Intinti Gruhalakshmi 14 Oct Today Episode : తులసి ముందే నందును అవమానించిన సామ్రాట్.. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన నందు.. ఇంతలో మరో ట్విస్ట్

Authored By Varun G | The Telugu News | Published on: October 14, 2022, 9:00 am

Intinti Gruhalakshmi 14 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 14 అక్టోబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 763 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యూజిక్ స్కూల్ ఫైల్ మీరెందుకు తీసుకున్నారు అని వెళ్లి నందును అడుగుతుంది తులసి. దీంతో మ్యూజిక్ స్కూల్ ఫైల్ ను మేమే తీసుకున్నాం. మేమే దాని మీద అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రాజెక్ట్ పూర్తి అవడానికి లేట్ అవుతుంది అని అంటాడు నందు. దీంతో మ్యూజిక్ స్కూల్ అనేది నా కల.. అంటుంది తులసి. ఇంతలో అక్కడికి వస్తాడు సామ్రాట్. ప్రాజెక్ట్ లో నేను ఇన్వాల్వ్ కానని అన్నాను కానీ.. తులసిని ఇన్వాల్వ్ చేయొద్దని అనలేదు అంటాడు సామ్రాట్. ఈ ప్రాజెక్ట్ అనేది తులసి గారి కల. ఈ ప్రాజెక్ట్ విషయంలో తను నా బిజినెస్ పార్టనర్. అంటే నీకు బాస్. నువ్వు నీ బాస్ కు గౌరవం ఇవ్వాలి అంటాడు సామ్రాట్.

intinti gruhalakshmi 14 october 2022 full episode

intinti gruhalakshmi 14 october 2022 full episode

మనం గౌరవించినప్పుడే మనకు ఆ గౌరవం తిరిగి వస్తుంది అంటాడు సామ్రాట్. తులసికి సపోర్ట్ గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో నందు, లాస్యకు కోపం వస్తుంది. మ్యూజిక్ స్కూల్ ఫైల్స్ తిరిగి ఇవ్వమని లాస్యకు చెప్పండి జనరల్ మేనేజర్ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. దీంతో నందుకు కోపం వస్తుంది. కట్ చేస్తే ప్రేమ్ గిటార్ వాయిస్తూ ఉండగా ఇంతలో శృతి వస్తుంది. ప్రేమ్ ఎంత చెప్పినా వినదు. నాకు అవసరం లేని విషయాలను నేను మాట్లాడను అంటుంది. శృతి అని మాట్లాడబోయినా పట్టించుకోదు. తన చేయిని కూడా లాక్కుంటుంది. నా మీద అంత అసహ్యం పెంచుకున్నావా అంటాడు. నేను పెంచుకోలేదు. నువ్వే పెంచుకునేలా చేశావు అంటుంది శృతి.

ఇంకా ఎన్నాళ్లు ఇలా అమ్మ ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తాం అంటాడు. జరిగిన దాని గురించి మరిచిపోదాం. నేను చేసిన తప్పును నువ్వు క్షమించు.. నువ్వు చేసిన తప్పులను నేను క్షమిస్తా అంటాడు ప్రేమ్.

తప్పు చేసింది నువ్వు.. నేను కాదు అంటుంది శృతి. మనిషి అన్నాక పొరపాట్లు జరుగుతాయి అంటాడు ప్రేమ్. నాకర్మకు నన్ను వదిలేసి నా చావు నన్ను చావమని హాయిగా మీ అమ్మ దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యావు అంటుంది శృతి.

Intinti Gruhalakshmi 14 Oct Today Episode : నీకు భార్యగా ఉండే అర్హత లేదు అని శృతితో అన్న ప్రేమ్

కోపంతో నువ్వు కూడా ఒక డిజాస్టర్. భార్యగా ఉండే అర్హత లేదు. నీ మొహం కనిపించకపోతే ప్రశాంతంగా బతుకుతాను. మళ్లీ చెబుతున్నాను… మళ్లీ మళ్లీ చెబుతున్నాను అని చెప్పి కిందికి వెళ్లిపోతాడు ప్రేమ్. దీంతో శృతి వెక్కి వెక్కి ఏడుస్తుంది.

మరోవైపు రాత్రి పూట ఫుల్లుగా మద్యం తాగి సామ్రాట్ మీద కోపంగా ఉంటాడు నందు. నేను ఆత్మాభిమానం ఉన్న మనిషిని అని లాస్యతో అంటాడు నందు. నన్ను ఒంటరిగా వదిలేయ్ అంటాడు నందు.

తులసి ముందే నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? ఇక నాకు రెస్పెక్ట్ ఏం ఇస్తుంది అని అంటాడు నందు. ఇప్పటికే బాహుబలిలా ఫీల్ అవుతోంది తులసి.. అంటుంది లాస్య. వాళ్ల చావు వాళ్లను చావనీయ్. నన్నెందుకు అవమానించడం అని అంటాడు నందు.

నేను ఇక సామ్రాట్ గాడి కంపెనీలో అడుగు పెట్టను. వాడు నాకు బద్ధశత్రువు. నువ్వు కూడా ఏదో ఒక రోజు వాడి కంపెనీ నుంచి బయటికి వస్తావు అని అంటాడు నందు. కట్ చేస్తే అర్ధరాత్రి అవుతుంది. బ్యాగు పట్టుకొని బయటికి వెళ్తున్న శృతిని చూసి ఆగు అంటుంది తులసి.

లోపలికి రా అంటుంది తులసి. దీంతో శృతి వెనక్కి తిరుగుతుంది. ఎక్కడికి బయలుదేరావు అని అడుగుతుంది. మా అత్తయ్య వాళ్ల ఇంటికి అంటుంది. ఇంత రాత్రి పూట బయలుదేరడం ఏంటి అని అడుగుతుంది.

కనీసం చెప్పి అయినా వెళ్లాలి కదా అంటుంది. దీంతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అంటుంది శృతి. అసలు ఏమైంది అని అడుగుతుంది తులసి. దీంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది శృతి.

అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. దీంతో అసలు విషయం మొత్తం చెప్పేస్తుంది శృతి. దీంతో ప్రేమ్ ను పిలుస్తుంది తులసి. దీంతో అందరూ వస్తారు. ప్రేమ్ చెంప వాయిస్తుంది తులసి.

శృతిని ఇంట్లో నుంచి వెళ్లిపోమంటావా? తనను ఏడిపిస్తావా అని అంటుంది. ఆ తర్వాత ప్రేమ్, శృతి, అభి, అంకితలకు మళ్లీ ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp