Bigg Boss 5 Telugu : అర్దరాత్రి ముద్దులతో హల్చల్.. హమీద శ్రీరామచంద్ర ట్రాక్ పట్టాలెక్కిసింది!
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu ఇంట్లో రొమాన్స్‌కు కొదవే ఉండదు. ఇంకా ఈ ఐదో సీజన్‌లో అసలైన ట్రాకులు మొదలు కానేలేదు. ఇప్పుడిప్పుడే ట్రాకులు పట్టాలెక్కుతున్నాయి. ఇక ఇందులో ఓ ట్రాన్స్ జెండర్ కూడా ఉండేట్టు కనిపిస్తోంది. ఎక్కువగా ట్రాక్ నడిపించే స్కోప్ మాత్రం శ్రీరామచంద్ర, హమీద జోడికి ఉంది. అందుకే బిగ్ బాస్ టీం కూడా ఆ జంట మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. […]
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu ఇంట్లో రొమాన్స్‌కు కొదవే ఉండదు. ఇంకా ఈ ఐదో సీజన్‌లో అసలైన ట్రాకులు మొదలు కానేలేదు. ఇప్పుడిప్పుడే ట్రాకులు పట్టాలెక్కుతున్నాయి. ఇక ఇందులో ఓ ట్రాన్స్ జెండర్ కూడా ఉండేట్టు కనిపిస్తోంది. ఎక్కువగా ట్రాక్ నడిపించే స్కోప్ మాత్రం శ్రీరామచంద్ర, హమీద జోడికి ఉంది. అందుకే బిగ్ బాస్ టీం కూడా ఆ జంట మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. మానస్ ప్రియాంక ట్రాక్ ప్రాక్టికల్‌గా వర్కవుట్ కాదు. అందుకే శ్రీరామచంద్ర, హమీదపై ఫుల్ ఫోకస్ పెట్టేసింది టీం.
ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్లో అయితే ఈ ఇద్దరూ రెచ్చిపోయారు. అంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి టాస్క్ చేశారు. ఏం తినకుండా ఉన్నారు. నెగ్గాలంటే తగ్గాలనే టాస్క్‌లో ఈ జోడి గెలిచింది. కెప్టెన్ రేసుకు హమీద తప్పుకోవడంతో శ్రీరామచంద్ర వచ్చాడు. చివరకు శ్రీరామచంద్ర కెప్టెన్అయ్యాడు. ఇక హమీదను రేషన్ మేనేజర్ చేస్తానని మాటిచ్చాడు. అలా శ్రీరామచంద్ర, హమీదలు అర్దరాత్రి వరకు అలా ముచ్చట్లు పెట్టుకుని ఎవరి బెడ్ మీదకు వారు వెళ్లిపడుకున్నారు.
హమీద శ్రీరామచంద్ర రొమాన్స్.. Bigg Boss 5 Telugu
ఇక బెడ్ మీదకు వెళ్లిన తరువాత.. ముద్దులతో రెచ్చిపోయారు. గాల్లోనే ముద్దులు ఎగరేస్తూ ఒకరి మీదకు ఒకరు ఫ్లైయింగ్ కిస్‌లను ఇచ్చుకున్నారు. ఆ తరువాత టాస్క్‌లో భాగంగా శ్రీరామచంద్ర తన మనసులోని కోరికలను బయటపెట్టేశాడు. హమీదతో డేట్‌కు వెళ్లాలనే కోరిక ఉందని చెప్పాడు. చివరకు ఆమెతో కలిసి సాల్సా డ్యాన్స్ చేసి ఓ పాట పాడేశాడు. చివర్లో హమీదను ఎత్తేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. అలా ఈ జోడి ఇప్పుడు మంచి ఫాంలో ఉంది.