Intinti Gruhalakshmi 12 April Today Episode : అద్దె ఇంట్లోకి మారిన తులసి.. తులసిని అవమానించిన నందు.. తనను కలవడానికి వచ్చిన ప్రేమ్ కు భారీ షాకిచ్చిన తులసి
Intinti Gruhalakshmi 12 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 604 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన ఫ్యామిలీ ఫోటోను చూసి బాధపడుతుంది దివ్య. ఇంతలో తులసి వస్తుంది. ఈ ఫోటోలో ఉన్నవాళ్లలో సగం మంది మనతో లేరు కదమ్మా అంటుంది దివ్య. డాడ్ లేరు. ప్రేమ్ అన్నయ్య లేరు… అంటుంది దివ్య. రేపటి నుంచి మన జీవితాలు నిప్పుల మీద నడకలా ఉంటాయి. కష్టాలు మనస్పర్థలను పెంచొచ్చు. ఈ గ్రూప్ ఫోటోలో మరిన్ని తీసివేతలు లేకుండా చూసుకుంటానని మాటివ్వు మామ్ అంటుంది దివ్య.
కానీ.. తులసి మాత్రం మాటివ్వదు. నేను దేవుడిని కాదు.. కానీ ప్రయత్నిస్తా అని మాత్రం మాటివ్వగలను అంటుంది తులసి. వానరాకుండా ఆపలేను కానీ.. గొడుగు మాత్రం పట్టుకోగలను. పదమ్మా భోజనం చేద్దువు కానీ అంటుంది తులసి. అందరూ చివరి సారి ఆ ఇంట్లో భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. కానీ.. ఒక్కరిలో సంతోషం ఉండదు. అందరూ దీనంగా కూర్చొని ఉంటారు. ఏదో పోగొట్టుకున్నవాళ్లలా ఉంటారు. అదేంటి అందరూ అలా కూర్చున్నారు మొదలుపెట్టండి అంటుంది తులసి. కానీ.. ఒక్కరూ స్పందించరు. మామయ్య.. అంటుంది తులసి. అత్తయ్య.. అంటుంది.
అమ్మ దివ్య అంటే.. నాకసలు భోజనం చేయాలనేలేదు. నేను తినలేను అంటుంది దివ్య. అమ్మ అంకిత అంటే నాకు తినాలని లేదు ఆంటి అంటుంది అంకిత. ఎందుకు అందరూ బాధపడుతున్నారు. ఎందుకు అందరి కళ్లలో కన్నీళ్లు అంటుంది. మీ కళ్లలో కనిపించే ప్రతి కన్నీటి బొట్టు నా చేతగానితనాన్ని గుర్తు చేస్తుంది అత్తయ్య అంటుంది తులసి.
చేతగానితనం నీది కాదు మామ్.. నాది.. కొడుకును అయి ఉండి నిన్ను ఆదుకోలేకపోయాను అంటాడు అభి. కొన్ని విషయాలను ఎదిరించి నిలబడలేకపోయాను అంటుంది తులసి. అందరూ ఒకటి గుర్తుపెట్టుకొండి. ఇది మనందరం ఈ ఇంట్లో కలిసి చేసే ఆఖరి భోజనం అంటుంది తులసి.
కన్నీళ్లు తుడుచుకొని అందరం సంతోషంగా భోజనం చేద్దాం. ఈ మెమోరీని పదిలంగా మనసులో దాచుకుందాం. దయచేసి నాకోసం తినండి అని వెక్కి వెక్కి ఏడుస్తుంది తులసి. దీంతో అమ్మ తులసి నువ్వు ఈ ఇంటి గృహలక్ష్మివి అమ్మ. ఎట్టిపరిస్థితుల్లోనూ నీ కన్నీరు ఎవరికీ మంచిది కాదు. నువ్వు అన్నట్టుగానే అందరం ఆనందంగా భోజనం చేస్తాం అమ్మ అంటాడు పరందామయ్య.
Intinti Gruhalakshmi 12 April Today Episode : చివరి రోజున ఇంట్లో అందరికీ ముద్దలు కలిపి తినిపించిన తులసి
ఇంతకాలం మమ్మల్ని అందరినీ బిడ్డల్లా చూసుకున్నావు. ఈ ఇంట్లో ఆఖరి భోజనం గుర్తుండిపోవాలంటే నీ చేత్తో ముద్దలు కలిపి పెట్టు అమ్మ అంటుంది అనసూయ. దీంతో అన్నం తీసుకొని అందరికీ తన చేతులతో తినిపిస్తుంది తులసి.
కట్ చేస్తే రాములమ్మ.. ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. ఇలాంటి వార్త నా నోటితో చెప్పాల్సి వస్తుందని నేను ఏనాడూ అనుకోలేదు అంటుంది రాములమ్మ. అప్పు కింద మీ ఇంటిని ఆ శశికళ కొనేసింది అని అంటుంది రాములమ్మ. రేపే ఇల్లు ఖాళీ చేస్తున్నారు అని చెబుతుంది రాములమ్మ.
నాకైతే చాలా బాధగా అనిపిస్తోంది అంటుంది. దీంతో నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అంటాడు ప్రేమ్. దీంతో ఇప్పుడు నువ్వు వెళ్లి ఏం చేస్తావు అంటుంది శృతి. నువ్వు కష్టపడడి ఒక స్థాయికి చేరుకున్నాక ఆంటి వాళ్లను మన దగ్గరికి తెచ్చుకుందాం అంటుంది శృతి.
మామయ్య.. మీకు ఒక మాట ఇస్తున్నాను. మీ పెద్ద కొడుకును తిరిగి మీ దగ్గరికి చేర్చలేను కానీ.. మీ బిడ్డలా భావిస్తున్న ఈ ఇంటిని తిరిగి మీకు బహుమతిగా అందిస్తాను అంటుంది తులసి. ఈ ఇల్లు మనదై ఉండాలంటే.. ముందు దీన్ని పోగొట్టుకునేవాళ్లం కాదు తులసి అంటాడు పరందామయ్య.
కట్ చేస్తే ఉదయం అవుతుంది. ఇదే నా ఆఖరి పూజ అమ్మ అని గుడిలో దండం పెట్టుకొని బయటికి వస్తుంది తులసి. అందరూ బ్యాగులు సర్దుకొని హాల్ లోకి వస్తారు. అందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లపోబోతుంటారు. సామాన్లను అన్నింటినీ అద్దె ఇంటికి పంపించేస్తారు.
నిన్ను గుడ్డిగా నమ్మినందుకు మా అమ్మానాన్నలను తీసుకొచ్చి ఈ పిచ్చుక గూడులో పడేశావు అని తులసి దగ్గరికి వెళ్లి నందు తనను నిలదీస్తాడు. ఆ తర్వాత ప్రేమ్, శృతి కూడా తులసి కొత్త ఇంటికి వెళ్తారు. నువ్వు ఎందుకు వచ్చావు. అసలు నువ్వు నన్ను అమ్మ అని పిలవొద్దు అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.