Intinti Gruhalakshmi 16 Oct Today Episode : పరందామయ్య, అనసూయను లాస్య చంపేస్తుందా? తులసి ఏం చేస్తుంది? హనీ కోసం అత్తామామను తులసి పోగొట్టుకుంటుందా?
Intinti Gruhalakshmi 16 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 16 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1076 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జాను చాలా మారిపోయిందని.. తనతో జాగ్రత్తగా ఉండాలని విక్రమ్ తో చెబుతుంది దివ్య. మన బతుకులు ప్రమాదంలో ఉన్నాయని చెప్పినా తులసి పట్టించుకోవడం లేదు. ఎంతసేపు హనీ గురించే ఆలోచిస్తోంది అని అంటాడు నందు. దీంతో ఇది మనకు కొత్తేమీ కాదు కదా. ఏదైనా చేయాలని అనుకుంటే తులసి ఎంతకైనా తెగిస్తుంది అని అంటుంది అనసూయ. మనసులో ఎంత ప్రేమ ఉందో అంత మొండితనం కూడా ఉంది. వద్దన్నా అక్కడికి వెళ్లింది. ఏం జరిగిందో ఏమో అని నందు చెబుతాడు. ఇంతలో తులసి వస్తుంది. అత్తయ్య టిఫిన్ ఏం చేయమంటారు అంటూ కూల్ గా మాట్లాడుతుంది. అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు పరందామయ్య. దీంతో జరగడానికి ఏముంది మామయ్య.. మాకు గొడవలు ఇష్టం లేదు. ఎవరు హద్దుల్లో వాళ్లం ఉందాం అని చెప్పాను. హనీ మన దగ్గరే ఉండాలని చెప్పాను. దీంతో దానికి కూడా వాళ్లు ఒప్పుకున్నారు అని చెబుతుంది తులసి. దీంతో నేను నమ్మను అంటాడు నందు. ఎందుకు నమ్మరు అంటుంది తులసి. హనీ కోసం చంపడానికి కూడా సిద్ధమయ్యారు. ఇప్పుడు హనీని ఎందుకు వద్దంటారు అంటాడు పరందామయ్య.
హనీ గురించి చిన్న సందేహం అంటాడు పరందామయ్య. దీంతో అక్కడ ఏం జరిగిందో నేను చెప్పాల్సింది చెప్పాను.. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం. నేనేమీ బలవంతం చేయడం లేదు అంటుంది తులసి. దీంతో అక్కడుంది లాస్య. మనల్ని దెబ్బతీయడం కోసం కాచుక్కూర్చుంది. ఆ ఇంట్లో వాళ్లను రెచ్చగొడుతూ గప్పం గడుపుకోవాలని చూస్తోంది.. అని అంటుంది అనసూయ. నీ కొడుక్కి నచ్చజెప్పడం చేతకాకపోతే తులసి నచ్చజెప్పింది. దానికి నువ్వెందుకు కంగారు పడతావు అని అనసూయతో అంటాడు పరందామయ్య. ఒకవేళ వాళ్లు ఎదురు తిరిగితే సర్ది చెప్పుకునే బాధ్యత కూడా తులసిదే అంటాడు పరందామయ్య. దీంతో వాళ్లు డబ్బు మనుషులు. డబ్బు కోసం వాళ్లు ఏమైనా చేస్తారు అంటాడు నందు. దీంతో ఇక నుంచి ఫ్యామిలీని కాపాడుకునే బాధ్యత నాదే. వాళ్లను అస్సలే వదలను అని మనసులో అనుకుంటుంది తులసి.
Intinti Gruhalakshmi 16 Oct Today Episode : విక్రమ్ ను దక్కించుకుంటా అని రాజ్యలక్ష్మికి మాటిచ్చిన జాను
మరోవైపు జాను.. విక్రమ్, దివ్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్యలక్ష్మి అక్కడికి వస్తుంది. నా వల్లనే ఇదంతా జరిగింది. నన్ను క్షమించమ్మా అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో లేదు అత్తయ్య తప్పు నాదే అంటుంది జాను. రూమ్ లో ఫోన్ పెడుతుందని ఎవ్వరూ ఊహించలేదు అంటుంది జాను. ఎందుకు బావ మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు దివ్య గురించి పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు అని అంటుంది జాను.
నీ ప్లేస్ లో ఎవ్వరు ఉన్నా అదే చేస్తారు. ఇన్ని ఇబ్బందులు పడుతూ నువ్వు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. నీ దారి నువ్వు చూసుకో అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో నా దారి మొత్తం బావ వైపే అంటుంది జాను. దివ్య మెంటాలిటీ ఏంటో నాకు తెలిసిపోయింది. బావను వదిలేసి ఎలా వెళ్తాను. నాకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఓర్చుకుంటాను.. నా స్థానాన్ని నేను తిరిగి చేజిక్కించుకుంటాను అత్తయ్య అంటుంది జాను. వెంటనే యాక్షన్ స్టార్ట్ చేస్తాను. దివ్య మనసులో ఉన్న ప్రేమను చంపేస్తాను. అప్పుడే బావ నా వైపు మళ్లుతాడు అంటుంది జాను. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అంటుంది జాను.
మరోవైపు తులసిని ఏం చేయాలా అని రత్నప్రభ, లాస్య ఇద్దరూ ఆలోచిస్తుంటారు. తనతో అంత ఈజీ కాదు. తను మొండిది. స్ట్రాటజీ ప్రకారం ఆచీ తూచీ అడుగులు వేయాలి. వెంటనే తులసి మన మాట వినదు. నెమ్మదిగా తన నరాల్లోకి భయాన్ని ఎక్కించాలి అంటుంది లాస్య.
తులసిని ఎదుర్కోవడం కష్టం కానీ అసాధ్యం కాదు. ఇప్పట్లా కాదు. ఈ సారి లాస్య గెరిల్లా యుద్ధం చేయబోతోంది. రంగంలో కనబడదు కానీ.. వీరంగం ఆడతాను.. తులసిని పరుగెత్తిస్తూనే ఉంటాను అంటుంది. వెంటనే ఓ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడుతుంది లాస్య.
మరోవైపు తులసి, నందు, హనీ ముగ్గురూ రెస్టారెంట్ కు వెళ్తారు. ఇంతలో తులసికి ఫోన్ వస్తుంది. లాస్య ఫోన్ చేస్తుంది. ఎందుకు ఊరికే ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటావు. నీకు పనిపాట లేదా అంటే తెలుసు. నా, నీ మాజీ మొగుడితో కలిసి ఎంజాయ్ చేయడానికి రెస్టారెంట్ కు వచ్చావు. నాకు ఎలా తెలిసిందని అనుకుంటున్నావా? ఎప్పుడు నువ్వు ఏం చేస్తావు.. ఎక్కడ ఉంటావు అనేది లైవ్ లో తెలిసిపోతుంది. యుద్ధం మొదలైంది కదా. అటాక్ స్టార్ట్ అయింది.. అంటుంది.
ఎందుకు కాల్ చేశావు అంటే.. హ్యాండ్ బ్యాగ్ లో రివాల్వర్ పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏం వచ్చింది. నేనంటే భయపడా అంటుంది లాస్య. ఇప్పుడు నువ్వు సెక్యూరిటీ చెక్ నుంచి వెళ్తే బ్యాగులో రివాల్వర్ ఉన్నట్టు తెలిసిపోతుంది. లైసెన్స్ అడుగుతారు. పోలీసులు లాక్కెళ్తారు. జైలులో కూర్చోబెడతారు. హనీ నందు దగ్గరే ఉండిపోతుంది. గట్టిగా బెదిరిస్తే హనీని తిరిగి తెచ్చిస్తాడు. అక్కడితో కథ ముగిసిపోతుంది. నన్ను బెదిరించి ఏం సాధించావు. జైలుకు వెళ్తాక వచ్చి పలకరిస్తాలే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది లాస్య.
బ్యాగులో ఉన్న గన్ చేసి ఏం చేయాలో అర్థం కాదు తులసికి. పదా లోపలికి వెళ్దాం అంటే ఈ రెస్టారెంట్ వద్దు.. వేరే రెస్టారెంట్ కి వెళ్దాం అంటుంది తులసి. దీంతో వద్దు.. ఇక్కడే తిందాం అంటుంది హనీ. అక్కడ చెకప్ జరుగుతూ ఉంటుంది. లోపల మినిస్టర్ గారు ఉన్నారు అందుకే ఈ సెక్యూరిటీ చెక్ మేడమ్ అంటారు. తులసి బ్యాగ్ ను చెక్ చేస్తారు కానీ.. సెక్యూరిటీ సౌండ్ రాదు.
దీంతో ఊపిరి పీల్చుకుంటుంది తులసి. మరోవైపు వెంటనే లాస్య ఫోన్ చేసి ఏంటక్కా భయపడ్డావా? అది ఉత్తుత్తి రివాల్వర్ అంటుంది. ఇందాక నీకు డ్యాష్ ఇచ్చిన అమ్మాయి అందులో రివాల్వర్ పెట్టింది. డుప్లికేట్ బదులు ఒరిజినల్ పెట్టి ఉంటే ఏం జరిగి ఉండేది అంటుంది. నీకు ఇంకో సర్ ప్రైజ్ ఉంది. నన్ను ఈజీగా తీసుకోకు. హనీని తిరిగి పంపు. అప్పటి వరకు ఇలాగే వెంటపడతా అంటుంది లాస్య.
ఒరిజినల్ రివాల్వర్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టొచ్చు కదా లాస్య అని అడుగుతుంది రత్నప్రభ. దీంతో ప్లాన్ నాది. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలియదా? మీకు చెప్పాలా? నా లెక్కలు నాకు ఉంటాయి. నేను అనుకున్నట్టుగా చేస్తా అంటుంది లాస్య.
మరోవైపు రెస్టారెంట్ లో బిర్యానీ తింటుండగా మళ్లీ ఫోన్ చేస్తుంది లాస్య. అక్కడ మీ వాళ్లు ప్రమాదంలో ఉన్నారని చెబుతుంది లాస్య. నీ వాళ్లను ఎలా కాపాడుకుంటావో చూసుకో అంటుంది. మరోవైపు పరందామయ్య, అనసూయ ఒంటరిగా ఉండటం చూసి ఇంటికి రౌడీలు వెళ్లి కరెంట్ కట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.