Intinti Gruhalakshmi 17 Jan Episode Highlights : ఇక వసంత ఈ ఇంట్లో ఉండకూడదు అంటూ తులసి హుకుం జారీ.. నువ్వెవరు అంటూ తులసిపై లాస్య సీరియస్

Authored By Varun G | The Telugu News | Published on: January 16, 2022, 10:20 am

Intinti Gruhalakshmi 17 Jan Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 17 జనవరి, 2022 సోమవారం ఎపిసోడ్ 531 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, శృతికి ఇప్పటి వరకు ఫస్ట్ నైట్ కాలేదని తెలుసుకున్న అనసూయ.. మరోసారి ప్రేమ్, శృతికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. మళ్లీ ఈ హడావుడి ఎందుకు అని తులసితో అంటుంది శృతి. కానీ.. ఏం కాదు.. అని చెప్పి తనను మళ్లీ పెళ్లికూతురులా రెడీ చేసి శోభనం గదిలోకి పంపిస్తారు. ఆ తర్వాత ప్రేమ్ రూమ్ లో శృతి కోసం వెయిట చేస్తూ ఉంటాడు. శృతి పాల గ్లాస్ తో తన దగ్గరికి వస్తుంది. పాలు తీసుకొని ఇక్కడికి రా అంటాడు ప్రేమ్.

intinti gruhalakshmi 17 january 2022 episode highlights

intinti gruhalakshmi 17 january 2022 episode highlights

ఆ తర్వాత కాసేపు పోట్లాడుకొని ఇద్దరూ ప్రశాంతంగా ఉంటారు. ఆ తర్వాత ఇద్దరూ ఫస్ట్ నైట్ చేసుకుంటారు. మరోవైపు లాస్య కూడా నైట్ డ్రెస్ వేసుకొని నందును టెంప్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ.. నందు మాత్రం అస్సలు పట్టించుకోడు. దీంతో లాస్యకు కోపం వస్తుంది. ఇంత మంచిగా డ్రెస్ వేసుకున్నా కూడా చూడటం లేదేంటి.. నిన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు.. అని అనుకొని నందు.. ఎందుకు నావైపు తిరిగి చూడటం లేదు అంటుంది. చూశానే అనుకో.. నువ్వేదో అంటావు.. ఆ తర్వాత నేనేదో అంటాను. మాటా మాటా అనుకుంటాం. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు నచ్చదు.. ఇదంతా అవసరమా అంటాడు నందు.

సాయంత్రం జరిగిన దానికి సారీ నందు. నీ జాబ్ విషయంలో నేను ఓవర్ గా రియాక్ట్ అయ్యాను. నీకు నచ్చిందే చేయి. సారీ చెప్పాను కదా అంటుంది లాస్య. ప్రేమ ఉన్నచోటే కోపం కూడా ఉంటుంది. నీ మంచి కోరుకుంటాను కాబట్టే.. నీ మంచి కోసమే అలా మాట్లాడాను అంటుంది లాస్య.

నీ ఇష్టం గురించి ఇక మాట్లాడను. నాకు నాకంటే నీ సంతోషమే ఇష్టం అంటుంది లాస్య. ఒక్కసారిగా నీలో ఈ మార్పు ఏంటి అంటాడు నందు. నీ మనసు నన్ను అనుమానిస్తోంది అంటుంది లాస్య. అప్పుడు అది నా తప్పు కాదు.. నా మనసు తప్పు. నువ్వు ప్రేమతో నా దగ్గరికి రాలేదు. అభద్రతతో దగ్గరికి వచ్చావు అనిపిస్తుంది అంటాడు నందు.

Intinti Gruhalakshmi 17 Jan Episode Highlights : నడి ఇంట్లో గుర్రు పెట్టి పడుకున్న వసంత.. కోపంతో రగిలిపోయిన అనసూయ

ఆ తర్వాత అనసూయ, వసంత మధ్య గొడవ జరుగుతుంది. నడి ఇంట్లో వసంత పడుకొని గుర్రు పెడుతుండటంతో అనసూయకు కోపం వచ్చి లేపుతుంది. దీంతో ఇద్దరూ కాసేపు గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత తులసి వచ్చి వాళ్లను ఆపబోతుంది.

దీంతో తులసి మీద కూడా సీరియస్ అవుతుంది వసంత. ఆ తర్వాత వెళ్లి అనసూయ కూర్చునే సోపాలో పడుకుంటుంది వసంత. అక్కడికి కూడా వచ్చి తనను లేపుతుంది అనసూయ. దీంతో ముసలి.. గిసలి అంటూ అనసూయపై నోరుపారేసుకుంటుంది వసంత.

దీంతో వసంతపై సీరియస్ అవుతుంది తులసి. ఇంతలో ఇంట్లో వాళ్లంతా అక్కడి వస్తారు. లాస్య కూడా వస్తుంది. లాస్యకు జరిగిందంతా చెబుతుంది వసంత. నీ పిల్లలకు వసంతతో సమస్య ఉంటే తనతో ఎలా మసులుకోవాలో నేర్చుకోమను అని అంటుంది లాస్య.

అత్తయ్య గారికి ప్రాబ్లమ్ ఉంటే భరించమను అంటుంది. మామయ్య గారికి ప్రాబ్లమ్ ఉంటే.. ఎక్కడో మూలన మాట్లాడకుండా పడి ఉండమను అంటుంది లాస్య. లాస్య.. నువ్వు మాటలు మించుతున్నావు అంటుంది. మిస్టర్ నందగోపాల్.. ఇక్కడితో దీన్ని ఆపాలనుకుంటున్నాను.

ఇక వసంత.. ఈ ఇంట్లో ఉండటానికి వీలు లేదు అంటుంది తులసి. దీంతో వసంత గురించి నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు అంటుంది లాస్య. అసలు నీకేం హక్కు ఉంది అంటుంది లాస్య. దీంతో ఇది నా ఇల్లు అని గట్టిగా అరిచి చెబుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp