Intinti Gruhalakshmi 14 April Today Episode : తులసికి షాకిచ్చిన గాయత్రి.. అభి, అంకిత తనతో వెళ్లిపోతారా? ఇంతలో ప్రేమ్, శృతి షాకింగ్ నిర్ణయం

Authored By Varun G | The Telugu News | Published on: April 14, 2022, 9:30 am

Intinti Gruhalakshmi 14 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 606 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్త ఇంటిని చూసి మురిసిపోతుంది తులసి. మొదటి అడుగు నువ్వే పెట్టు తులసి అని అనసూయ అంటే.. లేదు అత్తయ్య మీరు, మామయ్య.. ఇద్దరూ మొదటి అడుగు పెట్టండి అంటుంది తులసి. లేదు.. నువ్వే పెట్టాలమ్మా అంటుంది అనసూయ. ఇల్లు మొత్తం అందరూ ఒకసారి తిరిగి చూస్తారు. ఈ ఇంట్లో రెండు బెడ్ రూమ్సే ఉండటంతో దివ్యకు కోపం వస్తుంది. నాకు సపరేట్ రూమ్ కావాలి అంటుంది దివ్య.

intinti gruhalakshmi 14 april 2022 full episode

intinti gruhalakshmi 14 april 2022 full episode

నువ్వు.. తాతయ్య, నానమ్మతో కలిసి రూమ్ లో ఉండు అంటుంది తులసి. వామ్మో నేను తాతయ్య రూమ్ లో ఉండను. నేను కూడా నీతో పాటే హాల్ లో ఉంటానులే అంటుంది దివ్య. సామాను ఇంకా రాలేదు.. కాస్త ఫోన్ చేసి అడుగు అని అభితో చెబుతుంది తులసి. ఇంతలో నందు, లాస్య.. ఆ ఇంటికి వస్తారు. వాళ్లను చూసి తులసి షాక్ అవుతుంది. అమ్మ తులసి ఇంటికి అతిథులు వచ్చారు.. మంచినీళ్లు కావాలేమో కనుక్కో అమ్మ అంటాడు పరందామయ్య. మీ మాజీ కోడలు గొప్పదనం గురించి కాసేపు మాట్లాడుకుందాం అంటాడు నందు.

ప్రాణం పోయినా ఇల్లు కాపాడుతాను.. మామయ్య గారి ఇల్లు కాపాడుకుంటాను అని వీర లేవల్లో రెచ్చిపోయింది కదా. మరి ఇప్పుడెందుకు వీరభవనం నుంచి పెంకుటిళ్లుకు తీసుకొచ్చింది. నిన్ను గుడ్డిగా నమ్మినందుకు మా అమ్మానాన్నను తీసుకొచ్చి ఇక్కడ పడేశావు.. అంతే కదా నువ్వు చేసింది అంటాడు నందు.

తులసి చాలా చేసింది. ఇప్పటికే నిన్ను.. మీ అమ్మానాన్నలతో విడదీసింది. ఇప్పుడు నన్ను.. నీతో విడదీసేందుకు ప్లాన్ చేసింది. ఆ విషయమే నాకు చెప్పింది కూడా. నీ చుట్టూ నీ సైనికులు  చాలా మంది ఉన్నారు. నాకు ఉన్నది నా నందు ఒక్కడే.

కలలో కూడా నా నందు నన్ను వదిలిపెట్టనని మాటిచ్చాడు అంటుంది లాస్య. మరి నాకు వేదమంత్రాల సాక్షిగా మాటిచ్చి వదిలేశాడు కదా అంటుంది తులసి. యుద్ధభూమి నుంచి పారిపోయిన పిరికివాడికి.. చివరి వరకు పోరాడిన సైనికుడిని ప్రశ్నించే అధికారం ఉండదు అంటుంది తులసి.

మేము ఇక్కడ ప్రశాంతంగానే ఉన్నాం. మీరు ఇక్కడికి వచ్చి గొడవ చేయకండి అని అనసూయ.. నందుపై సీరియస్ అవుతుంది. ఇలా ఫోర్స్ చేస్తేనే వృద్ధాశ్రమంలో చేరాం. ఇంకా ఫోర్స్ చేస్తే అంతకంటే కఠినమైన నిర్ణయం తీసుకుంటాను నేను అంటాడు పరందామయ్య.

Intinti Gruhalakshmi 14 April Today Episode : ప్రేమ్ ను చూసి కోపం కట్టలు తెంచుకున్న నందు

ఇంతలో ప్రేమ్, శృతి ఇద్దరూ అక్కడికి వస్తారు. నందు, లాస్యకు తారసపడతారు. ప్రేమ్ ను చూసి నందుకు కోపం వస్తుంది. మనం కలిసి ఉన్నప్పుడు ప్రేమ్ ను పిలిపిద్దామంటే వద్దన్నావు. ఇప్పుడు మాత్రం నీ చిన్నకొడుకును పిలిపించుకున్నావా అంటాడు నందు.

ఎప్పటికైనా వాళ్లు వాళ్లు ఒక్కటి.. మనమే పరాయి వాళ్లం.. అంటుంది లాస్య. దీంతో కట్టకట్టుకొని ఊరేగండి అంటాడు నందు. అక్కడి నుంచి కోపంతో నందు, లాస్య వెళ్లిపోతారు. ప్రేమ్, శృతిని చూసి తులసికి కోపం వస్తుంది. అభి.. వాళ్లను నా కళ్ల ముందు నుంచి వెళ్లిపోవాలని చెప్పు. లేకపోతే నేనే గెంటేస్తాను అని చెప్పు అంటుంది.

ఆంటి మేము ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. ప్రేమ్ మీ మీద దిగులు పెట్టుకున్నాడు. మీరు ఇల్లు పోగొట్టుకున్నందుకు బాధపడ్డాడు. మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాడు అంటుంది తులసి. వాడి బతుకు వాడిని బతకమను అంటుంది తులసి.

దీంతో నేను చేతగానివాడిని ఒప్పుకుంటాను కానీ.. నేను నీ కొడుకును అంటాడు ప్రేమ్. అమ్మ బాధలో ఉన్నప్పుడు పక్కనే ఉండాలనుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని అంటాడు ప్రేమ్. శృతి నిన్ను కలిసినప్పుడే స్పష్టంగా చెప్పాను.. మళ్లీ బంధాలు కలుపుకోకండి అని.. మళ్లీ వాడిని ఎందుకు తీసుకొచ్చావు అంటుంది తులసి.

శృతి నన్ను తీసుకురాలేదు.. నేనే శృతిని తీసుకొచ్చాను అమ్మ అంటాడు ప్రేమ్. దీంతో వద్దు నన్ను అమ్మ అని పిలవొద్దు అంటుంది తులసి. వీడు ఎదగకపోవడానికి కారణం నా పెంపకం అని నా మీద చెడు ముద్ర పడింది. వీడు ఎదగాలి.. అప్పుడే నా మీద ఉన్న ముద్ర చెరిగిపోవాలి. అప్పటి వరకు నేను వాడిని క్షమించను అంటుంది తులసి.

దీంతో ఎదిగాకే నేను మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెడతాను. నీమీద నా కారణంగా పడిన ముద్రను చెడిపేశాకే నేను నీ బిడ్డను అని చెప్పుకుంటాను. అప్పటికైనా క్షమిస్తావు కదా.. దగ్గరికి తీసుకుంటావు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్.

మరోవైపు లాస్య నూడుల్స్ వండి నందుకు పెడుతుంది. దీంతో ఎప్పుడూ నూడుల్సేనా అంటాడు. నందుకు కోపం వస్తుంది. మరోవైపు అంకిత ఇంట్లో పని చేస్తుండగా.. గాయత్రి వచ్చి తనను చూసి షాక్ అవుతుంది. మీ ఈ కర్మ ఏంటి.. నా ఇంట్లో ఉండండి. లేదంటే మీకోసం కొన్న కొత్త ఇంట్లో ఉండండి. ఆ ఇంటి కీస్ కూడా తీసుకొచ్చాను. తీసుకో అని తులసికి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp