Singer Mano : జబర్దస్త్ నుండి మనో తప్పుకోవడానికి కారణం ఇదే! షాక్ అవ్వడం ఖాయం

Advertisement

Singer Mano : జబర్దస్త్ ప్రారంభం అయ్యి 10 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఇప్పటి వరకు ఎంతో మంది కంటెస్టెంట్స్ మరియు టీం లీడర్స్ వెళ్లి పోయారు. కొత్త వారు వచ్చారు, కానీ జడ్జ్ ల విషయంలో మాత్రం అలా ఎక్కువగా జరగలేదు. మొదట రోజా మరియు నాగబాబు జడ్జిలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వారిద్దరూ కూడా చాలా కాలం పాటు కొనసాగారు. కొన్ని కారణాల వల్ల నాగబాబు జడ్జ్ గా వ్యవహరించేందుకు నిరాకరించడంతో ఆయన స్థానంలో సింగర్ మనో వచ్చాడు. నాగబాబు వివాదాల వల్ల వెళ్ళిపోయాడు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

why Singer Mano walkout from jabardasth
why Singer Mano walkout from jabardasth

రోజా మంత్రి పదవి రావడం వల్ల వెళ్ళిపోయింది. కానీ సింగర్ మనో ఎందుకు వెళ్లి పోయాడు అనేది మాత్రం చాలా మందికి అనుమానంగా ఉంది. ఆయన రెగ్యులర్ గా చెన్నై నుండి షూటింగ్ కోసం రావాల్సి వస్తుంది. షూటింగ్ ఉన్న ప్రతి సారి చెన్నై నుండి ఆయన వస్తూ వెళ్తూ ఉండేవాడట. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు ఆయన ఫ్లైట్ మిస్ అవ్వడం లేదా ఇతర కారణాల వల్ల షెడ్యూల్ కి హాజరు కాలేక పోవడంతో మల్లెమాల వారు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందట. మల్లెమాల వారి ప్రవర్తన కారణంగానే ఆయన జబర్దస్త్ కి దూరమవ్వడం జరిగిందని తెలుస్తోంది.

Advertisement
why Singer Mano walkout from jabardasth
why Singer Mano walkout from jabardasth

తిరిగి రమ్మన్నా కూడా ఆయన నో చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. తమిళనాడు నుండి జబర్దస్త్ వారు ఇచ్చే కొద్ది మొత్తం రెమ్యూనరేషన్ కోసం మనో వచ్చేవాడు కాదు.. ఆయనకు ఆ రెమ్యూనరేషన్ తక్కువే అయినా జబర్దస్త్ కార్యక్రమం పై ఆసక్తి ఉండడం వల్ల.. కామెడీ అంటే ఆసక్తి ఉండడం వల్ల అంత దూరం నుండి వచ్చేవాడు. కానీ రెమ్యూనరేషన్ విషయం కాదని అంత దూరం నుండి వచ్చినా కూడా ఆ విషయం పట్టించుకోకుండా మల్లెమాల వారు చాలా దారుణంగా మనో విషయంలో వ్యవహరించారంటూ చాలా మంది జబర్దస్త్ కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement
Advertisement