నేను అంటాడు. వసుధార నన్నే పెళ్లి చేసుకోబోతోంది. తెలుసా సార్ మీకు అంటాడు. నీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మారవా? అంటాడు రిషి. వసుధార నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంట్రా.. వసుధార నాది. వసుధారకు నాతోనే పెళ్లి అంటాడు రిషి.

దీంతో మీరు నా మాట నమ్మడం లేదు కదా. అయినా అద్భుతాలు జరిగే ముందు  చెబితే ఎవ్వరూ నమ్మరు. బ్యాడ్ లోకం అంటాడు రాజీవ్. దీంతో ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో. లేకపోతే నిన్ను కొట్టినా కొడతాను అంటాడు రిషి. దీంతో కొడితే కొట్టారు కానీ.. ముఖం మీద మాత్రం కొట్టకండి. ఎందుకంటే పెళ్లి ఫోటోలు బాగా రావు కదా అంటాడు రాజీవ్.

దీంతో తనను రూమ్ నుంచి బయటికి పంపించేస్తాడు రిషి. వసుధార మెడలో మంగళ సూత్రం చూస్తే కానీ మా పెళ్లి అయిందని నమ్మేట్టుగా లేరు. మీరు మా పెళ్లికి ఖచ్చితంగా రండి. పెళ్లికి రావడం మాత్రం మరిచిపోవద్దు సార్. రండి.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజీవ్.

వెంటనే తన రూమ్ లోకి వెళ్లి.. తన ఫోన్ లో ఫోటో చూసి చూశావా వసుధార.. వాడు ఏమంటున్నాడో? వాడితో నీకు పెళ్లి ఏంటి.. అని అంటాడు. మనం ఇద్దరం రిషిధారలం అంటాడు. మరోవైపు చక్రపాణికి ఏం చేయాలో అర్థం కాదు. సుమిత్ర.. నాకూతురు పెళ్లి విషయంలో నా ఇష్టం ఉండదా అంటాడు.

Guppedantha Manasu 30 Dec Today Episode : సుమిత్రతో గొడవ పెట్టుకున్న చక్రపాణి

కూతురుకు ఎవరు యోగ్యులో.. ఎవరు సరైన వారూ తండ్రిగా నిర్ణయించుకునే హక్కు లేదంటావా అంటాడు చక్రపాణి. దీంతో ఎప్పుడూ కోపంతో ఉండే మీరేనా ఇలా శాంతంగా మాట్లాడేది అంటుంది సుమిత్ర. దీంతో ఎప్పుడూ కోపంగా ఉంటానా? నాకూ మనసు ఉంటుంది కదా అంటాడు చక్రపాణి.

ఊళ్లో నలుగురు నన్ను ఏమనుకుంటారు సుమిత్ర. మన పెద్దమ్మాయి చనిపోయింది. దాని కొడుకు తల్లిలేని వాడు అయ్యాడు. మన అమ్మాయి రాజీవ్ ను చేసుకుంటే ఆ పిల్లాడికి తల్లి అవుతుంది కదా. వేరే అమ్మాయిని చేసుకుంటే దాని కొడుకుకు తల్లి కాలేదు కదా అంటాడు.

ఇందాకా అమ్మాయి అబ్బాయి ఫోటో చూపించింది. చాలా బాగున్నాడు. మీరు చూస్తే ఒప్పుకుంటారు అంటుంది సుమిత్ర. ఏంటి సుమిత్ర నాలుగు మాటలు శాంతంగా మాట్లాడేసరికి నీకు చులకన అయ్యానా అంటాడు చక్రపాణి. నా మనసును అర్థం చేసుకోరా? చంటి పిల్లాడికి తల్లి లేదని చెప్పా కదా. నువ్వు ఒక తల్లివే కదా.. అర్థం చేసుకోవా అంటాడు చక్రపాణి.

చక్రపాణి మాటలు విన్న వసుధార.. బయటికి వెళ్లబోతుండగా తన బ్యాగులో ఉన్న ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ను రిషి ఇచ్చిన విషయం తెలిసిందే కదా. దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో మంగళసూత్రం ఉంటుంది. దాన్ని చేతిలోకి తీసుకొని మొక్కుతుంది వసుధార.

మేడమ్ ఇది మీ ఆశీర్వాదం మాత్రమే కాదు. ఆ దేవుడి నిర్ణయం కూడా అనుకుంటుంది వసుధార. మరోవైపు చక్రపాణి, సుమిత్ర ఇద్దరూ గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. నాతో మాట్లాడొద్దు అంటాడు చక్రపాణి. దాని పని చెబుతాను ఆగు అంటూ వసుధార దగ్గరికి వెళ్తాడు.

ఏంటమ్మా పెళ్లికి ఒప్పించమని మీ అమ్మను రాయబారానికి పంపించావా అంటాడు చక్రపాణి. మీరు మీరు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ.. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. సుమిత్ర నేను చెప్పినట్టే వినాలి అంటాడు చక్రపాణి. లేదంటే దాన్ని చావమను అంటాడు.

తలగొరివి పెట్టి నాలుగు రోజులు ఏడుస్తాను అంటాడు. దీంతో బంధాలు, ప్రేమలు వీటి విలువ మీకు తెలిస్తే ఇలా మాట్లాడరు అంటుంది వసుధార. దీంతో ఏమన్నావు అంటాడు చక్రపాణి. నేనేం తప్పుగా మాట్లాడలేదు. మీ పెద్దరికాన్ని నేను గౌరవిస్తూనే ఉన్నాను కానీ.. మీరే దాన్ని నిలబెట్టుకోవడం లేదు అంటుంది వసుధార.

ఇంతలో జగతి మేడమ్.. వసుధారకు ఫోన్ చేస్తుంది. తన ఫోన్ లాక్కుంటాడు చక్రపాణి. ఫోన్ ఎత్తుతాడు చక్రపాణి. హలో వసు అక్కడ అంతా ఓకేనా అంటుంది జగతి. దీంతో టీచరమ్మా ఇక్కడ అంతా క్షేమమే అమ్మ అంటాడు చక్రపాణి. దీంతో ఆ దౌర్భాగ్యుడిని నేనేనమ్మా అంటాడు.

వసుధార గొప్పగా ఎదిగింది. అందుకు మీరు సంతోషించాలి అంటుంది జగతి. దీంతో అవునమ్మా అంతా మీ ట్రెయినింగే కదా. మహా గొప్పగా ఎదిగింది అంటాడు. ఇల్లు వదిలి పారిపోయింది. ఇన్నాళ్లకు ఇప్పుడు వచ్చి నేను పెళ్లి చేసుకుంటా నాన్న అంటుంది అంటాడు.

అంత గొప్పగా ఎదిగింది అమ్మ అంటాడు చక్రపాణి. మళ్లీ ఇల్లు వదిలి పారిపోయి రమ్మని చెప్పడానికి ఫోన్ చేశారా అంటాడు చక్రపాణి. టీచరమ్మ.. నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటి దాకా నువ్వు మా అమ్మాయికి సలహాలు ఇస్తూనే ఉన్నావా అని అడుగుతాడు.

దీంతో కాస్త ప్రశాంతంగా నా మాట వినండి. వసుధార యూనివర్సిటీ టాపర్ అయింది అంటుంది. దీంతో నా పరువు పోయింది ఇక్కడ. మీరు తెచ్చి ఇవ్వగలరా? అంటాడు. చక్రపాణి సన్నాసి అని టాప్ లేచిపోయేట్టుగా ఊరు ఊరంతా టమకేస్తున్నారు అంటాడు.

జరిగిన దాన్ని మరిచిపోండి అంటే.. ఇది మాత్రం ఎవడో అడ్రస్ లేని ఎదవని పెళ్లి చేసుకుంటా అని వచ్చింది అంటాడు. దీంతో రిషి నా కొడుకు. డీబీఎస్టీ కాలేజీ ఎండీ తను అంటుంది. అరెరె.. ఆ రిషి నీ కొడుకా అంటాడు చక్రపాణి. నీ కొడుకుకు నా కూతురును ఇచ్చి పెళ్లి చేయాలా?

అసలు నీ మొగుడు ఎవరో.. ఊరు ఏంటో.. సంసారం ఏంటో తెలియదు. ఇప్పుడు వచ్చి ఎవడినో నీ కొడుకు అని చెబుతూ.. నా కూతురు గొంతు కోస్తున్నావా? శెభాష్ టీచరమ్మ అంటాడు చక్రపాణి. దీంతో మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడండి. రిషి నా కన్న కొడుకు అంటుంది జగతి. దీంతో అయితే అస్సలు ఒప్పుకోను అంటాడు చక్రపాణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది