Intinti Gruhalakshmi 16 Nov Today Episode : ప్రాజెక్ట్ క్యాన్సిల్.. మేం ప్రాజెక్ట్ చేయం అని క్లయింట్ కు తెగేసి చెప్పేసిన తులసి.. ఈ విషయం తెలిసి నందు ఏం చేస్తాడు?
Intinti Gruhalakshmi 16 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 478 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి.. నందుకు టై కట్టడం చూసిన లాస్యకు చిరాకు వస్తుంది. వెంటనే లాప్ టాప్ ఆపేసి కోపంతో బయటికి వస్తుంది. అప్పుడే భాగ్య వస్తుంది. ఏమైంది లాస్య అంటే.. అంతా నీవల్లే అంటూ కోప్పడుతుంది. నేనేం చేశా అంటే.. నువ్వే కదా.. ఇంట్లో గొడవలు చెప్పకుండా ఆపావు అంటూ భాగ్య మీద అరుస్తుంది. కూల్ లాస్య.. ముందు క్లయింట్ మీటింగ్ పూర్తి కానీ.. ఇంటికి వచ్చాక మీ పెళ్లి వెంటనే జరిగిపోవాలని రచ్చ చేయ్ అని చెబుతుంది భాగ్య.

intinti gruhalakshmi 16 november 2021 full episode
దీంతో ఇదేదో ప్లాన్ బాగుందే అని అనుకుంటుంది లాస్య. నందు తొందరపడేలా చేసి.. వెంటనే పెళ్లి చేసుకుంటేనే ఈ ఇంట్లో నీకు ఓ స్థానం ఉంటుంది. అర్థమయిందా.. ఈ ఇంటికి నువ్వు యజమానురాలివి అయినప్పుడే ఈ ఇంటి వాళ్లకు నీకు సలామ్ కొడతారు.. గులామ్ అవుతారు. గుర్తు పెట్టుకో. విజయం వైపు అడుగులు వేయ్ లాస్య అని చెప్పి హిత బోధ చేస్తుంది భాగ్య. దీంతో ఇదే కరెక్ట్ అని అనుకుంటుంది లాస్య.
కట్ చేస్తే.. నందు, లాస్య.. ఇద్దరూ క్లయింట్ మీటింగ్ కు వెళ్తారు. మీ ప్రాజెక్టు వాల్యూలో 60 శాతం మాత్రమే మీకు ఇవ్వాలని బోర్డ్ డిసైడ్ చేసింది.. అని తులసికి క్లయింట్ చెబుతుంది. 10 కోట్లలో 6 కోట్లు మాత్రమే ఇస్తారా అని నందు ప్రశ్నిస్తాడు. అవును.. అని అంటుంది క్లయింట్. అందుకే మిమ్మల్ని పిలిచాం అని చెబుతుంది. ధీరజ్.. అగ్రిమెంట్ అని చెబుతుంది.
సంతకం చేయండి అంటే నేను చేయను.. మమ్మల్ని సంప్రదించకుండా ఎలా చేస్తారు.. అంటూ నందు సీరియస్ అవుతాడు. మా నిర్ణయం కూడా వినండి. మేము ప్రాజెక్టు పూర్తి చేయం.. అగ్రిమెంట్ కూడా సైన్ చేయం ఏం చేస్తారో చేసుకోండి అంటాడు. దీంతో అలా చేస్తే మిమ్మల్ని కోర్టుకు లాగుతాం అంటుంది క్లయింట్.
Intinti Gruhalakshmi 16 Nov Today Episode : క్లయింట్ కు చుక్కలు చూపించిన తులసి
ఇంతలో తులసి.. నందును ఆపుతుంది. మీరు ఏ క్లాజ్ ప్రకారం నందు మీద కేసు వేయాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది తులసి. ప్రాజెక్టు గడువులోపల పూర్తి చేయకపోతే.. నందు పెనాల్టీ పే చేయాలని అగ్రిమెంట్ లో ఉంది.. అది చూపించు అని ధీరజ్ కు చెబుతుంది క్లయింట్.
అగ్రిమెంట్ లో అసలు ఆ క్లాజ్ ఉంటే కదా.. అతడు చూపించడానికి అంటుంది తులసి. దీంతో క్లయింట్ షాక్ అవుతుంది. ఆ క్లాజ్ అగ్రిమెంట్ లో లేదు మేడమ్ అంటాడు దీరజ్. దీంతో క్లయింటే ఆ ఫైల్ ను తీసుకొని చెక్ చేస్తుంది కానీ.. అందులో ఆ క్లాజ్ ఉండదు.
అనుకున్న టైమ్ లో ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే డీల్ క్యాన్సిల్ చేసుకుంటామని మాత్రమే అందులో ఉంది. అర్థం అయింది కదా.. ఇక మీకు కోర్టుకు వెళ్లే ఆప్షన్ లేదు. మా మంచితనాన్ని మీరు అడ్వాన్స్ గా తీసుకోవాలని అనుకున్నారు కాబట్టి మీ ప్రాజెక్టును మేం చేయం అని తులసి తెగేసి చెబుతుంది.
తులసి చేసిన పనికి నందు షాక్ అవుతాడు. నువ్వు ఇదంతా ఇంత క్లియర్ గా ఎలా చేశావు. నీకు క్లాజ్ లేదని ఎలా తెలిసింది.. అని అడుగుతాడు నందు. తన అన్నయ్యకు అగ్రిమెంట్ పంపించి తెలుసుకున్నాను అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.