Jr NTR : బింబిసార సినిమాను ఎన్టీఆర్‌ చేసి ఉంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : బింబిసార సినిమాను ఎన్టీఆర్‌ చేసి ఉంటే…!

 Authored By aruna | The Telugu News | Updated on :7 August 2022,12:00 pm

Jr NTR : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజే 10 కోట్లకు పైగా వసూళ్ల ను ఈ సినిమా కి రావడంతో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అతిపెద్ద సూపర్ హిట్ గా బింబిసార సినిమాని చెప్పుకుంటున్నారు. రికార్డ్ బేకింగ్ వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. బింబిసార సినిమా విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాకు వస్తున్న టాక్ కారణంగా ఈ సినిమా కు రెండవ పార్ట్‌ ను కూడా చేయబోతున్నట్లు ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నటన కు ప్రశంసలు దక్కుతున్నాయి. మరో వైపు ఈ సినిమా ను కనుక ఎన్టీఆర్‌ చేసి ఉంటే మరో రేంజ్ లో ఉండేది.. వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సునామి వచ్చి ఉండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ యొక్క బాడీ లాంగ్వేజ్ కి మరియు ఆయన నటన ప్రతిభకు ఇంకా ఆయన యొక్క స్టార్‌ డమ్ కు సినిమా కథ చాలా బాగా సెట్ అవుతుందని అతను నటిస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.

if NTR did nandamuri kalyan ram Bimbisara movie

if NTR did nandamuri kalyan ram Bimbisara movie

ఒకవేళ బింబిసార సినిమాలో ఎన్టీఆర్ నటించి ఉంటే కచ్చితంగా మొదటి రూ. 50 కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి. లాంట్ రన్ లో ఈ సినిమా మూడు నాలుగు వందల కోట్ల వసూళ్లు కూడా ఈజీగా నమోదు చేసేవాడు అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గురించి చర్చ తారా స్థాయిలో జరుగుతున్నాయి. దాంతో థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. పరిస్థితి చూస్తూ ఉంటే మామూలుగా లేదు. రెండవ రోజు కూడా పాజిటివ్ గానే వసూళ్లు నమోదవుతున్నాయి.. మూడో రోజు కూడా బింబిసార సినిమా భారీగానే వసూళ్లు దక్కించుకుంటుందని అంటున్నారు. దాంతో మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ సాధించే అవకాశాలు ఉన్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది