Hyper Aadi : పచ్చిపచ్చిగా అనేశాడు!.. అనసూయ మీద కోరికతో రగిలిపోతోన్న హైపర్ ఆది
Hyper Aadi : హైపర్ ఆది అనసూయ కాంబినేషన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అనసూయకు పెళ్లి అయిపోయిందని, దక్కించుకోలేకపోయాను అంటూ తన స్కిట్లు, ప్రాసలు, పంచ్‌లు, డైలాగ్స్‌లో ఆది ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాడు. ఇక ఆది అనసూయ కలిసి స్కిట్ వేస్తే అన్ని డైలాగ్స్ డబుల్ మీనింగ్‌లోనే ఉంటాయి. అనసూయ మీదున్న కోరికను ఆది బయటపెట్టినట్టుగానే ఉంటుంది.
ఇక తాజాగా వేసిన స్కిట్లో అయితే అనసూయపై దారుణంగా కామెంట్లు చేశాడు ఆది. ఒక్క చాన్స్ కోసం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పేశాడు. జబర్దస్త్ షోలకి వచ్చేందుకు ఎంతో మంది గేటు ముందు ఒక్క చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు తెలుసా? అని అనసూయ ఉంటుంది. గేటు ముందున్న వారిని చూశావ్ కానీ ఒక్క చాన్స్ కోసం నీ ముందున్న వాళ్లను పట్టించుకోవా? అని అనేస్తాడు ఆది.

Hyper Aadi Showers Love Indirectly On Anasuya
Hyper Aadi : అనసూయపై ఆది కోరిక..
డేటింగ్, ఈటింగ్ అంటూ ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడేశాడు. రిహార్సల్స్‌లో ఇవేవీ చెప్పలేదు కదా? అంటాడు. ఇక ఒక్క హగ్గు ఇవ్వు అని అడిగేస్తాడు. ఈ రోజు గురువారం ఉపవాసం అని అనసూయ అంటుంది. నువ్ ఇలా చేస్తూనే ఉంటే.. నాకు మంగళవారం అని అనుకుంటారంటూ పంచ్ వేస్తాడు. నువ్ మీ చిలకకు ముద్దు పెడుతుంటే చూశా.. వచ్చే జన్మలో చిలకలా పుడదామని అనుకుంటున్నానంటూ కోరికను బయటపెట్టేస్తాడు.