Intinti Gruhalakshmi 13 April Today Episode : అద్దె ఇంటికి మారిన తులసి ఫ్యామిలీ.. తులసి మీదికి నందును ఉసిగొల్పిన లాస్య…. ఇంతలో తులసికి పెద్ద షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 13 April Today Episode : అద్దె ఇంటికి మారిన తులసి ఫ్యామిలీ.. తులసి మీదికి నందును ఉసిగొల్పిన లాస్య…. ఇంతలో తులసికి పెద్ద షాక్

 Authored By gatla | The Telugu News | Updated on :13 April 2022,9:30 am

Intinti Gruhalakshmi 13 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 ఏప్రిల్ 2022, బుధవారం ఎపిసోడ్ 605 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం తలుచుకుంటే ఇలాంటి మంచిరోజులు మన జీవితంలో ఎన్నో వస్తాయి అని కుటుంబ సభ్యులతో తులసి అంటుంది. ఇప్పుడు మనం దిగులు పడకూడదు. మన మీద మనం నమ్మకం పెంచుకోవాలి…   పోయిన దాన్ని పోయిన చోటే వెతుక్కోవాలి అంటుంది తులసి. జీవితంలో ముందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు కొన్న బంధాలు పెంచుకోవడం ఎంత అవసరమో.. కొన్ని బంధాలు తెంచుకోవడం కూడా అంతే అవసరం అంటుంది తులసి. మొత్తానికి అందరూ బ్యాగులు పట్టుకొని ఇంటి నుంచి బయటికి అడుగు పెడతారు.

intinti gruhalakshmi 13 april 2022 full episode

intinti gruhalakshmi 13 april 2022 full episode

మీకు రుణం తీరిపోయింది ఈ ఇంటితోనే కానీ.. మాతో కాదు కదమ్మా అంటుంది రాములమ్మ. ప్రస్తుతానికి మేము ఉన్న పరిస్థితిలో జీతం ఇవ్వలేము అంటుంది తులసి. దీంతో ఇన్నేళ్లు పని చేసినా కూడా నేను మీకు డబ్బు కోసమే పనిచేసే దానిలా కనిపిస్తున్నానా? నన్ను మీరు ఈ ఇంటి మనిషిగా.. తోబుట్టువుగా చూసుకున్నారు. మీరు కష్టాల్లో ఉంటే నేను ఎలా వదిలేసి వెళ్లిపోతానని అనుకున్నారు. మీరు నాకు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. .. ఎప్పటిలాగే నాకు ఇంత అభిమానం పంచండి చాలు. నన్ను దూరం చేయొద్దు అంటుంది రాములమ్మ. దీంతో తులసికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అందరూ బయట అడుగు పెట్టాక.. రాములమ్మ ఇంటికి డోర్ వేసేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు ప్రేమ్.. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో శృతి వస్తుంది. నాకు అమ్మ దగ్గరికి వెళ్లాలని ఉంది అంటాడు ప్రేమ్. నువ్వు వద్దంటావని నాకు తెలుసు అని అంటాడు.   నేను ఎందుకు చెబుతున్నానో నీకు అర్థం అయింది అనుకుంటాను. నీ ఆలోచన మార్చుకో అంటుంది శృతి.  ..

మనసుకు నచ్చజెప్పడానికి ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను. అస్సలు మాట వినడం లేదు.. అంటాడు ప్రేమ్. మీకోపం ప్రేమ్ మీద కదా.. నాతో మాట్లాడొచ్చు కదా అని ఆరోజు ఫంక్షన్ లో చెప్పినా కూడా ఆంటి మాట్లాడలేదు అని ఆరోజు జరిగిన విషయం చెబుతుంది శృతి…

ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్తా అంటున్నావు కాబట్టి చెప్పాల్సి వచ్చింది అని అంటుంది శృతి. ప్రేమ్.. ఆంటిలో ఉంది కోపం కాదేమో.. ద్వేషం కావచ్చు అంటుంది. దీంతో పట్టించుకోకుండా వదిలేద్దామా అంటాడు ప్రేమ్. తల్లి సముద్రం లాంటిది.. పిల్లలు అలలు లాంటివి అంటాడు ప్రేమ్.

Intinti Gruhalakshmi 13 April Today Episode : తులసి దగ్గరికి బయలుదేరిన ప్రేమ్, శృతి

నేను కోరుకునేది కూడా అదే ప్రేమ్. అందరూ కలవాలనే. కానీ సమయం రావాలి కదా అంటుంది శృతి. అసలు నీ గురించి ప్రస్తావన వస్తేనే చాలా హార్ష్ గా మాట్లాడుతోంది ఆంటి అని చెబుతుంది.   దీంతో అమ్మకు అనే హక్కు ఉంది. దూరంగా ఉంటూనే అమ్మకు దగ్గర అవుదాం అంటాడు ప్రేమ్.

ఆంటి దగ్గరికి వెళ్లడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. ఎక్కువ ఊహించుకొని అక్కడికి వెళ్లడం మాత్రం వద్దు.. అంటుంది శృతి. బయలుదేరుదాం.. ఇంకో ఆలోచనే లేదు. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్లాల్సిందే. ప్లీజ్ శృతి అంటాడు ప్రేమ్. దీంతో సరే అంటుంది శృతి.

మరోవైపు తులసి వాళ్లు రెంట్ కు కొత్త ఇంటికి చేరుతారు.   ఇల్లు చూస్తే చాలా బాగుంటుంది. ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది తులసి. ఒరేయ్ అభి.. ఇదేనా ఇల్లు అని అడుగుతుంది తులసి. అవును అంటాడు. మన తాహతుకు మించిన ఇల్లులా అనిపిస్తోంది అంటుంది తులసి.

ఇంతకీ అద్దె ఎంత అని అడుగుతుంది తులసి. మనం పెట్టుకున్న లిమిట్ లోనే ఉంది. మా ఫ్రెండ్ యూఎస్ వెళ్లాడు. వెళ్తూ ఇంటిని మంచిగా చూసుకునే వాళ్లు కావాలని అద్దె తక్కువ అయినా మనకు ఇచ్చాడు అంటాడు అభి. ప్రామిస్ మామ్ అంటాడు అభి.

మరోవైపు ఫంక్షన్ లో నాకు జరిగిన అవమానంపై నువ్వు మాత్రం ఏం మాట్లాడవా అని నందును అడుగుతుంది లాస్య. ఆ తులసి ఆ ఫంక్షన్ లో ఏమన్నదో తెలుసా? నేను నీతో ఎక్కువ రోజులు కాపురం చేయనట అంటుంది. తొందరలోనే నందు నిన్ను వదిలేస్తాడు అని చెప్పింది.. అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది