Bigboss-5 Telugu..శ్రీరామ్ ద‌గ్గ‌రే ఉండాల‌నిపిస్తోందంటున్న హ‌మీదా.. ల‌వ్ ట్రాక్ స్టార్ట్ అయిందా..?

Advertisement

Bigboss-5 Telugu : బిగ్ బాస్ అంటేనే అంద‌రికీ గుర్తుకు వ‌చ్చేది గొడ‌వ‌లు, ఏడుపులు, ల‌వ్ ట్రాక్‌లు. గ‌త నాలుగు సీజ‌న్ల‌ను గ‌న‌క మ‌నం చూస్తే ప్ర‌తి సీజ‌న్‌లోకూడా ల‌వ్ ట్రాక్‌లు క‌నిపించాయి. మ‌రి సీజ‌న్‌-5 స్టార్ట్ అయి ఇన్ని రోజులు గ‌డుస్తున్నా కూడా ఇలాంటి ల‌వ్ ట్రాక్‌లు ఇంకా హైలెట్ కావ‌ట్లేద‌నే టాక్ న‌డుస్తోంది.

Advertisement
hamida who seems to be close to shriram has the love track started 2
hamida who seems to be close to shriram has the love track started 2

ఇక ఈ త‌రుణంలో హ‌మీదా, శ్రీరామ్ మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌నే గుస‌గుస‌లు చాలా రోజులుగానే వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తోంద‌నే రూమ‌ర్లు మొద‌టి నుంచే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో బుధ‌వారం రాత్రి విడుద‌లైన ప్రోమో ప్ర‌త్యేకించి వీరి ల‌వ్ ట్రాక్ గురించే ఉంది.

Advertisement
hamida who seems to be close to shriram has the love track started 2
hamida who seems to be close to shriram has the love track started 2

ఈ ప్రోమోలో చూస్తే హ‌మీదా, శ్రీరామ్‌లు ఒక ద‌గ్గ‌ర కూర్చుని హాయిగా క‌బుర్లు చెప్పుకుంటున్నట్టు క‌నిపిస్తోంది. ఇక హ‌మీదా మాట్లాడుతూ నీ ద‌గ్గ‌రే ఉండాల‌నిపిస్తుంది, మ‌ళ్లీ దూరంగా ఉండాల‌నిపిస్తుంది అని చెప్తుంది. ఇక దీనికి శ్రీరామ్ వావ్‌.. అంటున్న‌ట్టు తెలుస్తోంది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన కుషీ సినిమాలోని ఏదోలా ఉందీ వేళ నాలో అన్న సాంగ్‌ను అక్క‌డే ప‌నిచేస్తున్న లోబో పాడ‌టం హైలెట్‌. వారిద్ద‌రి ల‌వ్ ట్రాక్‌కు సింక్ అయ్యే విధంగా లోబో పాడ‌టం ఇక్క‌డ విశేషం. ఇక వీరి ల‌వ్ ట్రాక్ ప్రోమోపై సోష‌ల్ మీడియాలో భిన్న‌మైన కామెంట్లు వ‌స్తున్నాయి.

hamida who seems to be close to shriram has the love track started 2
hamida who seems to be close to shriram has the love track started 2

ఇలాంటి ట్రాక్‌లు వ‌ద్ద‌ని, గొడ‌వ‌లు ప‌డే సీన్ బెట‌ర‌ని కామెంట్ పెడుతున్నారు. మ‌రి కొంద‌రేమో వీరి ల‌వ్ స్టోరీ బాగుంద‌ని చెబుతున్నారు. ఏదేమైనా ఈ సీజ‌న్‌లో వీరి ల‌వ్ ట్రాక్ ఏ మేర‌కు హైలెట్ అవుతుందో చూడాలి.

Advertisement
Advertisement