RRR : ఆర్‌ఆర్‌ఆర్ కి ఆస్కార్?? తెలుగువాళ్ళకి Goosebumps తెప్పించే బ్రేకింగ్ న్యూస్ ..!

Advertisement

RRR : తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి చాటిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ. ఈ సినిమాను చూసిన విదేశీయులు అయితే అవాక్కయిపోయారు. ఏం సినిమా అంటూ మెచ్చుకున్నారు. ఒక భారత సినిమా ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను అవాక్కయ్యేలా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది కేవలం ఆర్ఆర్ఆర్ కే సాధ్యం అయింది. అయితే.. ఒక తెలుగు సినిమా ఇన్ని సంచలనాలను సృష్టించడం ఇదే అరుదు.

Advertisement

అలాగే.. ఆస్కార్ బరిలో ఒక తెలుగు సినిమా నిలవడం కూడా ఇదే తొలిసారి.ఆస్కార్ రేసులోకి ఈ సినిమా వెళ్లడంతో తెలుగు సినిమా ఖ్యాతి ఒక్కసారిగా ప్రపంచాన్ని తాకింది. ఆస్కార్ కంటే ముందు ఆర్ఆర్ఆర్ సినిమా చాలా అవార్డులు వచ్చాయి. న్యూయార్క్ ఫిలిం సర్కిల్ బెస్ట్ డైరెక్టర్స్ అవార్డు కూడా దక్కించుకుంది ఆర్ఆర్ఆర్. ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అవార్డును దక్కించుకున్నారు. నిజానికి.. న్యూయార్క్ ఫిలిం సర్కిల్ లో అవార్డు వచ్చిందంటే వాళ్లకు ఆస్కార్ లోనూ అవార్డ్ వస్తుంది. అందుకే..

Advertisement
hollywood spotlight award to win buy rrr for oscar awards
hollywood spotlight award to win buy rrr for oscar awards

RRR : స్పాట్ లైట్ అవార్డు విన్నర్ గా ఆర్ఆర్ఆర్ కాస్ట్ అండ్ క్రూను ప్రకటించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్

ఆస్కార్ లోనూ ఆర్ఆర్ఆర్ సత్తా చాటుతుందని అంతా భావిస్తున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ కాస్ట్ అండ్ క్రూని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ అవార్డు విన్నర్ గా ప్రకటించింది. ఈ అవార్డును త్వరలో ఆర్ఆర్ఆర్ టీమ్ కు అందజేయనున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి అవార్డు రావడం అనేది కూడా చిన్న విషయం కాదు. అందుకే.. ఆర్ఆర్ఆర్ కు త్వరలోనే ఆస్కార్ కూడా వస్తుందంటూ సినీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి.. ఆస్కార్ అవార్డు.. ఆర్ఆర్ఆర్ ను వరిస్తుందో లేదో?

Advertisement
Advertisement