Intinti Gruhalakshmi 1 Dec Today Episode : తులసికి దండం పెట్టిన అనసూయ.. లాస్యకు షాకిచ్చిన అనసూయ, తులసి.. లాస్య ఖేల్ ఖతమేనా?

Authored By Varun G | The Telugu News | Published on: December 1, 2022, 9:30 am

ntinti Gruhalakshmi 1 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 804 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నన్ను క్షమించు తులసి అంటుంది అనసూయ. నేను చేసిన పాపం ఎలా పోవాలి అని అంటుంది అనసూయ. దీంతో పశ్చాత్తాపంతో పోతుంది అంటుంది తులసి. నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటుంది అనసూయ. నేను కూడా నిన్ను ఒక కోరిక కోరుతాను కాదు అనకూడదు. నా మాట వినాలి అంటుంది అనసూయ. దీంతో పాతికేళ్లుగా మీ మాట విన్నాను. ఇప్పుడు విననా అంటుంది తులసి. బిడ్డ మీద హక్కు ఎప్పటికైనా తల్లికి ఉంటుంది అంటుంది తులసి. నన్ను ఏం అడగాలని అనుకుంటున్నారో అడగండి అంటుంది తులసి. నువ్వు తల్లిగా భావించే ఈ రాక్షసి నిన్ను అనుమానించి ఈ ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేసింది అంటుంది.

intinti gruhalakshmi 01 december 2022 full episode

intinti gruhalakshmi 01 december 2022 full episode

దీంతో అత్తయ్య నన్ను మాత్రం తిరిగి ఈ ఇంటికి రమ్మని చెప్పొద్దు అంటుంది తులసి. వస్తూ పోతూ ఉండమని అడుగుతున్నాను అంటుంది అనసూయ. రోజంతా ఉండొద్దు కానీ.. రోజూ ఒక అరగంట, కనీసం పదినిమిషాలు అయినా సరే అంటుంది అనసూయ. మరోవైపు లాస్యకు కోపం వస్తుంది. పోనీలే గొడవ ఎందుకు అని తలొంచుకుంటే నేను పరాయిదాన్ని అయిపోయానా? వాళ్లు సీక్రెట్ మాట్లాడుకోవడానికి నన్ను బయటికి తరిమేస్తుందా అని అనుకుంటుంది లాస్య. ఇంతలో సోఫా మీద ఒక చీర కనిపిస్తే దాన్ని కింద విసిరేస్తుంది. ఆ ముసలిదానికి ఏదైనా ఆస్తి కలిసి వచ్చిందా? నా కళ్లు కప్పి వాళ్లు వాళ్లే పంచుకుందామని అనుకుంటున్నారా? శాశ్వతంగా తులసిని ఈ ఇంటికి దూరం చేస్తా అని అనుకుంటుంది లాస్య.

నాతో మాట్లాడాలని లేకుంటే కనీసం ఈ ముసలిదాన్ని తిట్టడానికి అయినా రా అమ్మ అంటుంది అనసూయ. నేను రావడం కుదరదు అంటుంది తులసి. దీంతో మీరు మా ఇంటికి రావచ్చు. మీరే కాదు అందరూ మా ఇంటికి రావచ్చు.. అంటుంది. దీంతో కనీసం బయటి నుంచి అయినా నీ ముఖం చూపించు అంటుంది అనసూయ.

నువ్వు లేని ఈ ఇంట్లో మేము మాత్రం సంతోషంగా ఉండగలమా చెప్పు. మాకిది యావజ్జీవ కారాగార శిక్ష లాంటిది. నువ్వు వస్తూ పోతూ ఉంటే శిక్ష తాలుకు కష్టం కాస్తయినా రాకుండా ఉంటుంది. నువ్వు ఒప్పుకోవా అంటూ దండం పెడుతుంది. దీంతో సరే అత్తయ్య. నా ఇబ్బందిని పట్టించుకోను. మీరు అడిగినట్టే వస్తూ పోతూ ఉంటాను అంటుంది తులసి.

సరేనా.. సంతోషమేనా. మీ మాట విన్నాను కాబట్టి.. నా మాట కూడా వినాలి. ఇక నుంచి మీ కన్నీళ్లు కనబడకూడదు. కొద్దిగా కూడా కనబడకూడదు. మీ ఆరోగ్యం జాగ్రత్త అంటుంది తులసి. ఆ తర్వాత ప్రేమ్ అందరినీ నవ్విస్తాడు కాసేపు. సంతోషంగా ఉంది కదా. మీరు ఇప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోతారా అంటుంది తులసి.

దీంతో లేదమ్మా నిద్ర రావడం లేదు అంటుంది అనసూయ. మీ అత్తయ్యకు నేనంటే భయం లేదు కానీ.. బల్లి అంటే భయం. ఆ గోడ మీద బల్లి ఉంది అంటే చాలు.. దెబ్బకు ముసుగేసుకొని పడుకునేది అంటాడు పరందామయ్య. అత్తయ్య జాగ్రత్త.. నేను వెళ్లొస్తాను. ప్రశాంతంగా పడుకోండి అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 1 Dec Today Episode : కొండెక్కుతున్న దీపాన్ని వెలిగించిన తులసి

నేను వెళ్లొస్తాను అని చెప్పి వెళ్లబోతుండగా.. దేవుడి ముందు దీపం కొండెక్కడం చూసి అందులో కాస్త నూనె పోస్తుంది తులసి. వెంటనే కోపం వచ్చి లాస్య చప్పట్లు కొడుతుంది. దీంతో నీ గురించే ఆలోచిస్తున్నాను అంటుంది తులసి. చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నావు కానీ.. నువ్వే తమాషాలు ఎక్కువగా చేస్తావు కదా అంటుంది లాస్య.

నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాకే తమాషాలు, డ్రామాలు మొదలయ్యాయి అంటుంది తులసి. దీంతో బయటికి పో అన్న నేను పిచ్చిదానిలా బయటికి రావడం ఏంటి అని అంటుంది లాస్య. మా ఇంట్లో దేవుడి ముందు దీప వెలిగిస్తున్నావు అంటుంది లాస్య. దీంతో మీ దేవుడు, మా దేవుడు అంటూ సపరేట్ గా ఉండరు లాస్య.

అయినా నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి నా కాపురంలో నిప్పులు పోశావు. ఇంట్లో ఉండి కూడా దేవుడి ముందు దీపం ఉందా లేదా.. కొండెక్కిందా అని పట్టించుకోవడం లేదు. అయినా నీకు దీపాలు ఆర్పడం తప్పించి ఇంకేం చేస్తావు అంటుంది తులసి. ఎవరు అయితే బంధాలకు విలువ ఇవ్వకుండా తెంపేసుకుంటున్నారో ఆ మనిషి జీవితం అక్కడితో అయిపోయినట్టే అంటుంది తులసి.

అత్తయ్య చూడు.. ఇన్నేళ్లుగా బంధాలు ఏర్పరుచుకుంటూ వస్తున్నారు తెగిపోయాయా? తప్పు తెలుసుకొని అత్తయ్య మారుతోంది. నువ్వు కూడా మారొచ్చు కదా. నీకే మంచిది అంటుంది తులసి. నువ్వు అత్తారింట్లో కలిసిపోతే అత్తవారిల్లు కూడా నీతో పాటు కలిసిపోతుంది. ప్రతి మాటకు నువ్వు ఇలా కళ్లు తిప్పి చూడకు అంటుంది తులసి.

అందరికీ నేనే లోకువయ్యా అని అనుకుంటుంది లాస్య. ఎలాగైనా తులసిని ఏదైనా చేయాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp