Intinti Gruhalakshmi 14 Feb Today Episode : అభిని అడ్డంగా మోసం చేసిన మనోజ్.. 10 లక్షలు తీసుకొని జంప్.. దీంతో అభికి డైవర్స్ ఇచ్చిన అంకిత.. తులసి షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 14 Feb Today Episode : అభిని అడ్డంగా మోసం చేసిన మనోజ్.. 10 లక్షలు తీసుకొని జంప్.. దీంతో అభికి డైవర్స్ ఇచ్చిన అంకిత.. తులసి షాకింగ్ నిర్ణయం

 Authored By gatla | The Telugu News | Updated on :14 February 2022,9:30 am

Intinti Gruhalakshmi 14 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు సోమవారం 14 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్, 555 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కారులో నందు, లాస్య వెళ్తుంటారు. డబ్బులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు అని లాస్యతో అంటాడు నందు. డబ్బులు ఎలా కట్టాలి అంటే.. తులసియే దర్జాగా ఉంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని చెబుతుంది లాస్య. ఒకవేళ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే ఎలా.. అంటాడు నందు. ఖాళీ చేద్దాం.. అంటుంది లాస్య. మరి అమ్మానాన్నల సంగతి ఏంటి. వాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అంటాడు నందు. వాళ్లు తులసిని వదిలేసి ఎక్కడికీ రారు అంటుంది లాస్య. మరోవైపు తులసి బాధ గురించి పరందామయ్య, అనసూయ.. ఇద్దరూ టెన్షన్ పడుతుంటారు. తులసి ఒంటరిగా అప్పు తీర్చడం కోసం టెన్షన్ పడుతోంది అని అనుకుంటారు.

intinti gruhalakshmi 14 february 2022 full episode

intinti gruhalakshmi 14 february 2022 full episode

ఇంతలో తులసి వచ్చి భోజనానికి రాలేదేంటి అని అడుగుతుంది. ఆకలిగా లేదు అని అంటారు ఇద్దరూ. మీరు తినకపోతే నేను కూడా తినను అని అంటుంది తులసి. దీంతో అందరూ కలిసి తినేందుకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. శృతి, అంకిత కూడా వస్తారు. అందరూ సరదాగా ఫుడ్ తింటుంటే.. అప్పుడే నందు, లాస్య వస్తారు. వాళ్లు సంతోషంగా ఉండటం చూసి లాస్యకు కోపం వస్తుంది. నీకు ముద్ద ఎలా దిగుతోంది తులసి అని అడుగుతుంది లాస్య. అవునులే. నీ కష్టాన్ని అందరికీ పంచావు కదా. ఇప్పుడు సంతోషంగా ఉంటావులే.. అంటుంది లాస్య. అప్పు తీర్చడం కోసం మేము పిచ్చోళ్లలా రోడ్ల మీద తిరుగుతున్నాం అని అంటుంది లాస్య.

ఇంతలో అభి వస్తాడు. ఏరా అభి.. నీ సంగతి ఏంటి.. డబ్బులు రెడీ చేస్తున్నావా అని అడుగుతుంది తులసి. మామ్.. నాకు తెలుసు. నేను ఎలాగోలా డబ్బు రెడీ చేస్తాను అంటుంది. నందు కూడా లాస్య చెప్పే మాటలను ఇన్ని రోజులు నమ్మలేదు కానీ.. ఇప్పుడు లాస్య చెప్పేదే నిజం అనిపిస్తోంది అంటాడు.

మరోవైపు అభి.. చాలా సంతోషంగా అటూ ఇటూ తిరగడం గమనిస్తుంది తులసి. అతడి దగ్గరికి వెళ్తుంది. మామ్.. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నా సమాధానం కూడా నీకు తెలుసు. దయచేసి నన్ను ఓ నాలుగు ఐదు రోజులు వదిలేయ్ అంటాడు అభి.

ఒరేయ్ అభి.. నువ్వు ఉన్న వయసు చాలా ప్రమాదకరమైన వయసు. ఈ వయసులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి అడుగు వేస్తే తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది అంటుంది. దీంతో ఒక్క నాలుగు రోజుల తర్వాత ఈ ఇంట్లో నేనే వీఐపీని. నా సలహాల కోసం అందరూ ముందుకు రావాల్సి వస్తుంది. నువ్వు కూడా అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 14 Feb Today Episode : ప్రేమ్ కు అప్పు విషయం ఎందుకు చెప్పలేదు అంటూ తులసిని అడిగిన శృతి

నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే ఎవ్వరూ దగ్గరికీ రాకున్నా.. నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా నీకు ఈ తల్లి ఉంది అని మరిచిపోకు అంటుంది తులసి. ఆ తర్వాత అభి.. మనోజ్ కు ఫోన్ చేస్తాడు. కానీ.. మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. మరోవైపు తులసిని శృతి కలుస్తుంది.

ఆంటి.. మీరు ప్రేమ్ కు వాటాల విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది శృతి. నువ్వు చెప్పావా అని అడుగుతుంది తులసి. లేదు అంటుంది. వద్దు ఇప్పుడే చెప్పకు వాడు ఈవెంట్ లో ఉన్నాడు కదా. వచ్చాక నేనే చెబుతా అని అంటుంది తులసి.

మరోవైపు ఉదయమే మనోజ్ ను కలవడం కోసం వెళ్తాడు అభి. కానీ.. ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఎటైనా బయటికి వెళ్లాడేమో అని అనుకుంటాడు అభి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఇంతలో ఒకావిడ వస్తుంది. ఎవరు కావాలి అంటుంది. మా ఫ్రెండ్ మనోజ్ కోసం వచ్చా అంటాడు అభి.

రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు అని అంటుంది. దీంతో అభికి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే మళ్లీ ఫోన్ చేస్తాడు. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మనోజ్. చెప్పురా అంటాడు. ఏమైంది అంటే.. నువ్వు ఇంత అమాయకుడివిలా ఉన్నావేంట్రా.. అని అంటాడు మనోజ్.

నీలాంటి అమాయకులను మోసం చేయడమే నా పనిరా. 10 లక్షలు చేతుత్లో పెట్టి నాలుగు రోజుల్లో 30 లక్షలు చేయమన్నావు. నీది మోసం కాదా. నా పనే ఇదిరా. నీలాంటి వాళ్లను మోసం చేసి కోట్లు సంపాదించడం చాలా తేలిక అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మనోజ్.

దీంతో అభికి ఏం చేయాలో అర్థం కాదు. పిచ్చెక్కుతుంది. అప్పుగా తీసుకున్న 10 లక్షలు కూడా మనోజ్ ఎత్తుకెళ్లడంతో ఏం చేయాలో అభికి అర్థం కాదు. మరోవైపు సేటు.. తులసి ఇంటికి వచ్చి డబ్బు ఇవ్వు అంటూ అభిని నిలదీస్తాడు. అప్పుడే తులసి, అంకిత, నందు.. అందరూ వస్తారు.

అప్పు ఏంటి అని అందరూ అడుగుతారు. అవసరం కోసం సేట్ దగ్గర చిన్న అమౌంట్ తీసుకున్నాను అంటాడు అభి. చిన్న అమౌంటా 10 లక్షలు అంటాడు సేట్. దీంతో తులసి అభి చెంప చెళ్లుమనిపిస్తుంది. తర్వాత అంకిత.. అభిని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

 

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది