Ariyana : దొంగ స‌చ్చినోళ్లు అంటూ అలా తిట్టేసింది ఏంటి.. అరియానా ఇది కరెక్టా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ariyana : దొంగ స‌చ్చినోళ్లు అంటూ అలా తిట్టేసింది ఏంటి.. అరియానా ఇది కరెక్టా..!

Ariyana : బిగ్ బాస్ నాన్‌స్టాప్ విన్న‌ర్‌గా బిందు మాధ‌వి నిలిచి చరిత్ర సృష్టించింది. తెలుగులో ఐదు సీజ‌న్స్ జ‌ర‌గ‌గా, ప్ర‌తి సీజ‌న్‌లోను అబ్బాయిలే ట్రోఫీ ప‌ట్టుకెళ్లారు. కాని తొలిసారి బిందు మాధ‌వి ట్రోఫీ గెలుచుకుంది. అన్ని సీజన్లకంటే భిన్నంగా ఈసారి ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్స్‌ గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నారు. ప్రతి సీజన్‌లోనూ టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా.. ఈసారి ఏడుగుర్ని ఫైనల్‌కి పంపారు. టైటిల్ రేస్‌లో యాంకర్ శివ, బిందు మాధవి, అఖిల్, మిత్రా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :23 May 2022,1:30 pm

Ariyana : బిగ్ బాస్ నాన్‌స్టాప్ విన్న‌ర్‌గా బిందు మాధ‌వి నిలిచి చరిత్ర సృష్టించింది. తెలుగులో ఐదు సీజ‌న్స్ జ‌ర‌గ‌గా, ప్ర‌తి సీజ‌న్‌లోను అబ్బాయిలే ట్రోఫీ ప‌ట్టుకెళ్లారు. కాని తొలిసారి బిందు మాధ‌వి ట్రోఫీ గెలుచుకుంది. అన్ని సీజన్లకంటే భిన్నంగా ఈసారి ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్స్‌ గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నారు. ప్రతి సీజన్‌లోనూ టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా.. ఈసారి ఏడుగుర్ని ఫైనల్‌కి పంపారు. టైటిల్ రేస్‌లో యాంకర్ శివ, బిందు మాధవి, అఖిల్, మిత్రా శర్మ, అనీల్ రాథోడ్, బాబా భాస్కర్, అరియానా ఈ ఏడుగురు ఉన్నారు. బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి ఒక అమ్మాయి టైటిల్‌ విన్నర్‌గా నిలవడం బిందుకే సాధ్యమైంది.

ఆడపులి హ్యాష్‌ట్యాగ్‌తో ఫేమస్‌ అయిన బిందు ఓటీటీ విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది. ఈ కొత్త ఫార్మాట్‌లో మొత్తం 18మంది కంటెస్టెంట్‌లు పాల్గోన్నారు. అజయ్‌ కుమార్‌, అఖిల్‌ సార్థక్‌, బిందు మాధవి, హమీదా, మహేష్ విట్టా, ముమైత్‌ ఖాన్‌, తేజస్విని మదివాడ, శ్రీ రాపాక, అరియానా, శివ, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, అనిల్‌ రాథోడ్‌, మిత్రా శర్మ, బాబా భాస్కర్‌, నటరాజ్‌మాస్టర్‌, అషురెడ్డి, సరయు కంటెస్టెంట్స్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సరికొత్త ఫార్మాట్ మొదటి సీజన్ 84 రోజుల పాటు నడిచింది.అఖిల్, బిందు మాధవి, శివ, అరియానాల నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయమని, అయితే అంతకు ముందు డబ్బులు తీసుకుని ఆ బ్రీఫ్ కేస్‌తో బేరం ఆడించేందుకు అనిల్ రావిపూడి, సునీల్‌ను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించాడు నాగార్జున.

ariyana fire on f3 team

ariyana fire on f3 team

Ariyana : అలా మాట్లాడేశావు ఏంటి..!

ఎవ‌రు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు కాని అరియానా మాత్రం డబ్బు కోసమే వచ్చానని, తన ఫ్లాట్ కొనాలనే కోరికతోనే వచ్చానని తెలిపింది. తన ఆర్థిక కష్టాలను తీర్చుకోవాలని, అలానే కప్పు కొట్టాలని ఉద్దేశ్యంతోనే వచ్చానని శివ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చిన అరియానాను నాగార్జున ఆడుకున్నాడు. ఇందులో డబ్బుల్లేవ్.. అలా ఎలా నమ్మేశావ్ అంటూ బాంబు పేల్చాడు. దీంతో అనీల్ రావిపూడి, సునీల్‌లను దొంగసచ్చినోళ్లు అంటూ అరియానా తిట్టేసింది. ఈ దొంగసచ్చినోళ్లని నమ్మాను.. లక్షలు ఉన్నాయి అని చెప్పారు.. అంటూ అరియానా తెగ హర్ట్ అయింది. చూశారా? డబ్బు ఉందంటే.. ఒకలా మాట్లాడింది.. లేదనే సరికి ఇలా దొంగసచ్చినోళ్లారా? అని అనేసింది అంటూ అనిల్ రావిపూడి, సునీల్ కౌంటర్లు వేశారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది