Hyper Aadi : అనసూయ రెమ్యూనరేషన్.. అసలు విషయం చెప్పిన హైపర్ ఆది
Hyper Aadi : అనసూయ హైపర్ ఆది కాంబినేషన్ అంటే బుల్లితెరపై ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. హైపర్ ఆది తన స్కిట్లో అనసూయ మీద వేసే పంచ్‌లు మామూలుగా ఉండవు. ఇక అనసూయ ప్రతీ స్కిట్లో ఏదో ఒక సెటైర్ వేస్తుంటారు. అనసూయ మీదున్న ప్రేమ, కోరికను తెలిపేలా డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోతోంటాడు. అయితే తాజాగా హైపర్ ఆది కాస్త హద్దులు దాటేశాడు.
ఇందులో భాగంగా అనసూయను ఓ ముద్దు అడిగేశాడు.. ఒక్క చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అందరి ముందే చెప్పేశాడు. భరద్వాజ్‌తో పెళ్లి మళ్లీ మళ్లీ చూడలేను అంటూ అనసూయ మీదున్న ప్రేమను ఆది వ్యక్తపరిచాడు. ఇక స్కిట్లో భాగంగానే అది రెమ్యూనరేషన్ గురించి వాగేశాడు. అందరికంటే ఎక్కువగా రోజా, అనసూయలకే ఉంటుందని చెప్పేశాడు.

Hyper aadi On Anasuya Jabardasth Remuneration
Hyper Aadi : అనసూయ పేమెంట్‌పై ఆది..
స్కిట్లో భాగంగా అనసూయ ఓ డైలాగ్ వేస్తుంది. నువ్ ఇన్ని అంటున్నా కూడా ఇక్కడే ఎందుకున్నానో తెలుసా? అని అనసూయ అడుగుతుంది. ఎందుకంటే మా అందరి కంటే మీ ఇద్దరికే (రోజా, అనసూయ) పేమెంట్ ఎక్కువ కాబట్టి అని కౌంటర్లు వేశాడు. దీంతో అనసూయ, రోజాలు తెగ నవ్వేసుకున్నారు. మొత్తానికి జబర్దస్త్‌లో అనసూయ, రోజాలతే హవా అని ఇలా తెలిసిపోయింది.