Intinti Gruhalakshmi 11 Nov Today Episode : లాస్య అంటే ఇష్టం లేదని తులసితో చెప్పిన నందు.. తులసి, నందు.. ఇద్దరూ మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 11 Nov Today Episode : లాస్య అంటే ఇష్టం లేదని తులసితో చెప్పిన నందు.. తులసి, నందు.. ఇద్దరూ మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నారా?

 Authored By gatla | The Telugu News | Updated on :11 November 2021,12:55 pm

Intinti Gruhalakshmi 11 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 నవంబర్, 2021, గురువారం 474 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను బయటికి రాను. రూమ్ లోనే ఉంటాను.. అని అంటుంది తులసి. దీంతో సరే.. ఆకలేస్తుంది. రెస్టారెంట్ కు వెళ్లి తిని వద్దాం. రెడీ అయి వస్తాను అని చెబుతాడు నందు. దీంతో సరేనండి.. అంటుంది తులసి.

intinti gruhalakshmi 11 november 2021 full episode

intinti gruhalakshmi 11 november 2021 full episode

అంకిత.. పదా సినిమాకు వెళ్దాం. టికెట్లు తీసుకొచ్చాడు ప్రేమ్ అంటుంది శృతి. ఇంట్లో పని అంతా కాకముందే సినిమాకు వెళ్లడం ఏంటి.. అంటూ చిరుబురులాడుతుంది అంకిత. ఇవి అందరికీ.. నలుగురికి టికెట్లు తీసుకొచ్చాడు ప్రేమ్ అంటుంది శృతి. నేను రానుపో అంటుంది అంకిత. తర్వాత ఆలోచించి.. ఏ సినిమా అంటుంది. నీ ఫేవరేట్ కింగ్ నాగార్జున సినిమా అంటుంది శృతి. దీంతో సరే వెళ్దాం పదా అంటుంది అంకిత.

ఇంతలోనే అభి, ప్రేమ్ వస్తారు. అభి.. శభాష్ అంకిత అంటాడు. దీంతో శృతికి ఏం అర్థం కాదు. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అంటుంది శృతి. అభి ఏదో చెప్పబోయేసరికి వద్దు అని కాలు తొక్కుతుంది అంకిత. ఇంతలో దివ్య వచ్చి.. నన్ను తీసుకెళ్లకుండా మీరు నలుగురే సినిమాకు వెళ్తున్నారా? అని అడుగుతుంది. కాసేపు తనను ఆటపట్టిస్తారు. తర్వాత తనను కూడా సినిమాకు తీసుకెళ్తాం అంటారు.

నేను ఈరోజు ఆఫీసుకు రాను అని చెబుతుంది లాస్య. ఈరోజు నాకు కుదరదు అని ఆఫీసుకు ఫోన్ చేసి చెబుతుంది. మరోవైపు బెంగళూరులో వీళ్లు ఏం చేస్తున్నారో అని టెన్షన్ పడుతుంది లాస్య. వెంటనే నందుకు పోన్ చేస్తుంది. నందు ఫోన్ లిఫ్ట్ చేయడు. చూసి కట్ చేస్తాడు. దీంతో లాస్యకు ఇంకా కోపం వస్తుంది. మరోసారి ఫోన్ చేస్తుంది.

కాల్ లిఫ్ట్ చేయడు. నందుకు కూడా చిరాకు ఎక్కువవుతుంది. మళ్లీ చేస్తుంది ఫోన్. ఎవరు లాస్యనా అని అడుగుతుంది తులసి. అవును.. అంటాడు. మీరు మాట్లాడుకోండి. నేను ఫ్రెష్ అయి వస్తాను అంటుంది. ఇంతలో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి.. అంటాడు. కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అంటుంది లాస్య. క్లయింట్ తాలుకు మనిషి వస్తే మాట్లాడుతున్నాను.. అంటాడు నందు.

సరే.. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటుంది లాస్య. బయటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నా అంటాడు నందు. అవునా.. ఎక్కడికి అంటుంది. నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా? అని అడుగుతుంది. అవును.. నేను ఒక్కడినే వెళ్తున్నాను అంటాడు. నువ్వు ఆఫీసుకు వెళ్లావా? అని అడుగుతాడు నందు. లేదు వెళ్లలేదు అంటుంది. ముందు నువ్వు ఆఫీసుకు వెళ్లు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు నందు.

Intinti Gruhalakshmi 11 Nov Today Episode : లాస్య అసలు గుట్టు తెలుసుకున్న అనసూయ

ఓవైపు లాస్య చిరాకు పడుతుంటే.. నందు వాళ్ల అమ్మ పిలిచి.. నాకు, మీ అంకుల్ కు రెండు కప్పుల టీ తీసుకురా అమ్మ అంటుంది. దీంతో లాస్యకు చిరాకు వస్తుంది. ఏంటి ఆంటి మీరు.. అవతల ఆఫీసు వర్క్ లో బిజీగా ఉన్నాను. ఈ సమయంలో టీ పెట్టమంటారా? అంటుంది. ఇంట్లో ఎవరూ లేరు అంటే.. మీరు పెట్టుకోవచ్చు కదా.. మీతో పాటు నాకు కూడా టీ పెట్టి ఇవ్వండి అంటుంది లాస్య. దీంతో పరందామయ్య షాక్ అవుతాడు.

దీంతో చేసేదిలేక.. తప్పని పరిస్థితుల్లో నందు తల్లి వెళ్లి టీ పెడుతుంది. టీ పౌడర్, చాయ్ దొరక్కపోయే సరికి.. చిరాకు పడుతుంది. బాబోయ్.. నాకు ఎందుకు ఈ బాధ అని అనుకుంటుంది. ఏమే టీ అయిందా.. అని అడుగుతాడు పరందామయ్య.. హా.. టీ ఏం కర్మ.. అన్నీ తెచ్చిస్తాను అంటూ టీ గిన్నెను చేయితో కింద పడేస్తుంది. దీంతో తన కాలు మీద వేడి వేడి చాయ్ పడి కాళ్లు బొబ్బలెక్కుతాయి. తను కింద పడిపోతుంది.

మరోవైపు నందు, తులసి.. ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కు వెళ్తారు. తులసి మాత్రం ఏదో టెన్షన్ లో ఉంటుంది. ఏంటి తులసి ప్రాజెక్టు గురించేనా నీ ఆలోచన అంటాడు నందు. అవును అంటుంది. నన్ను ఎందుకు మీటింగ్ కు పిలిచారు అని ఆలోచిస్తున్నా అంటుంది తులసి. ఇప్పటికే మూడు నెలల గడువు అడిగాం కదా. మళ్లీ ఎందుకు పిలిచారు అని అంటుంది.

ఏది ఏమైనా.. నువ్వు మాత్రం క్లయింట్ ముందు ఏం మాట్లాడకు. అన్నీ నేను మాట్లాడుతా. నువ్వు సైలెంట్ గా ఉండు అంటాడు నందు. కానీ.. తులసి మాత్రం ఎందుకండి. వాళ్లు నన్ను నమ్మే కదా ప్రాజెక్టు అప్పగించింది అంటుంది తులసి. ఎందుకు.. మళ్లీ వాళ్లముందు నన్ను దద్దమ్మను చేద్దామనా అంటూ సీరియస్ అవుతాడు నందు.

కట్ చేస్తే.. రూమ్ కు వచ్చాక.. నందు తన తప్పు తెలుసుకొని.. తనను క్షమించాలంటూ తులసిని వేడుకుంటాడు. మన మధ్య దూరం పెరిగే సమయానికి లాస్య వచ్చిందని.. లాస్య అంటే నాకు అస్సలు ఇష్టం లేదని అసలు నిజం తులసికి చెబుతాడు నందు. దీంతో తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది