Hari Hara Veera Mallu Movie Trailer : అద్దిరిపోయిన హరిహర వీరమల్లు ట్రైలర్.. పూనకాలు తెప్పిస్తుందిగా..!
ప్రధానాంశాలు:
Hari Hara Veera Mallu Movie Trailer : అద్దిరిపోయిన హరిహర వీరమల్లు ట్రైలర్.. పూనకాలు తెప్పిస్తుందిగా..!
Hari Hara Veera Mallu Movie Trailer : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తను కమిటైన సినిమాలను ఒక్కొక్కోటిగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దీనిలో భాగంగా హరిహర వీరమల్లు షూటింగ్‌ను ఎంతో కష్టపడి పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.. ట్రైలర్ ఎలా ఉంది? పవన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అభిమానులను అలరించిందా? లేదా అన్నది చూస్తే. ఇది ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తుంది.

Hari Hara Veera Mallu Movie Trailer : అద్దిరిపోయిన హరిహర వీరమల్లు ట్రైలర్.. పూనకాలు తెప్పిస్తుందిగా..!
Hari Hara Veera Mallu Movie Trailer : సూపర్బ్ రెస్పాన్స్..
క్రిష్ జాగర్లమూడి తొలుత ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించగా.. టేకప్ చేయగా అనివార్య కారణాలతో ఆయన తప్పుకుని జ్యోతికృష్ణ సీన్‌లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్‌స్టార్‌తో, అందులోనూ టైట్ షెడ్యూల్ మధ్య జ్యోతికృష్ణ సమన్వయం చేసుకుని సినిమాను పూర్తి చేశారు.కేవలం నాలుగు గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి శెభాష్ అనిపించుకున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ జూన్ 3వ తేదీ ఉదయం 11.10 గంటలకు హరిహర వీరమల్లు ట్రైలర్‌ను విడుదల చేసింది.. దీనికి పవన్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్‌షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం పకృతి పురుడు పోసుకుంటున్న సమయం. అన్న డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ట్రైలర్ చూస్తుంటే.. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు కాలం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల కనిపిస్తుంది .
