Hyper Aadi : జబర్దస్త్ హైపర్ ఆది అజ్ఞాతవాసం వీడే సమయం వచ్చినట్లేనా…?
Hyper Aadi : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన జబర్దస్త్ లో హీరో అనడంలో కూడా సందేహం లేదు. అలాంటి జబర్దస్త్ స్టార్ హీరో గత కొన్నాళ్లు గా కనిపించడం లేదు. దాంతో హీరో లేని సినిమా పరిస్థితి అయ్యింది జబర్దస్త్ ది. ఏం చేయాలో పాలుపోక మల్లెమాల టీం కిందా మీద పడి కొత్త టీమ్ ను క్రియేట్ చేసి ఆది లేనిలోటును తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైపర్ ఆది అసలు ఎందుకు జబర్దస్త్ లో కనిపించడం లేదు.. ఆయన ఇతర ఏ షోల్లో కూడా ఇంకా కనిపించడం లేదు.
కనుక ఆయన వేరే ఛానల్ కు వెళ్లాడు అనేది కూడా నమ్మశక్యంగా లేదు.బుల్లి తెర మరియు వెండి తెరపై ఈమద్య కాలంలో చాలా మంది సందడి చేస్తున్నారు. కనుక సినిమాల్లో ఆఫర్ పేరు చెప్పి ఆది జబర్దస్త్ ను వీడే అవకాశమే లేదు. ఇటీవలే ఢీ షో లో ఆది తిరిగి ప్రవేశించాడు. ఆయన బుల్లి తెరపై చేస్తున్న సందడి ఢీ తో తిరిగి ప్రారంభం అయ్యింది. అంతే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా హైపర్ ఆది రీ ఎంట్రీ ఇచ్చాడు.. జబర్దస్త్ లో ఎందుకు కనిపించడం లేదు అనే విషయం ను కూడా అక్కడ చర్చించారు. ఆది దాదాపుగా అన్ని షో ల్లో కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టం గా కనిపిస్తున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Hyper Aadi coming With In Few Days for Jabardast Comedy Show
జబర్దస్త్ తదుపరి ఎపిసోడ్ లేదా ఆ తదుపరి ఎపిసోడ్ లో అయినా హైపర్ ఆది అజ్ఞాతవాసం వీడి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ కొందరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. హైపర్ ఆది వ్యక్తిగత కారణాల వల్ల షో లకు కొన్ని వారాల పాటు దూరం అయ్యాడు. ఇప్పుడు ఆయన అజ్ఞాతవాసం వీడి మళ్లీ బుల్లి తెరపై అది కూడా ఈటీవీలో సందడి చేయడంకు రెడీ అయ్యాడు. జబర్దస్త్ అభిమానులు మరియు ప్రేక్షకులు లక్షల కళ్లతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆది మళ్లీ జబర్దస్త్ లో సందడి చేస్తే అప్పుడు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటారు.