Hyper Aadi : ఈటీవీ మదర్స్ డే స్పెషల్ కార్యక్రమంలో హైపర్ ఆది.. చూసేదంతా నిజం కాదు
Hyper Aadi : ఈటీవీ మల్లెమాల వారిని హైపర్ ఆది వదిలేశాడు.. ఇది గత రెండు మూడు వారాలుగా మీడియాలో జరుగుతున్న ప్రచారం. గత నెల రోజులుగా షూటింగ్ కు హైపర్ ఆది హాజరు అవ్వడం లేదని జబర్దస్త్ టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. మల్లెమాల వారితో ఆదికి పడటం లేదు. అందుకే ఆయన చేసేది లేక బయటకు వెళ్లాడు అనేది టాక్. కాని తాజాగా వచ్చిన ఒక ప్రోమో లో హైపర్ ఆది కనిపించడం తో అభిమానులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆది మళ్లీ ఈటీవీలో కనిపించబోతున్నాడు అంటూ ఆయన అభిమానులు ఆనందంగా ఉన్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే చూసింది అంతా నిజం కాదు.
ఔను… మదర్స్ డే సందర్బంగా ఈ ఆదివారం టెలికాస్ట్ కాబోతున్న కార్యక్రమం లో హైపర్ ఆది సందడి చేయబోతున్నాడు. ఆ షో లో హైపర్ ఆది కనిపించబోతున్నాడు కనుక ముందు ముందు మళ్లీ జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా కనిపిస్తాడు అంటూ అంతా భావిస్తున్నారు. ఆయన పంచ్ లు లేక.. ఆయన టైమింగ్ లేక షో లు అన్ని కూడా వెల వెల బోతున్నాయి. ఈ సమయంలో మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఆయన కనిపించడం వల్ల ఖచ్చితంగా ముందు ముందు ఆయన మళ్లీ ఎంటర్ టైన్ చేస్తాడని భావించారు. కాని అనూహ్యంగా అది నిజం కాదని స్వయంగా ఈ టీవీ వారు చెబుతున్నారు. ఆది మళ్లీ రాకపోవచ్చు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు.

Hyper Aadi re entry in e
మరి మదర్స్ డే కు ఎందుకు వచ్చాడు అంటే అది చాలా వారాల క్రితం షూట్ చేసిందని తెలుస్తోంది. ఆది మల్లెమాల వారితో బాగానే ఉన్న సమయంలో షూటింగ్ జరిగింది. ఆ ఎపిసోడ్ ను ఇన్నాళ్లకు టెలికాస్ట్ చేయబోతున్నారు. కనుక అందులో ఆది ఉంటాడు. ఇక ముందు చేయబోతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఆది కనిపించడు అంటూ జబర్దస్త్ మెంబర్స్ అంటున్నారు. హైపర్ ఆది తర్వాత జర్నీ ఎటు అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లోకి ఆదిని రప్పించేందుకు నాగబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఏం జరుగుతుందో చూడాలి.