Intinti Gruhalakshmi 15 Oct Today Episode : మళ్లీ ప్రేమ్ శృతి, అభి అంకిత ఫస్ట్ నైట్.. రెచ్చిపోయిన ప్రేమ్, అభి.. మరోవైపు తులసికి షాకిచ్చిన అనసూయ

Authored By Varun G | The Telugu News | Published on: October 15, 2022, 9:00 am

Intinti Gruhalakshmi 15 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 అక్టోబర్ 2022, శనివారం ఎపిసోడ్ 764 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వేం మనిషివిరా. నీకోసం శృతి పనిమనిషిగా చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి తిడతావా? ఇన్నాళ్లు నువ్వు నా కొడుకువు అనుకున్నా కానీ.. నువ్వు కూడా ఆ నంద గోపాల్ కొడుకువే అని ప్రేమ్ తో అంటుంది తులసి. మా ఆడవాళ్లను కూడా మర్యాదగా బతకనివ్వండి. మీ అహంకారాన్ని తగ్గించుకోండి. కుదరదు అనుకుంటే మాకింత విషం తీసుకొచ్చి ఇవ్వండి అని అంటుంది తులసి. దీంతో తన కాళ్ల మీద పడి నన్ను క్షమించమ్మా.. తప్పు చేశాను. బాధపెట్టాను. ఇంకెప్పుడూ ఇలా చేయను. నేను చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసొచ్చింది. నన్ను క్షమించమ్మా ప్లీజ్.. అంటాడు ప్రేమ్. దీంతో క్షమించాల్సింది నేను కాదు.. శృతి అంటుంది తులసి. వెళ్లి తన కాళ్లు పట్టుకో అంటుంది తులసి.

intinti gruhalakshmi 15 october 2022 full episode

intinti gruhalakshmi 15 october 2022 full episode

వెళ్లి తన కాళ్లు పట్టుకోబోతాడు ప్రేమ్. దీంతో వద్దు అని వారిస్తుంది శృతి. తర్వాత ప్రేమ్ ను హత్తుకుంటుంది. తప్పు చేశాను.. నన్ను క్షమించు అంటాడు ప్రేమ్. ఇట్స్ ఓకే అంటుంది శృతి. సమస్య నీలోనే దాచుకొని నీలో నువ్వే కుమిలిపోతే పరిష్కారం దొరకదు. సమస్యను మీరు పరిష్కరించుకోలేనప్పుడు పెద్దవాళ్లం మేము ఉన్నాం కదా. ఇలా జీవితాలను నాశనం చేసుకుంటారా? చిన్న చిన్న సమస్యకే భార్యాభర్తలు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎదురు దెబ్బలు తగిలాయి కాబట్టే జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నాం. మీరు కూడా ఇలాంటి ఏవైనా సమస్యల్లో ఉన్నారా అని అభి, అంకితను అడుగుతుంది తులసి. దీంతో ఏం లేదు అంటారు ఇద్దరు. దెబ్బ బాగా తాకిందా.. సారీ అంటుంది తులసి. ఆ దెబ్బ తగ్గాలంటే ఆయన భార్య అక్కడ ముద్దు పెడితే సరి అంటాడు పరందామయ్య.

దీంతో శృతి, ప్రేమ్ కు ముద్దు పెడుతుంది. ముడుపులు పెట్టడమే కాదు.. ఇంట్లో ఊయల కూడా కట్టాలి అంటుంది అనసూయ. అంటే రెండు జంటలకు మళ్లీ ఫస్ట్ నైట్ జరపాలా అంటాడు పరందామయ్య. అంతేగా మరి అంటుంది అనసూయ. మరోవైపు ఇద్దరు కోడళ్లను తయారు చేస్తుంటుంది తులసి.

నాకు మీ పద్ధతి ఏం నచ్చలేదు అని తులసితో అంకిత అంటుంది. నాకు కూడా నచ్చలేదు అంటుంది శృతి. మరోవైపు పరందామయ్య అభి, ప్రేమ్ లకు బస్కీలు తీయిస్తాడు. ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళేముందు ఇలా బస్కీలు తీయడం మన వంశం అలవాటు అంటాడు పరందామయ్య.

Intinti Gruhalakshmi 15 Oct Today Episode : రూమ్ లోకి అంకిత కోసం పాలు తీసుకొని వచ్చిన అభి

తర్వాత ఇక ఆటపట్టించడం ఆపండి అంటుంది అనసూయ. ఆ తర్వాత ఇద్దరి రూమ్స్ ను అలంకరిస్తారు. ఇద్దరు ఎవ్వరి రూమ్స్ కు వాళ్లు వెళ్లిపోతారు. ఫోన్లలో ఉప్పెన పాట జలజల పాతం పాట చూస్తారు. ఆ తర్వాత ప్రేమ్.. శృతి కోసం వెయిట్ చేస్తుంటాడు.

అంకిత.. అభి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శృతి పాలు తీసుకొని ప్రేమ్ గదిలోకి వెళ్తుంది. మరోవైపు అభి.. అంకితకు పాలు తీసుకొని వెళ్తాడు. నేనైతే సిగ్గుతూ చచ్చిపోయాను. నువ్వు రిక్వెస్ట్ చేశావని నేను పాల గ్లాస్ తీసుకొచ్చా. ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు అభి.

దీంతో ఫస్ట్ నైట్ రోజు నేను పాలు తీసుకొచ్చా కదా.. ఈసారి వెరైటీగా ఉంటుందని నిన్ను పాల గ్లాస్ తీసుకురా అని చెప్పా. ఆలస్యం ఎందుకు సగం పాలు తాగి ఇవ్వు అంటుంది అంకిత. ఆ తర్వాత శృతి మొత్తం పాలు తాగుతుంది. అలా తాగేశావు ఏంటి అని అడుగుతాడు ప్రేమ్.

దీంతో ఇదేమన్నా మొదటి రాత్రా.. సగం తాగి నీకు ఇవ్వడానికి అంటుంది శృతి. పెళ్లయిన ఇన్నాళ్లకు మళ్లీ కొత్తగా ఫస్ట్ నైట్ ఏంటి.. ఈ పెద్దాళ్లకు పిచ్చి పట్టింది. కానీ.. వీళ్లు ఎంత మంచి పని చేశారో ఇప్పుడు అర్థం అవుతోంది అంటాడు ప్రేమ్. చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూసుకున్నాం.

ఒకరికి ఒకరంగా బతకాల్సిన మనం.. దూరం చేసుకున్నాం. నిజం చెబుతున్నాను శృతి ఇలాంటి రోజు ఒకటి మళ్లీ వస్తుందని అనుకోలేదు అంటాడు ప్రేమ్. ఇక మాటలు చాలు అంటాడు అభి. మరి ఇంకా ఏంటి అని అంటుంది అంకిత. మెల్లగా రొమాన్స్ స్టార్ట్ చేస్తారు రెండు జంటలు.

మరోవైపు తులసి గురించి రెచ్చగొట్టేలా అనసూయకు చెబుతుంది లాస్య. నందు జాబ్ పోయింది. సామ్రాట్ ముందు రెచ్చగొట్టేలా మాట్లాడిందని అనసూయకు చెబుతుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp